CSS Drop Down Menu

Thursday, August 17, 2017

మనకు ఇష్టమైన "భాష‌" నేర్పే "స్మార్ట్ నెక్లెస్"!

మ‌నం ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే ఎక్కువ‌గా పుస్త‌కాల మీద ఆధార‌ప‌డ‌తాం. 30 రోజుల్లో ఫ‌లానా భాష‌ను నేర్చుకోవ‌డం ఎలా? అనే పుస్త‌కాన్ని కొనేస్తాం. లేదంటే ఆన్ లైన్ లో లాంగ్వేజ్ లెర్నింగ్ ట్యుటోరియ‌ల్స్ పై ఆధార‌ప‌డ‌తాం. కానీ, మ‌నం ఎవ‌రితో అయినా ఆ భాష‌లో సంభాషిస్తే దానిని మనం త్వ‌ర‌గా నేర్చుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, అన్ని సార్ల మ‌న‌తో ఆ భాష‌లో సంభాషించేవారు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు భాష నేర్పేందుకు ఓ సరికొత్త గ్యాడ్జెట్ ను రూపొందించారు. 

Mersiv అని స్మార్ట్ నెక్లెస్ మ‌న మెడలో వేసుకుంటే చాలు. ఎంచ‌క్కా మ‌న‌కు కావాల్సిన భాష‌ను నేర్చుకోవ‌చ్చు, ఆ భాష‌లో సంభాషించ‌వ‌చ్చు.  ఆ నెక్లెస్ లో అమర్చిన అత్యాధునిక కెమేరా ఎదురుగా ఉన్న వస్తువులు, వ్యక్తుల ఫొటోలు తీసి అందుకనుగుణంగా అప్పటికప్పుడు మనతో సంభాషణలు జ‌రుపుతుంది. ఇందులోని కెమేరా 140 డిగ్రీల కోణంలో ఫొటోల‌ను తీస్తుంది. ఈ హారానికి అనుసంధానించిన ఇయర్‌బడ్స్‌ చెవుల్లో పెట్టుకోవాలి. మనం టమాటో చేతిలో పట్టుకొని ఉంటే ‘టామాటోని స్పానిష్‌లో ఏమంటారు?’ అనడుగుతుంది. 

అంతేకాకుండా మ‌నం ఏద‌న్నా అడిగితే దానికి బ‌దులు కూడా ఇస్తుంది. అప్పటికప్పుడే సంభాష‌ణ‌లు చేస్తూ ఓ ట్యూటర్‌లా పనిచేస్తుంది.ఈ గ్యాడ్జెట్ ప‌నిచేయాలంటే మన స్మార్ట్‌ఫోన్‌లో దానికి సంబంధించిన‌ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ ఫోన్లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అందుబాటులో ఉండాలి. మ‌నం వినాల‌నుకునే భాష‌ను ముందుగానే యాప్ లో సెట్ చేసుకోవాలి.  జో మిల్లర్‌ అనే బ్రిటీష్‌ డిజైనర్‌ ఈ సరికొత్త గ్యాడ్జెట్‌ని రూపొందించాడు.

LG Q6 : http://amzn.to/2vL2yYs

1 comment:

  1. for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in

    ReplyDelete