CSS Drop Down Menu

Thursday, January 4, 2018

అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఎందుకు "ఏడవరో" తెలుసా?

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అందులోను మహిళలయితే ఇక చెప్పాల్సిన పని వుండదు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏడవరు. వారికి కష్టం వచ్చినా కంటి నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదో చాలామందికి తెలియదు.

అమ్మాయిలు, అబ్బాయిల్లోని భావ నియంత్రణపై పరిశోధనలు జరిపితే కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ పరిశోధనల్లో అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేర్వేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువగా ఉంటుందట. అందుకే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఉంటుందట. 

అందుకే మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని చెబుతున్నారు. అందుకే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఏడవరని పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన 110 మందిపై చేసి ఒక నిర్థారణకు వచ్చారు. అదీ విషయం.

0 comments:

Post a Comment