CSS Drop Down Menu

Friday, February 9, 2018

"తక్కువ వయస్సు" ఉన్నవారిలా కనిపించాలని ఉందా? ఐతే ఇవి తినండి.

1. పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలమంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించి... ఎలా తిన్నా కాలేయం, జుట్టు, గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొదిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది.



2. క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. 

3. పెసల్ని క్రమంతప్పకుండా తినేవాళ్లు తమ నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువుగా కనిపిస్తారు. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

4. అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడేవాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని క్యాల్షియం ఎముక నిర్మాణానికి దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపీ రోగులకు ఇవి మంచిదే. 

5. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... తదితర లోపాలతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు, హర్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకి తోడ్పడతాయి.

0 comments:

Post a Comment