CSS Drop Down Menu

Wednesday, June 7, 2017

"రోల్స్ రాయిస్"కంపెనీకి దిమ్మతిరిగేలా షాకిచ్చిన మన ఇండియా రాజు ! ఎవరో తెలుసా?


ఈ కాలంలో అవమానాలు పడటం ప్రతిష్టను బుగ్గిపాలు చేసినా సహిచడంవంటివి సహజం అయిపోయాయి. అయితే ఒకప్పుడు ఈ ధోరణి చాలా విభిన్నంగా ఉండేది. ఏ మాత్రం అవమానించబడ్డా తిరిగి వారి చేతే క్షమాపణలు చెప్పింకునేవారు. అచ్చం అలాంటిదే ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రోల్స్ రాయిస్ చేత ఓ భారతీయ రాజు క్షమాపణలు చెప్పించుకున్నాడు.




ఓ సారి రాజస్థాన్‌లోని అల్వార్ మహారాజా అయిన జైసింగ్ రాజు లండన్ పర్యటనకు వెళ్లాడు. పర్యనటలో భాగంగా సాధారణ మానవుని వస్త్రధారణలో లండన్‌లోని బాండ్ ప్రముఖ వీధిలో నడుచుకుంటూ వెళ్లాడు.


బాండ్ వీధిలో ఉన్న రోల్స్ రాయిస్ కార్ల విక్రయ కేంద్రం మీద రాజు గారికి చూపు మళ్లింది. ఆ విక్రయ కేంద్రంలో ఉన్న కార్లను ఇష్టపడ్డ జైసింగ్ లోపలికెళ్లి వాటి గురించి విచారించడానికి ప్రయత్నించాడు. 


అయితే అప్పుడు సేల్స్‌ మ్యాన్‌గా రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రంలో ఉన్న వ్యక్తి రాజు గారిని సరిగ్గా గుర్తించలేదు కాబోలు, సాధరణ ప్రజలకు రోల్స్ రాయిస్ తమ కార్లను విక్రయించదు. కాబట్టి మీరు దయచేసి వెళ్లవచ్చు అని వక్రసమాధానం ఇచ్చాడు.


పేద వాళ్లకు, సాధారణ ప్రజలకు మరియు డబ్బు లేని వాళ్లకు ఇక్కడ కార్లు అమ్మబడవు అని జైసింగ్ ను అవమానించాడు. కేవలం తన వస్త్రధారణతోనే ఇలా అవమానిస్తాడా అని తాను లండన్‌లో అద్దెకు దిగిన గదికి వెళ్తాడు రాజు.తమ సేవకులతో జరిగిన తతంగాన్నంతా వివరించి, మహారాజులా ఆ విక్రయ కేంద్రానికి వెళ్లి అక్కడున్న కార్లన్నీ కొనుగోలు చేయాలని సేవకులతో వివరిస్తాడు. జైసింగ్ మహారాజులా వస్త్రధారణతో రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రానికి వెళ్లి సేల్స్‌మ్యాన్‌ను ఆశ్చర్యపరుస్తాడు.

రోల్స్ రాయిస్‌ షోరూమ్‌లో ఉన్న మొత్తం ఆరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తాడు. వాటి మొత్తం ధరతో పాటు లండన్ నుండి ఇండియాకు ఎగుమతి చేయడానికి సరిపడా మొత్తాన్ని కూడా చెల్లిస్తాడు. కొద్ది కాలానికి అక్కడ ఆర్డర్ ఇచ్చిన కార్లు జై సింగ్ నివాసానికి చేరుకున్నాయి.

లండన్‌లో నన్ను అవమానపరిచారనే నెపంతో ఈ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించండంటూ రాజు తమ సిబ్బందికి ఆదేశిస్తాడు. నిజానికి రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించడాన్ని ప్రజలు గర్వంగా ఫీలవుతారు.


స్టేటస్‌ కోసం వినియోగించే కార్లను రోల్స్ రాయిస్ పేరును చెడగొట్టే విధంగా చెత్తను శుభ్రం చేయడం మరియు తరలించడానికి ఇండియాలో ఉన్న రాజు వినియోగిస్తున్నాడనే వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది.

స్టేటస్‌కు చిహ్నంగా చెప్పుకునే కార్లను ఇలా మునిసిపాలిటీ అవసరాలకు వినియోగిస్తున్నాడని ప్రపంచ మార్కెట్లో రోల్స్ రాయిస్ పేరు రోజు రోజుకీ పడిపోవడం జరిగింది. తద్వారా ఇది విక్రయాల మీద కూడా ప్రభావం చూపింది. 

జై సింగ్ చేసిన పనికి రోల్స్ రాయిస్ సంస్థకు అన్ని విధాలుగా అవమానం ఎదురైంది, మరియు విక్రయాలు మందగించడంతో ఆదాయం కూడా దాదాపు తగ్గిపోయింది. లగ్జరీ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించడం పట్ల రోల్స్ రాయిస్ జై సింగ్‌ను వివరణ కోరింది.

లండన్ విక్రయ కేంద్రంలో భారతీయులను అవమానించారు, ప్రజలను ఎలా గౌరవించాలో మీకు తెలియదని పేర్కొంటూ... అందుకు ప్రపంచ మొత్తం గర్వంగా చెప్పుకునే రోల్స్ రాయిస్ కార్లను ఇందుకు వినియోగిస్తున్నాము.. ఇది మా స్టేటస్  మమ్మల్నే అవమానిస్తారా ? అని వివరణ ఇచ్చారు.

జైసింగ్ లేఖతో దిగివచ్చిన రోల్స్ రాయిస్ బృందం జైసింగ్ కు క్షమాపణలు చెప్పింది. మరియు ఆరు కార్లను ఉచితంగా ఇస్తామని తెలిపి, చెత్తను తరలించడానికి వినియోగించకండని వేడుకుంది. దీనికి అంగీకరించిన జైసింగ్ అలా చేయడం ఆపేసాడు.





0 comments:

Post a Comment