CSS Drop Down Menu

Wednesday, September 20, 2017

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ "ఫేవరేట్ డాన్సర్" ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోల్లో డాన్సులు వేస్తూ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకునే హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. అంటే.. కష్టమైన డాన్స్ మూమెంట్స్ కోసం అంతలా శ్రమిస్తాడు. అందుకే ప్రతి ఒక్క యువ హీరో డాన్స్ చేసేందుకు అల్లు అర్జున్‌తో పోటీ పడుతుంటారు. ఇలాంటి వారిలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైనశైలిలో సమాధానాలు ఇచ్చాడు. అల్లు అర్జునే తన ఫేవరేట్ డాన్సర్ అని చెప్పారు. 

టాలీవుడ్‌లో ఎవరి డాన్సులు నచ్చుతాయని ప్రశ్నిస్తే, బన్నీ డాన్సులే తనకు నచ్చుతాయని తేల్చి చెప్పాడు. నందమూరి హీరో ఇలా తనకు మెగా హీరో డాన్సులు నచ్చుతాయని చెప్పడం పట్ల అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 0 comments:

Post a Comment