CSS Drop Down Menu

Sunday, September 17, 2017

ఫోటో దిగండి! వెంటనే ప్రింట్ తీసుకోండి!!

మీరు టూర్ కెళ్లారా అక్కడ అదిరిపోయే ఫోటోలు దిగారా వాటిని ఎలాగైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే మీకోసం అదిరిపోయే బుల్లి ప్రింటర్ మార్కెట్లోకి వచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫోటోలను అప్పటికప్పుడే ప్రింట్ తీసుకోవచ్చు.

భారీగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం, సెల్ఫీలపై యువత మోజు నేపథ్యంలో హెచ్‌పీ సరికొత్త బుల్లి ప్రింటర్ ను రూపొందించింది. దీని పేరే "స్ప్రోకెట్‌". 

పాకెట్ సైజులో ఉండే ఈ ప్రింటర్ ను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీ ఫోన్‌ను జేబులో పెట్టుకున్నట్లే దీనిని కూడా మీరు జేబులో పెట్టుకుని మీకు నచ్చిన ప్రదేశంలో ఫోటోలు దిగి ప్రింట్ తీసుకోవచ్చు. 

వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుంచి అధికారిక స్ప్రోకెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆ తరువాత బ్లూటూత్‌ ద్వారా దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవాలి. 

అనంతరం ఏ ఫోటో ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకుని మీరు ప్రింట్ ఇస్తే సరిపోతుంది. 

ఈ స్ప్రోకెట్ ప్రింటర్ కొనాలనుకొంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 


లింక్: http://amzn.to/2x6PaON 

0 comments:

Post a Comment