CSS Drop Down Menu

Friday, May 18, 2018

చిన్న పిల్లాడిలా ఏడ్చిన దర్శకుడు శంకర్ ! ఎందుకో తెలుసా ?



అపరిచితుడు చిత్రం వెనుక ఉన్న కష్టాన్ని తాజాగా స్టంట్ డైరెక్టర్ సిల్వ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సందర్భంలో జరిగిన ప్రమాదం వలన శంకర్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వ తెలిపాడు.

అపరిచితుడు చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాన్ని సిల్వ వివరించారు.





ఆ ఫైట్ కోసం దాదాపు 150 మంది స్టంట్ మేన్స్ ని ఉపయోగించాం. సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలిచిన ఫైట్ అది. విక్రమ్ ఒక్కడే వారందరితో పోరాడే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో దాదాపు 75 మంది స్టంట్ మెన్స్ గాల్లో ఎగరాల్సి ఉంటుంది. ఓ లారీకి తాడులు కట్టి వారంతా గాల్లో ఎగిరేలా ప్లాన్ చేసాం. శంకర్ యాక్షన్ చెప్పక ముందే డ్రైవర్ అనుకోకుండా లారీని కదిలించాడు. అప్పటికి స్టంట్ మెన్స్ సిద్ధంగా లేరు.

డ్రైవర్ చేసిన పొరపాటు వలన స్టంట్ మెన్స్ స్టేడియం టాప్ తగిలి కింద పడ్డారు. అందరికి గాయాలయ్యాయి. కొందరికి కంటి భాగంలో కూడా రక్తం కారింది. కొందరికి ఫిట్స్  కూడా వచ్చాయి . వేగంగా స్పందించడం వలన అందరిని రక్షించుకున్నాం అని సిల్వా తెలిపాడు.

దర్శకుడు శంకర్ ఆ సమయంలో చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వా తెలిపాడు. ఆయన్ని చూసి నేను కూడా తట్టుకోలేక పోయా అని సిల్వ తెలిపాడు. 2005 లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది అఖండ విజయం సాధించింది.



0 comments:

Post a Comment