CSS Drop Down Menu

Thursday, December 28, 2017

చిరుతో సమస్యలొచ్చాయ్? అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ పర్యటనలో ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవడానికి, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు అల్లు అరవింద్ కూడా ఓ కారణమంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిరంజీవితో తనకు బావాబావమరిది రిలేషనే కాకుండా అంతకుమించి మంచి స్నేహితులమనే బంధం వుందని చెప్పుకొచ్చారు. 
తనపై నమ్మకంతో మెగాస్టార్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని, దీంతో మనసులో రెండో ఆలోచనల లేకుండా చిరంజీవి ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేయగలిగారన్నారు. తనకు చేతనైన సాయం చిరంజీవికి చేశానని తెలిపారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు కలసి కొనసాగినవారు చాలా అరుదని తనకు గుర్తున్నంత వరకు అలాంటి వారిలో బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి, చిరంజీవి-తాను ఉన్నామని అరవింద్ చెప్పారు. 

కానీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని తమ ఇద్దరి మధ్య చిన్నచిన్న సమస్యలు వచ్చాయని అల్లు అరవింద్ తెలిపారు. వ్యక్తిగతంగా తమ మధ్య విభేదాలు లేవని రాజకీయాల్లో వెళ్లినప్పుడు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. కానీ అవికూడా తమపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని ఎప్పటిలాగానే తామిద్దరం కలిసే ముందుకు సాగుతున్నామని వివరించారు.

Tuesday, December 26, 2017

"బ్లాక్ అండ్ వైట్" ని "కలర్" ఫోటోగా సులువుగా మార్చుకోండి !

మీ దగ్గర ఉన్న"బ్లాక్ అండ్ వైట్ ఫోటో" ని "కలర్ ఫోటో"గా ఎటువంటి సాప్ట్వేర్(software) మరియు  యాప్ ఉపయోగించకుండా సులువుగా మార్చుకోవాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసుకొని ఆనందించండి.బ్లాగర్ వీక్షకులు నా యొక్క బ్లాగును ఆదరించినందుకు నా కృతజ్ఞతలు. అలాగే నా యొక్క "యూట్యూబ్ ఛానల్"ను కూడా  Subscribe చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 

Subscribe చేసిన తరువాత దాని ప్రక్కనే ఉన్న "గంట" సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి  వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా పొందగలరు.   

Friday, December 22, 2017

"రాత్రి" పూట పుట్టేవారు ఎలా ఉంటారో తెలుసా?

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు ఉంటారు. ఇంకా అసలు తెలివిలేని వారు చాలామందే ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్నకొద్దీ వస్తాయి. ఇక తెలివితేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారట. మీరు విన్నది నిజమే. పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమిది. 

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు వ్యక్తులను, వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు. దీన్ని మొత్తం బేరీజు వేసుకున్న తరువాత రాత్రి పూట పుట్టిన వారు బాగా తెలివిమంతులు అవుతారని, వారికే ఐక్యూ ఎక్కువగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. 

రాత్రి పూట పుట్టేవారికి తెలివితేటలే కాదు, సమస్యను పరిష్కరించే సత్తా కూడా ఉంటుంది. వీరు చదువుల్లో రాణిస్తారు. గొప్ప ఉద్యోగాలు చేస్తారు. సాధారణంగా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా. కానీ రాత్రిపూట పుట్టిన వారికి ఐదు గంటల నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుంది. వీరికి ఎక్కువ నిద్ర అవసరం లేదు. పనిలో బాగా చురుగ్గా ఉంటారు. ఎక్కువగా పనిచేస్తారు.


Friday, December 15, 2017

నాలుగు చెవుల గేదె !

Wednesday, December 13, 2017

మగాళ్ళను మించిపోయిన మహిళలు ! ఏ విషయం లోనో తెలుసా?

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ రంగంలో మగాళ్ళ కంటే స్త్రీలే ఒక అడుగు ముందున్నారట. ఇంతకీ మహిళలు ఏ రంగంలో ముందున్నారనే కదా మీ సందేహం. మద్యం సేవించడంలో మగాళ్ళను స్త్రీలు మించిపోయారట. 


తాజాగా దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగినట్టు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. మందు తాగే మహిళలు ఎక్కువగా ఉన్న జాబితాలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. సుమారు 10 యేళ్ల తర్వాత మద్యం తాగే మహిళల సంఖ్య 0.7 శాతానికి పెరగగా, మద్యం సేవించే పురుషుల శాతం 24.7 కు తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది.

అంటే, గత 2005-2006వ సంవత్సరంలో మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా, ఇది 2015-2016 నాటికి వీరి శాతం 0.7 శాతానికి పెరిగింది. అదీకూడా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యం సేవిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. 

అదేసమయంలో 2005-2006 లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతంగా ఉండగా, 2015-2016 నాటికి  24.7 శాతానికి తగ్గిపోయిందనీ ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో తాగే మహిళల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. దేశ రాజధాని ఢిల్లీలో అయితే, మద్యం సేవించే మహిళలకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ కూడా ఉందట. ఆ యాప్‌కు 'శక్తి' అనే పేరు పెట్టినట్టు సమాచారం. 

Tuesday, December 12, 2017

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకోవాలనుకుంటున్నారా ?

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకొని చూసుకోవాలనుకొంటే నా యొక్క క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆనందించండి. 
Saturday, December 9, 2017

పిజ్జా, బర్గర్ల కన్నా "సమోసా"లే మేలు ?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయంత్రం పూట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల కంటే సమోసా బెటరని ఓ అధ్యయనంలో తేలింది.
అప్పుడప్పుడే నూనెలో వేయించే తాజా సమోసాలు ఆరోగ్యానికి మేలేనని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వ‌హించిన తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. బాడీ బార్డ‌ర్: లైఫ్‌స్టైల్ డిసీసెస్ పేరుతో విడుద‌ల చేసిన ఈ నివేదిక‌లో స్థూల‌కాయ‌త్వం, మాన‌సిక ఎదుగుద‌ల‌, కేన్స‌ర్‌, హృద్రోగాల వంటి రోగాల‌కు ఆహార‌పు అల‌వాట్లకు మ‌ధ్య సంబంధం వున్నట్లు పరిశోధకులు వివరించారు. 

బర్గర్ కంటే సమోసాల్లో రసాయనాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. బర్గర్లతో సాస్, చీజ్.. ఇతర ప్రిజర్వ్ చేసే ఆహార పదార్థాలుంటాయి. ఇవి ఒబిసిటీకి దారితీసే అవకాశాలు అధికంగా వున్నాయి. అయితే సమోసాలో వుండే ఆలూ, పిండి పదార్థాలు సహజమైనవని.. వాటితో ఆరోగ్యానికి కాస్త మేలే జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సమోసాల్లో వుండే గోధుమ పిండి, ఉడికించిన ఆలూ, పచ్చి బఠాణీలు, ఉప్పు, పచ్చిమిర్చి, కూరగాయలు, నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధకులు తెలిపారు. 2016 సెప్టెంబర్ నుంచి మార్చి 2017 వరకు జరిగిన పరిశోధనలో 15 రాష్ట్రాలకు చెందిన 13వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 9-17 ఏళ్ల మధ్య గల విద్యార్థులపై ఈ పరిశోధన జరిపామని చెప్పారు. అధిక చక్కెర, ఉప్పు కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్, బేవరేజస్ వల్లనే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించారు.


Thursday, December 7, 2017

భారతీయులకు వచ్ఛే ప్రాణాంతక జబ్బులకుగల కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట. 

ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి)లోని జీనోమిక్స్‌, ఇంటిగ్రేటివ్‌ బయోలజీ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వెనుక.. జాతి, శారీరక శ్రమ, పోషకాహారం, పెంపకంలాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ విషయాలను అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

Tuesday, December 5, 2017

జీన్స్ ప్రియులా ? ఐతే జాగ్రత్త !

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే షాక్ కాక తప్పరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీన్స్ ఫ్యాంటులతో కాస్త జాగ్రత్తగా వుండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతు జీన్స్‌ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అలాగే జీన్స్ వేసుకుని కింద కూర్చోవడం కూడదు. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం చేయకూడదు. 

జీన్స్ ప్యాంట్ వేసుకుని కాళ్లు ముడుచుకుని కూర్చోవడం ద్వారా కండరాలు, నరాలకు దెబ్బ తప్పదని.. అదే అలవాటుగా పెట్టుకుంటే నడవలేని పరిస్థితికి కూడా దారితీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వ్యాయామం చేసే సమయంలో జీన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకుని స్క్వాటింగ్ చేయడం కూడా ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Saturday, December 2, 2017

భోజనం చేసిన వెంటనే"కూలింగ్ వాటర్"తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిదట. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కొవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుందట. 

అదేసమయంలో భోజనం చేశాక గోరు వెచ్చటి నీరు తాగితే గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పైగా, గోరు వెచ్చని నీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా చేస్తుందట.