CSS Drop Down Menu

Thursday, September 7, 2017

హోటల్ ఓపెనింగ్ చేసిన "ప్రముఖ వ్యక్తి"కే రూమ్ లేదంటే, ఆయన ఏం చేసాడో తెలుసా ?

ప్రముఖ హాలీవుడ్ నటుడు మాజీ కాలిఫోర్నియా గవర్నర్ అర్నాల్డ్ స్క్వాజ్‌నెగర్ రోడ్డు మీద పడుకొని నిద్ర పోతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.యాక్షన్ సినిమాల కధానాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు, అభిమానులను సంపాదించుకున్న ఈ కండల వీరుడికి ఇటీవల ఘోర అవమానం జరిగింది.




యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు..కండల వీరుడు..అందగాడు,రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చాటిన వ్యక్తి,  కొంత మంది మనుషుల క్రూర నైజానికి అంత గొప్ప వ్యక్తి ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

ప్రపంచ బాడీ బిల్డర్‌, హాలీవుడ్‌ ‌హీరో ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగర్‌ ఓ రాత్రి తన విగ్రహం ముందు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొలంబస్‌లోని ఓహియాలో ఆ రాత్రి బసచేయడానికి ఓ హోటల్‌కి వెళ్ళాడు ఆర్నాల్డ్‌. అయితే అక్కడ రూంలు ఖాళీలేవని చెప్పడంతో, కలత చెందిన ఆర్నాల్డ్‌, ఆ హోటల్‌ ముందున్న తన విగ్రహం ముందే నిద్రకుపక్రమించాడు.

కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన ఆర్నాల్డ్.. ఓహియోలో అదే హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా హోటల్ నిర్వాహకులు అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇక మీరు ఎప్పుడు వచ్చినా మా హోటల్ గదులు స్వాగతం పలుకుతూనే ఉంటాయి..మీకు స్పెషల్ విడిది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో హోటల్ యాజమాన్యం ఇచ్చిన మాటను నమ్మిన అర్నాల్డ్.. ఇటీవల హోటల్‌లో బస చేసేందుకు వెళ్లారు. కానీ హోటల్ యాజమాన్యం ఆయనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. ఆర్నాల్డ్.. రూమ్ కావాలని అడగగా ఖాళీ లేవని చెప్పి పంపించారు. దీంతో షాక్ తిన్న ఆర్నాల్డ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.తనకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదని తెలిసి వారికి ఎలాగైనా బుద్ది చెప్పాలని..అక్కడే తన విగ్రహం ముందు నేలపై పడుకున్నాడు ఆర్నాల్డ్. ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది.



1 comment:

  1. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    ReplyDelete