CSS Drop Down Menu

Tuesday, August 29, 2017

"కిడ్నీలో రాళ్లు" తొలగిపోవాలంటే "శృంగార"మే బెస్ట్ మెడిసన్ !

చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు ఆపరేషన్ చేయించుకుని ఆ రాళ్లను తీసేయించుకుంటారు. ఇంకొందరు ఆయుర్వేద మందులు వాడి శరీరంలోనే కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 

వైద్యులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. అదేమిటంటే.. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారమే బెస్ట్ మెడిసన్ అని చెపుతున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. 

ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్‌ పెంచే మందులను, మూడో గ్రూప్‌వారికి రాళ్లను కరిగించే మెడిసిన్‌ సూచించారు. 

రెండువారాల తర్వాత రెండు, మూడు గ్రూప్‌లోని వారికంటే మొదటి బృందంలోని వారిలో ఈ రాళ్ల సమస్య గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ బృందంలో 31 మంది ఉండగా, 26 మందిలో కిడ్నీలో రాళ్లు పూర్తిగా తొలిగిపోయాయని వారు పేర్కొన్నారు. 

కిడ్నీలో ఏర్పడే చిన్నసైజు రాళ్లు (6 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందం కలిగినవి) శృంగారం వల్ల వెలుపలకు వచ్చేసే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. మొత్తానికి కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వాళ్లు వారంలో కనీసం మూడుసార్లు శృంగారంలో పాల్గొంటేచాలని తేల్చారు. 

BlockBuster Deals : http://amzn.to/2iLTGyY

Saturday, August 26, 2017

తల్లికి "పురుడు" పోసిన "ప‌దేళ్ల" కుమారుడు !

ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ప్రసవం చేసి తన తమ్ముడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షించుకున్నాడు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 

ఢిల్లీకి చెందిన అష్లే మోరీ (36), కెల్సీ రీచర్డ్ అనే దంపతులు ఉద్యోగస్తులు. కెల్లీ రీచర్డ్ ఆఫీసుకి వెళ్ల‌గా, గ‌ర్భ‌వ‌తి అయిన‌ అష్లే ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో కడుపులో కొంచెం నొప్పి రావ‌డంతో అష్లే బాత్‌రూంకు వెళ్లింది. అయితే, నొప్పులు తీవ్రం అయి బాత్రూంలోనే పడిపోయింది.

ఆసమయంలో ఇంట్లో తన ప‌దేళ్ల‌ కుమారుడు ఫాంటెనాట్‌ జేడెనే త‌ప్ప ఎవ్వ‌రూ లేరు. ఆ బాలుడు ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అయితే, ఆసుప‌త్రి సిబ్బంది వ‌చ్చేసరికి ఆల‌స్యం అవుతుంద‌ని భావించిన బుడతడు... ఇపుడు ఏం చేయాలో తనకు చెప్పాలని త‌ల్లిని అడిగాడు. ఆమె వివరిస్తుంటే జేడెనే కాన్పు చేశాడు. ఆ బాలుడికి ఓ త‌మ్ముడు పుట్టాడు. 

కానీ, ఆ శిశువు శ్వాస తీసుకోవ‌డం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ బాలుడు వంటగదిలోని నాజిల్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందించాడు. ఇంత‌లో ఆసుపత్రి నుంచి సిబ్బంది వ‌చ్చి తల్లీ బిడ్డను ఆస్పత్రికి తరలించారు. నిజానికి పుట్టిన శిశువుకి కృత్రిమ శ్వాసను అందించకపోయి ఉంటే ఆ శిశువు మృతి చెందేవాడని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్టు వారు చెప్పారు.   

Saturday, August 19, 2017

"జడలు" కత్తిరిస్తున్న "దొంగ"ను చూసి షాక్ తిన్న జనాలు!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది జడ దొంగ వ్యవహారం. నిద్ర పోతున్న మహిళల జుట్టు కట్ చేస్తున్న వైనం పలు రాష్ట్రాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఇంట్లోకి వచ్చి.. కేవలం మహిళల జుట్టు మాత్రమే కట్ చేస్తున్న ఈ వైనం పలురాష్ట్రాల్లోని మహిళలకు కంటి నిండా నిద్ర లేకుండా చేసింది. ఎందుకంటే.. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నా.. వాటిని పట్టించుకోని ఈ జడ దొంగ.. జుట్టును కసిదీరా కట్ చేయటంపై పలు వాదనలు వినిపించాయి.

ఇదంతా మంత్రగాళ్ల పని అని కొందరంటే.. మరికొందరు ఒక వృద్ధుడు త్రిశూలంతో ఈ పని చేస్తున్నట్లుగా చెప్పారు. మరి కొందరైతే తమ ఊహాలకు రెక్కలు తొడిగేసి.. గ్రహాంతరవాసుల పనిగా.. దెయ్యమే ఇదంతా చేస్తుందంటూ కథలు కథలుగా చెప్పుకొచ్చారు. ఈ జుట్టు దొంగ రచ్చ రోజురోజుకి ముదిరిపోవటంతో.. మీడియాలో ఫోకస్ పెరిగిపోవటంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. చివరకు ఎన్నోప్రయత్నాలు చేసి.. చివరకు జుట్టు దొంగను పట్టుకున్నారు. కాకుంటే.. ఆ దొంగను చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఎందుకంటే.. ఆ జుట్టుదొంగ ఎవరో కాదు.. ఒక పురుగుగా తేల్చారు. 

ఢిల్లీ.. గుర్ గావ్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్.. ముంబయి తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ జడ కత్తిరింపు ఘటనలు ప్రజల్నిహడలెత్తించాయి. బాధితులు సైతం తాము ఒక వృద్ధుడ్ని చూశామని.. త్రిశూలంతో వస్తున్నాడని.. అతన్ని చూడగానే స్పృహ తప్పి పోతున్నట్లుగా చెప్పారు. దీంతో ఈ ఉదంతం మరింత గందరగోళానికి తెర తీసింది. కొన్ని చోట్ల అయితే.. ఒక దెయ్యమే ఈ పని చేసిందని.. తాము చూసినట్లుగా బాధితులు చెప్పటం కనిపించింది. ఇలాంటి వేళ.. ఈ మిస్టరీని బీహార్ వాసులు చేధించారు. ఇదంతా చే్స్తున్నది ఒక పురుగు అని.. దాన్ని పాట్నాలోని రామకృష్ణనగర్ లో ఒక వింత పురుగు చేస్తుందంటూ పట్టుకొని మరీ చూపించారు. ఈ పురుగు ముందు జుట్టను పెడితే.. అది క్షణాల్లో కట్ చేయటం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఈ పురుగును బంధించిన పోలీసులు.. ఈ ఉదంతంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.ఈ పురుగును చూపిస్తూ.. పుకార్లను నమ్మొద్దంటున్నారు. అంతా బాగుంది కానీ.. నాలుగైదు వెంట్రుకల్ని పరపరా కొరికేస్తున్న పురుగు.. అంత పెద్ద జడను కొరికేస్తుందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. 

Friday, August 18, 2017

తొలగించిన ఆధార్ కార్దులలో మీ కార్డ్ ఉందో ? లేదో ?ఇలా చెక్ చేసుకోండి !

గవర్నమెంట్ 81 లక్షల ఆధార్ కార్దులను తొలగించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. తొలగించిన ఆధార్ కార్దులలో మీ కార్డ్ ఉందో ? లేదో ?ఇలా చెక్ చేసి తెలుసుకోండి.


Thursday, August 17, 2017

మనకు ఇష్టమైన "భాష‌" నేర్పే "స్మార్ట్ నెక్లెస్"!

మ‌నం ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే ఎక్కువ‌గా పుస్త‌కాల మీద ఆధార‌ప‌డ‌తాం. 30 రోజుల్లో ఫ‌లానా భాష‌ను నేర్చుకోవ‌డం ఎలా? అనే పుస్త‌కాన్ని కొనేస్తాం. లేదంటే ఆన్ లైన్ లో లాంగ్వేజ్ లెర్నింగ్ ట్యుటోరియ‌ల్స్ పై ఆధార‌ప‌డ‌తాం. కానీ, మ‌నం ఎవ‌రితో అయినా ఆ భాష‌లో సంభాషిస్తే దానిని మనం త్వ‌ర‌గా నేర్చుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, అన్ని సార్ల మ‌న‌తో ఆ భాష‌లో సంభాషించేవారు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు భాష నేర్పేందుకు ఓ సరికొత్త గ్యాడ్జెట్ ను రూపొందించారు. 

Mersiv అని స్మార్ట్ నెక్లెస్ మ‌న మెడలో వేసుకుంటే చాలు. ఎంచ‌క్కా మ‌న‌కు కావాల్సిన భాష‌ను నేర్చుకోవ‌చ్చు, ఆ భాష‌లో సంభాషించ‌వ‌చ్చు.  ఆ నెక్లెస్ లో అమర్చిన అత్యాధునిక కెమేరా ఎదురుగా ఉన్న వస్తువులు, వ్యక్తుల ఫొటోలు తీసి అందుకనుగుణంగా అప్పటికప్పుడు మనతో సంభాషణలు జ‌రుపుతుంది. ఇందులోని కెమేరా 140 డిగ్రీల కోణంలో ఫొటోల‌ను తీస్తుంది. ఈ హారానికి అనుసంధానించిన ఇయర్‌బడ్స్‌ చెవుల్లో పెట్టుకోవాలి. మనం టమాటో చేతిలో పట్టుకొని ఉంటే ‘టామాటోని స్పానిష్‌లో ఏమంటారు?’ అనడుగుతుంది. 

అంతేకాకుండా మ‌నం ఏద‌న్నా అడిగితే దానికి బ‌దులు కూడా ఇస్తుంది. అప్పటికప్పుడే సంభాష‌ణ‌లు చేస్తూ ఓ ట్యూటర్‌లా పనిచేస్తుంది.ఈ గ్యాడ్జెట్ ప‌నిచేయాలంటే మన స్మార్ట్‌ఫోన్‌లో దానికి సంబంధించిన‌ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ ఫోన్లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అందుబాటులో ఉండాలి. మ‌నం వినాల‌నుకునే భాష‌ను ముందుగానే యాప్ లో సెట్ చేసుకోవాలి.  జో మిల్లర్‌ అనే బ్రిటీష్‌ డిజైనర్‌ ఈ సరికొత్త గ్యాడ్జెట్‌ని రూపొందించాడు.

LG Q6 : http://amzn.to/2vL2yYs

Wednesday, August 9, 2017

అంతటి గొప్ప"దానం" చేసిన అమెరికా తల్లిని అందరూ అభినందించవలసిందే !

అమెరికాలో ఓ మహిళ 2,271 లీటర్ల తల్లి పాలను దానంగా అందజేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎలిజబెత్ ఆండర్సన్ అనే మహిళ ఇప్పటిదాకా 2, 271 లీటర్ల తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. సాధారణ బాలింతకంటే పది రెట్లు ఎక్కువగా ఎలిజబెత్‌కు తల్లిపాలు లభిస్తుందని.. దీన్ని వృధా చేయకుండా విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపింది.

రోజుకు 6.4 లీటర్ల తల్లి పాలను పొందే ఎలిజబెత్.. రోజుకు ఐదు సార్లు పాలను తీసి.. పాకెట్లలో భద్రపరిచి.. ఫ్రిజ్‌లో పెట్టేస్తుంది. ఆపై ఆ పాలను ఉచితంగా శిశువులకు అందజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే వ్యాధిగ్రస్థులకు జన్మించిన శిశువులకు, పోషకాహార లేమితో బాధపడే శిశువులకు.. ఇంకా తల్లి పాలు అవసరమయ్యే వారికి ఈ పాలను ఉచితంగా ఇస్తుంది. 
  
ఇకపోతే.. ఆండర్సన్‌కు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ ద్వారా అధిక తల్లి పాలు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెకు రెండున్నరేళ్ల పాప వుంది. రెండో పాప పుట్టి ఆరు నెలలే కావడంతో తనకు లభించే అధిక తల్లిపాలను దానం చేయడం ద్వారా అనేకమంది చిన్నారులకు మేలు చేసినట్లవుతుందని ఆమె భావిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Amazon 
Great Indian Sale:- http://amzn.to/2vktyxN

Flipkart
The Big Freedom Sale:- http://fkrt.it/AImP0TuuuN

Top Selling Smartphones:- 

http://fkrt.it/yGWE4!NNNN

Tuesday, August 8, 2017

ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన "శిల్పాల"ను ఎప్పుడైనా చూసారా ?

ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన "శిల్పాల"ను ఎప్పుడైనా చూసారా ?
ఉదాహరణకు పైన చూపిన గుఱ్ఱపు తలలు ఒక్కొక్కటి 300 టన్నుల బరువు , 30 మీటర్ల ఎత్తుతో  UK లో నిర్మించారు.  
ప్రపంచం నలుమూలలా ఇలాంటి మరిన్ని అద్భుతమైన  శిల్పాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండి. 

Monday, August 7, 2017

"కోతి"తో శృంగారం ! మరీ ఇంత దిగజారుడా ?

సాధారణంగా మానవత్వంలేని కొందరు మనుషులు డబ్బులకు కక్కుర్తిపడి మహిళలతో వ్యభిచారం చేయిస్తుంటారు. మరికొందరు అమ్మాయిలు లేదా మహిళలు పొట్టకూటి కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఇంకొందరు కామంతో కళ్లుమూసుకుని తమ ఎంజాయ్‌ కోసం పడకసుఖం అందిస్తుంటారు. అయితే, ఆ గ్రామంలో మాత్రం ఓ మహిళ కోతి తో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తోంది. మనిషి ఊహకు కూడా అందని ఈ హేయమైన చర్య వివరాలను పరిశీలిస్తే 

ఒరంగుటాన్ అనేది ఓ జాతి  కోతి. సెంట్రల్ ఇండోనేషియాలో ఉండే దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో బోర్నెయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఓ మహిళకు డబ్బులు సంపాదించాలని భావించింది. అదీ కోతులతో వ్యభిచారం చేయించి ధనం సంపాదించాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఒరంగుటాన్‌ కోతిని తెచ్చుకుని దానికి పోనీ అనే పేరు పెట్టి ఇంట్లోనే పెంచసాగింది. 
కొద్దిరోజుల తర్వాత ఈ కోతితో కృత్రిమపద్దతుల్లో శృంగారం ప్రాక్టీస్ చేయించింది. పైగా విటులను ఆకర్షించేందుకు ఈ కోతి వెంట్రుకల ను పూర్తిగా కత్తిరించడం గమనార్హం. ఆ తర్వాత గ్రామస్తులకు చెప్పడంతో వారంతా ఈ కోతితో శృంగారం చేసేందుకు క్యూ కట్టారు. భారీగా డబ్బులు చెల్లించిమరీ ఆ కోతితో శృంగారం చేయడానికి వచ్చేవారు.


ఫలితంగా ఆ కోతి కూడా ఎంతలా శృంగారానికి బానిసగా మారిపోయిందంటే... ఎవరైనా మగవాడు ఆ మహిళ ఇంటికి వస్తే చాలు శృంగారం చేయమని వెనక్కి తిరిగి నిలబడేది. ఇలా ఆ కోతి శృంగారానికి బానిసైపోయింది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసి కోతిని రక్షించేందుకు ప్రయత్నించినా.. గ్రామంలోని పురుషులు విషపు కత్తులు చేతబట్టి తిరుగబడటంతో ఖాకీలు కూడా ఏం చేయలేక పోయారు. 
Saturday, August 5, 2017

మీ పిల్లలు గాని ఈ "గేమ్" ఆడుతుంటే వాళ్ళ జీవితం అంతం అయిపోయినట్లే !

ఇప్పటివరకు వివిధ రకాల గేమ్‌లు చూసివుంటారు. వాటి పేర్లూ వినివుంటారు. కానీ, ఇపుడు 'బ్లూ వేల్ చాలెంజ్' అనే ఓ కొత్త ఆన్‌లైన్ సూసైడ్ గేమ్ వెలుగులోకి వచ్చింది. రష్యాలో ప్రారంభమైన ఈ గేమ్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిలీలో ఈ గేమ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ గేమ్ బారినపడి అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబ‌ైలో ఓ 14 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. అంధేరి ఈస్ట్‌లో ఉండే ఆ చిన్నారి సోష‌ల్ మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని గేమ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత ఎలాగైనా ఈ గేమ్‌లో విన్ అవ్వాల‌ని తను ఉండే బిల్డింగ్‌లో ఐదో అంతస్థు నుంచి కిందికి దూకి త‌న ప్రాణాల‌ను తీసుకున్నాడు. 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సూసైడ్ చేసుకున్న చిన్నారికి బ్లూ వేల్ చాలెంజ్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో భారత్‌లో కూడా ఈ గేమ్ ఆడుతున్న వారు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ గేమ్ బారిన ప‌డి ర‌ష్యా, యూకేలో ఇప్ప‌టికే దాదాపు 130 మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను కోల్పోవడం గమనార్హం. 

అసలు బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ ర‌ష్యా‌లో ప్రారంభ‌మైంది. ఇది ఇప్పుడు భారత్‌కు పాకింది. నీలి తిమింగ‌లం చాలెంజ్ గేమ్‌ను ఓ సోష‌ల్ మీడియా గ్రూప్ ర‌న్ చేస్తుంటుంది. ఈ గేమ్‌లో పాల్గొనదలచిన వారు గేమ్ నిర్వాహ‌కులు చెప్పినట్లు చేయాలి. చేసితీరాలి. 50 రోజులు వాళ్లు ఇచ్చే టాస్కులు చేస్తూ ఉండాలి. ముందు ఓ పేప‌ర్‌పై తిమింగ‌లం బొమ్మను వేయాలి. త‌ర్వాత ఈ బొమ్మను త‌మ శ‌రీరంపై వేసుకోవాలి. 

పిమ్మట హార్ర‌ర్ సినిమాలు చూడటం, అర్థరాత్రులు లేవ‌డం.. న‌డ‌వ‌టం వంటి టాస్కులు చేయాలి. అలా 50 రోజులు 50 టాస్కులు పూర్తి చేసిన త‌ర్వాత నిజంగానే సూసైడ్ చేసుకోవాలి. దీన్నే సెల్ఫ్ డిస్ట్రాయింగ్ అంటారు. ఈ గేమ్‌లో గెలవాలంటే ఖ‌చ్చితంగా సూసైడ్ చేసుకోవాల్సిందేన‌ని నిర్వాహ‌కులు పార్టిసిపెంట్స్‌పై ఒత్తిడి తెస్తారు. దీంతో గేమ్ గెల‌వాల‌న్న ఆరాటంతో అనేక మంది చిన్నారులు నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇపుడు ఈ గేమ్ చాలా దేశాలకు విస్తరిస్తోంది. దీంతో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

తల్లితండ్రులూ బహుపరాక్ ! మీ పిల్లలు గాని ఈ గేమ్ ఆడుతుంటే వాళ్ళ జీవితం అంతం అయిపోయినట్లే. కాబట్టి వాళ్ళని ఓ కంట కనిపెట్టండి.  

Thursday, August 3, 2017

ప్రతిరోజూ "పరగడుపున 10 కరివేపాకు" ఆకులను తినండి. ఎందుకంటే ?

కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అందుకే ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తుంటాం. ఈ ఆకు వేయడం వల్ల కూరలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలా మంది తినరు. పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలి పెట్టకుండా తింటారు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం పది కరివేపాకులను తింటే రక్తం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. 

నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, 2 ఎలాంటి డయాబెటిస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. 

మద్యం, మాంసాహారం అధికంగా ఆరగించేవారికి సహజంగానే కాలేయ సమస్యలు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 

కరివేపాకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది. నేత్ర సమస్యలు ఇది చక్కటి ఔషధం. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
Tuesday, August 1, 2017

సుకుమార్ కి "ప్రాణభిక్ష" పెట్టిన రియ‌ల్ హీరో ఎవరో తెలుసా?

షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడుతుంటే.. మరికొందరు గాయాలతో ప్రాణగండం నుంచి బయపడుతుంటారు. అయితే, టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సుకుమార్ ఓ ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రాణాలు రక్షించింది కూడా ఓ స్టార్ హీరోనే. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే 

సుకుమార్ నిర్మాణంలో "ద‌ర్శ‌కుడు" అనే చిత్రం రూపొంద‌గా ఈ మూవీని ఆగ‌స్ట్ 4న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే శనివారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఫంక్ష‌న్ ఆద్యంతంసాగుతుండ‌గా, సుకుమార్ 'ఆర్య' షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. 

'ఆర్య' సినిమా షూటింగ్ సమయంలో ప్ర‌మాద‌వ‌శాత్తు తాను పడవలోనుంచి నదిలో పడిపోయానని చెప్పాడు సుకుమార్. నాకు ఈత రాక‌పోగా , నేను ప‌డిపోవ‌డం చూసి అంతా షాక్‌కు గురై అందరూ అలాగే చూస్తుండిపోయారు. ఇక చివ‌రి క్ష‌ణాలు అవే అనుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ నదిలో దూకి త‌న‌ని ర‌క్షించాడ‌ని గుర్తు చేశాడు. అందుకే ఆయ‌నే నా రియ‌ల్ హీరో అని సుకుమార్ ఉద్వేగ భ‌రితంగా చెప్పాడు.