CSS Drop Down Menu

Saturday, July 8, 2017

38 మంది "తెరాస" ఎమ్మెల్యేలు "కాంగ్రెస్" కు ఓటేస్తారా ?

తెరాస మొత్తం ఏకతాటిపై ఉందని కేసీఆర్ పదేపదే చెప్పినా.. లోలోపల మాత్రం లుకలుకలు లేకపోవంటూ అప్పుడప్పుడూ మీడియాలో వార్తలొస్తూనే వున్నాయి. వీటికి పరాకాష్టలాంటిదే ఇప్పుడొక న్యూస్ హల్ చల్ చేస్తోంది. జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి భారీ స్థాయిలో క్రాస్ వోటింగ్ జరుగుతుందంటూ శత్రుపక్షం ప్రచారం చేస్తోంది. ఏకంగా 38 మంది తెరాస ఎమ్మెల్యేలు యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ కు ఓటెయ్యడానికి సిద్ధమై పోయారంటూ టీ-సీఎల్పీ ఏకంగా ప్రకటనే విడుదల చేసింది. ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈమేరకు తెరాస అధినేత కేసీఆర్ ని సూటిగా హెచ్చరించారు కూడా. కేసీఆర్ ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా  మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తున్న 38 మంది తెరాస ఎమ్మెల్యేలు జట్టుకట్టినట్లు చెప్పిన సంపత్.. వాళ్ళ పేర్లు వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు.

సీఎల్పీ ప్రకటన సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి కలకలం క్రియేట్ చేసింది. తెరాసలో నివురుగప్పిన నిప్పులా వున్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబికినా ఆశ్చర్యం లేదంటూ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తెరాసలో ఇప్పటికే అనధికారికంగా రెండు గ్రూపులున్నాయి. కారుగుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలు ఒక గ్రూపయితే.. బైటినుంచి పార్టీలో చేరిన వలస ఎమ్మెల్యేలది ఇంకో గ్రూప్. వీళ్ళలో కొందరికి ఇంకా పార్టీలో 'సరైన న్యాయం' జరగలేదన్న వాదన కూడా ఒకటుంది. అయితే.. సీఎల్పీ ప్రచారం చేస్తున్నంత అసమ్మతి గులాబీ పార్టీలో ఉందన్న మాటతో ఎవ్వరూ ఏకీభవించరు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలు అధినేత గీసిన గీతను ధిక్కరిస్తారన్న మాట ఒకరకంగా అతిశయోక్తిలాంటిదే.

2019 ఎన్నికల్లో 99 శాతం విజయాలు తమవేనంటూ సొంత సర్వేలతో ఇటీవల హైప్ క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా పోయిందంటూ పదేపదే చెప్పుకుంటున్నారు తెరాస అధినేత. ఈరకమైన కేసీఆర్ స్ట్రాటజీని తిప్పికొట్టడానికే టీ-కాంగ్రెస్ ఇలా 'మైండ్ గేమ్' ఆడుతోందని పొలిటికల్ ఎనలిస్టులు తేల్చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడాలు ఉండవని, ఆత్మప్రబోధానుసారం ఓటెయ్యాల్సిందేనని ఈసీ రిపీటెడ్ గా చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ క్రాస్ వోటింగ్ పై ఆశలు పెంచుకుంటోంది. ఈ కోవలోనే.. 'తెరాసలో చీలిక' వైపు ఆబగా చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్ శిబిరం.

0 comments:

Post a Comment