CSS Drop Down Menu

Monday, October 30, 2017

పవన్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''తీన్‌మార్ సినిమాతో నాకు రీమేక్ సినిమాలంటేనే విరక్తి కలిగింది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ చేయక తప్పలేదన్నారు".పైగా, నేను పలు రీమేక్ చిత్రాలు చేశాను. కాకపోతే వాటిని తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సీన్లు మార్చాను. కానీ తీన్‌మార్‌ని సేమ్ టు సేమ్ దించేయాల్సి వచ్చింది. తప్పలేదు ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది..'' అంటూ తీన్‌మార్ విషయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు. 

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మరి తెలిసి కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎందుకలా ప్లాప్ సినిమా తీశారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

0 comments:

Post a Comment