CSS Drop Down Menu

Thursday, April 6, 2017

ఇకపై "అప్పు" తెచ్చుకున్నా, "పెళ్ళి" చేసుకున్నా, పన్ను చెల్లింఛవలసిందే ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేయనుంది. ముఖ్యంగా అప్పు తెచ్చుకున్నా, పెళ్ళిచేసుకున్నా, పన్ను చెల్లించేలా ఈ సవరణలు చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం పెళ్లి ఖర్చులకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసముంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో పడక తప్పదు. 

అలాగే, అప్పు తెచ్చుకున్నా.. అది అప్పుగా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందట. అదేవిధంగా ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినా వివరణ ఇవ్వాల్సిందే. లేకుంటే పన్ను కట్టక తప్పదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోళ్లు జరిపితే మాత్రం ఆదాయపన్ను చట్టం వర్తించదు. కాకపోతే ఆ ఆదాయాన్ని నిరూపించలేకపోతే మాత్రం తిప్పలు తప్పవు. 
గతేడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్రం తాజాగా ఆదాయ పన్ను సవరణతో మరో షాక్ ఇచ్చింది. తాజా చట్ట సవరణతో వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం వరకు పన్ను కట్టాల్సి ఉంటుందని పేర్కొంది.

1 comment:

  1. ఇలాంటి పన్నులన్నీ‌ సామాన్యవేతనజీవుల దగ్గర గోళ్ళూడగొట్టి మరీ వసూలు చేసుకుంటారు దొరతనం వారు. బాగుబాగు. ఇంక బడాబాబులైతే వందలవేల కోట్లను బ్యాంకులద్వారా వసూలు చేసుకొని దర్జాగా తిరుగుతారు - వాళ్ళనుండి ఇదే దొరతనం రూపాయి కూడా తిరిగి కట్టించుకోలేదు - వట్టి తాటాకుచప్పుడు బెదిరింపులు చేయటం‌ తప్ప. కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేయటమంటే ఇదే.

    ఇంక చీరఖరీదును బట్టి పన్నూ, పాంటూషర్టూఖరీదును బట్టి పన్నూ‌కూడా ఏరోజుకారోజు విధించే విధానం కూడా వస్తే బాగుంటుంది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిథిలోనూ‌ ఒకవసూలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ పన్నులు వసూలు చేయవచ్చును.

    చివరాఖరుకు బ్రతికున్నందుకు కూడా ఏటికింతన్న లెక్కన పన్ను వసూలు చేసుకుంటారో ఏమో మరి.

    ReplyDelete