CSS Drop Down Menu

Wednesday, August 9, 2017

అంతటి గొప్ప"దానం" చేసిన అమెరికా తల్లిని అందరూ అభినందించవలసిందే !

అమెరికాలో ఓ మహిళ 2,271 లీటర్ల తల్లి పాలను దానంగా అందజేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎలిజబెత్ ఆండర్సన్ అనే మహిళ ఇప్పటిదాకా 2, 271 లీటర్ల తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. సాధారణ బాలింతకంటే పది రెట్లు ఎక్కువగా ఎలిజబెత్‌కు తల్లిపాలు లభిస్తుందని.. దీన్ని వృధా చేయకుండా విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపింది.

రోజుకు 6.4 లీటర్ల తల్లి పాలను పొందే ఎలిజబెత్.. రోజుకు ఐదు సార్లు పాలను తీసి.. పాకెట్లలో భద్రపరిచి.. ఫ్రిజ్‌లో పెట్టేస్తుంది. ఆపై ఆ పాలను ఉచితంగా శిశువులకు అందజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే వ్యాధిగ్రస్థులకు జన్మించిన శిశువులకు, పోషకాహార లేమితో బాధపడే శిశువులకు.. ఇంకా తల్లి పాలు అవసరమయ్యే వారికి ఈ పాలను ఉచితంగా ఇస్తుంది. 
  
ఇకపోతే.. ఆండర్సన్‌కు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ ద్వారా అధిక తల్లి పాలు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెకు రెండున్నరేళ్ల పాప వుంది. రెండో పాప పుట్టి ఆరు నెలలే కావడంతో తనకు లభించే అధిక తల్లిపాలను దానం చేయడం ద్వారా అనేకమంది చిన్నారులకు మేలు చేసినట్లవుతుందని ఆమె భావిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Amazon 
Great Indian Sale:- http://amzn.to/2vktyxN

Flipkart
The Big Freedom Sale:- http://fkrt.it/AImP0TuuuN

Top Selling Smartphones:- 

http://fkrt.it/yGWE4!NNNN

0 comments:

Post a Comment