CSS Drop Down Menu

Thursday, October 12, 2017

"101సంవత్సరాల బామ్మ"చేసే పని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !

వయసు మళ్ళినవాళ్ళు హాయిగా "కృష్ణా, రామా" అంటూ పొద్దు పుచ్చేస్తుంటారు. ఎనభై, తొంభై, వందేళ్ళ వాళ్ళయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇల్లు కదలడానికే ఆపసోపాలు పడిపోతుంటారు. అయితే ఆ బామ్మ మాత్రం అలాంటిది కాదు. ఏజ్ కూడా ఎంతో కాదు.. జస్ట్.. 101 ఏళ్ళు మాత్రమే.. అయినా పాతికేళ్ళదానిలా చాలా చలాకీగా లైఫ్ లాగించేస్తోంది. పేరు మన్ కౌర్. చండీగఢ్‌కు చెందినదైనా పాటియాలాలో ఉంటోంది. స్పోర్ట్స్, అథ్లెట్స్, ఈవెంట్స్ అంటే ఆమెకు ప్రాణం. ఎందులోనైనా ఈజీగా గెలిచేస్తోంది.జావెలిన్ త్రో, షాట్ పుట్, జిమ్.. రన్నింగ్.. ఏదైనా సరే.. యూత్ తో పోటీ పడుతూ నాదే గెలుపని సగర్వంగా చాటుతోంది.




ఈ మధ్య న్యూజి లాండ్ లోని ఆక్లాండ్ లో జరిగిన వాల్డ్ మాస్టర్స్ గేమ్స్ లో వంద మీటర్ల స్ప్రింట్ లో విక్టరీ సాధించి పాపులర్ అయిపోయింది. చైనాలో ఇటీవల ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి ఉబలాటపడినా.. వీసా లభించలేదు. అయినా కౌర్ చలించలేదు. అన్ని ఆటల్లోనూ రాణిస్తున్న ఈమెను 'మిరకిల్ ఫ్రం చండీగఢ్' అని అంతా అభివర్ణిస్తుంటారు. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని కౌర్ చెబుతోంది. ఆహారం మితంగా తినాలని, రోజూ జిమ్ కెళ్ళి వ్యాయామం చేయాలని అంటోంది. అన్నట్టు ఈమె 79 ఏళ్ళ కొడుకు గురు దేవ్ సింగ్ కూడా మంచి క్రీడాకారుడే.. ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటాడు.




1 comment: