CSS Drop Down Menu

Tuesday, April 25, 2017

Sunday, April 23, 2017

"ఎండాకాలం" లో ఇలాంటి ఆహారపదార్ధాలను తింటే ?

వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని అనిపిస్తుంది. ఐతే వాటికి దూరంగా వుండక తప్పదు. ఎండలు పెరిగుతున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా మసాలాలు, కారం మోతాదుకు మించి వున్నవాటిని తీసుకోవడం తగ్గించాలి. 

మాంసాహారాన్ని తీసుకునేవారు తగ్గించడం మంచిది. చికెన్, మటన్ వేసవిలో తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలను తెచ్చిపెడతాయి. విరేచనాలు, మలబద్ధకానికి కారణమవుతాయి. అలాగే నూనెలో బాగా వేయించిన కూరలు తీసుకోకూడదు. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చిప్స్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ఇలాంటివి తింటే కడుపులో అజీర్ణం చేయడమే కాకుండా కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కడుపంతా నొప్పితో మెలిపెట్టినట్లు అవుతుంది. కనుక ఇలాంటి వాటికి కాస్త దూరంగా వుండటమే మంచిది.

Thursday, April 20, 2017

అరటిపండ్లను "రోజుకు మూడు" తింటే ?

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండు. అందరిదకీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు అరటి పండు. 

అలాంటి అరటి పండును రోజుకు మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది. 

రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు. 

కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. 

పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది. 

Tuesday, April 18, 2017

అందరూ ఆరాధించే "ఆంజనేయస్వామిని ద్వేషించే ఊరు" ఎక్కడ ఉందో తెలుసా?


భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనం ఇస్తాయి. సాధారణంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడటానికి, బలం చేకూర్చటానికి ఆంజనేయుడిని పూజిస్తాము కానీ ఇక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో హనుమంతుడిని పూజించరు సరికదా ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా. ఒకేవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు ..! ఆ ఊరి పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో కలదు. దేశ రాజధాని ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి. దీనికి గల ఇతర పేర్లు దునగిరి, దూణగిరి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణులలో కలదు. ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కలదు. గుడిలో కొలువైన దేవతను 'దునగిరి దేవి' గా కొలుస్తారు.

పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండపై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు.


దున గిరి దేవిని మహామయ హరిప్రియగా అభివర్ణిస్తారు. ఈ శక్తి పీఠానికి గల మరో పేరు 'ఉగ్ర పీఠ'. ద్రోణగిరిలో ఆంజనేయస్వామిని పూజించరు .. ద్వేషిస్తారు. ఏం ? అంత పాపం ఈ ఊరికి ఆంజనేయస్వామి ఏమి చేసాడనేగా మీ సందేశం అయితే ఇది చదవండి ..

రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని. రాముడు - రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్షణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు గుర్తుందా ? అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొని వచ్చి లక్షణుడిని మూర్ఛ నుండి తప్పిస్తాడు అవునా ?

ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్ళేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పూజలు చేయటం మానేశారు.

ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయస్వామిని ఎంతగా ద్వేషిస్తారంటే ... ఒకవేళ ఆంజనేయస్వామి పేరుని ఎవరైనా పలికినా, పూజించినా దానిని నేరంగా భావించి వారిని ఆ ఊరి నుండి వెలేస్తారట..!Monday, April 17, 2017

"ఒక నిమ్మకాయ" ఖరీదు రూ."27 వేలు" !

నిమ్మకాయ ధర రూ.2 లేదా 3 ఉంటుంది. మహా అయితే రూ.5 పలకడం కూడా చూశాం. అయితే తమిళనాడులో తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.68 వేలు పలికాయి! అందులో కేవలం ఒక్క నిమ్మకాయతోనే రూ.27 వేలు వసూలయ్యాయి. తమిళనాడులోని విల్లుపురంలో 11 రోజుల పాటు అట్టహాసంగా జరిగే పంగుని ఉతిరం ఉత్సవాల్లో నిమ్మకాయలకు ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతియేటా ఉత్సవాల చివరి రోజున ఆలయ యాజమాన్యం పూజలో వాడిన పవిత్రమైన నిమ్మకాయలను వేలం వేస్తుంది.
 
ఈ ఉత్సవాల్లో తొలి తొమ్మిది రోజుల్లో రోజుకో నిమ్మకాయ చొప్పున శూలాలకు గుచ్చుతారు. ఈ నిమ్మకాయలు సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. పిల్లలు లేని వారికి ఈ నిమ్మకాయలు సంతాన భాగ్యం తీసుకొస్తాయని కూడా భావిస్తారు. అందునా మొదటి రోజు నిమ్మకాయకు ‘‘అత్యంత శక్తి ఉంటుందన్న’’ నమ్మకంతో దానికి మరింత డిమాండ్ ఉంటుంది. దీంతో ఒట్టనంథాల్‌కి చెందిన దంపతులు రూ.27 వేలు వెచ్చించి ఈ ఏడాది తొలిరోజు నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇదే తొలిరోజు ఉత్సవం నాటి నిమ్మకాయ రూ.39 వేలు పలికింది. మొత్తం మీద గతేడాది నిమ్మకాయలకు రూ.57,722 సమకూరగా... ఈ ఏడాది రూ.68 వేలు వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.


Saturday, April 15, 2017

"శనిగ్రహ"దోషాల వల్ల బాధపడేవారు ఏం చెయ్యాలో తెలుసా?

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి? ఎలా చేయాలి? తెలుసుకుందామా!శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశిగానీ లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు గానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు.

ప్రదోషకాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలకాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట. 

శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. 

1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.

2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.

3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు "నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం" అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ: శివాయ" అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.

7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

Thursday, April 13, 2017

చిరంజీవిగారి రత్తాలు సాంగు కోసం లారెన్స్ పెట్టిన "కండిషన్" ఏమిటో తెలుసా?

మెగాస్టార్ 150వ సినిమా రత్తాలు సాంగు కోసం...ఒక రోజు చిరంజీవిగారు ఫోన్ చేశారు. ఏంట్రా బావున్నావా ? ఒక హెల్ప్ చేసి పెడతావా? నా సినిమాకు సాంగ్ కంపోజ్ చేయాలి అన్నారు. అయ్యా మీరు నన్ను హెల్ప్ అడగటం ఏమిటి, అని ఆయన చెప్పిన వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాను అని లారెన్స్ తెలిపారు.

 ‘రత్తాలు రత్తాలు..' పాట కోసం చిరంజీవిగారితో సూపర్‌ స్టెప్స్‌ వేయించి ఏదో పేరు కొట్టేయాలని చేయలేదు.ఈ వయసులో ఆయన సౌకర్యంగా, బ్యాక్‌ పెయిన్ లేకుండా ఇంటికి వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో చేసాను. వయసుకు తగ్గట్లే ఆయనతో స్టెప్స్‌ వేయించాను అన్నారు లారెన్స్.

ముందుగానే పాట చేసినందుకు నాకేమీ డబ్బు వద్దనీ, వదినమ్మ చేసే దోశలు మాత్రం కావాలనీ కండిషన్ పెట్టాను. ఆ పాట చేసినన్ని రోజులూ అన్నయ్యతో తో పాటు నాకు కూడా వదినమ్మ టిఫిన్ బాక్స్‌, లంచ్ బాక్స్‌ పంపించేది. టిఫిన్ బాక్సులో ‘చిరు దోశలు', లంచ్ బాక్సులో 'చికెన్' ఉండేది అని లారెన్స్ గుర్తు చేసుకున్నారు.

Tuesday, April 11, 2017

"మధుమేహం" ఉన్నవారు "మామిడి పండు"ను ఆరగించవచ్చా?

వేసవికాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు. ఈ సమ్మర్ సీజన్ ఫ్రూట్‌ను ఈ పండును కంటితో చూసినా.. మామిడి పండు వాసన ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండటం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో చక్కెర వ్యాధితో బాధపడేవారు తినకూడదని చెపుతుంటారు. ఎందుకంటే ఎంతో మధురంగా, తియ్యగా ఉండే ఈ పండును డయాబెటిక్ రోగులు ఆరగించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే, కొంతమంది వైద్య నిపుణులు మాత్రం మామిడి పండును ఆరగించవచ్చని చెపుతున్నారు.ఎందుకంటే మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఒక మామిడి పండులో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. 

సాయంత్రం వేళల్లో చిరుతిండ్లకు బదులు మామిడి పండును సగం మేరతీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చని కొందరు వైద్యులు చెపుతున్నారు. Saturday, April 8, 2017

అల్లం "తొక్క" తీయకుండా వాడితే ?

ఔషధ గుణాలున్న అల్లాన్ని రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం డేంజరే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు.ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా ఆయుష్షును పెంచుతుంది. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేర్చే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. 

గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.Thursday, April 6, 2017

ఇకపై "అప్పు" తెచ్చుకున్నా, "పెళ్ళి" చేసుకున్నా, పన్ను చెల్లింఛవలసిందే ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేయనుంది. ముఖ్యంగా అప్పు తెచ్చుకున్నా, పెళ్ళిచేసుకున్నా, పన్ను చెల్లించేలా ఈ సవరణలు చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం పెళ్లి ఖర్చులకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసముంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో పడక తప్పదు. 

అలాగే, అప్పు తెచ్చుకున్నా.. అది అప్పుగా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందట. అదేవిధంగా ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినా వివరణ ఇవ్వాల్సిందే. లేకుంటే పన్ను కట్టక తప్పదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోళ్లు జరిపితే మాత్రం ఆదాయపన్ను చట్టం వర్తించదు. కాకపోతే ఆ ఆదాయాన్ని నిరూపించలేకపోతే మాత్రం తిప్పలు తప్పవు. 
గతేడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్రం తాజాగా ఆదాయ పన్ను సవరణతో మరో షాక్ ఇచ్చింది. తాజా చట్ట సవరణతో వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం వరకు పన్ను కట్టాల్సి ఉంటుందని పేర్కొంది.

Wednesday, April 5, 2017

"గూగుల్ క్రోమ్" లో "వెబ్ పేజీ"ని PDF లో సేవ్ చేయడం ఎలాగో తెలుసా ?

గూగుల్ క్రోమ్ లో ఎటువంటి  'EXTENSIONS' ఉపయోగించకుండా  వెబ్ పేజీ ని పిడిఎఫ్ (PDF) లో సేవ్ చేయడం ఎలాగో తెలుసా ? తెలియకపోతే ఈ క్రింది లింక్ ఫై క్లిక్ చేసి చూడండి . మీకు గాని ఈ వీడియో  నచ్చినట్లయితే  మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 

వీడియో లింక్:- https://youtu.be/6DQopeU5c_k


Monday, April 3, 2017

"మందు"లో "ఇవి"గాని కలిపి తాగుతున్నారా ? అయితే ??

మద్యపానం ఆరోగ్యానికి హానికరం! అన్న హెచ్చరిక అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా జనం సీసాల కొద్దీ మద్యాన్ని తాగేస్తున్నారు. తాగితే తాగారు, కనీసం మోతాదుని పాటించమని, అందులో కలిపే పానీయాల విషయంలో జాగ్రత్త వహించమని  సూచిస్తున్నారు నిపుణులు.నీరు, సోడా వంటివాటితో కలిపి మద్యాన్ని పుచ్చుకోవడానికీ, కెఫిన్‌ అధికంగా ఉండే శీతలపానీయాలతో కలిపి పుచ్చుకోవడానికీ చాలా తేడా ఉందంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలని నిరూపించేందుకు కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఇందుకోసం వారు 1981 నుంచి 2016 వరకు జరిగిన ఓ 13 పరిశోధనల ఫలితాలను పరిశీలించారు.

మద్యం, కెఫిన్‌ రెండూ విరుద్ధమైన ఫలితాలని ఇస్తాయన్న విషయం తెలిసిందే! ఆల్కహాల్‌ మెదడుని మత్తులో ముంచితే, కెఫిన్‌ మనిషిని ఉత్తేజపరుస్తుంది. కానీ ఈమధ్యకాలంలో కెఫిన్‌ అధికంగా ఉండే ‘రెడ్‌బుల్‌’ వంటి ఎనర్జీ డ్రింక్స్ కలిపి మద్యం పుచ్చుకునే అలవాటు ఎక్కువవుతోంది. ఇక 'మౌంటెన్ డ్యూ' వంటి శీతల పానీయాలలోనూ కెఫిన్‌ అధికంగానే ఉంటుంది. కెఫిన్‌కి తోడు వీటిలో చక్కెరలూ అధికంగానే ఉంటాయి. వీటిని మద్యంలో కలిపి తాగడం వల్ల, మనిషి మద్యం మోతాదుని దాటేస్తాడని కెనడా పరిశోధకులు తేల్చారు. ఒక పక్క శరీరం తూగుతున్నా, నిద్రపోకుండానే గడిపేస్తాడట. ఇలాంటి పరిస్థితి వల్ల తాగి గొడవపడటం, వాహనాలని నడపలేకపోవడం వంటి పరిస్థితులూ తలెత్తే ప్రమాదం ఉంది.

మామూలుగానే కెఫిన్‌ను అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. కెఫిన్‌ పానీయాల వల్ల ఉద్వేగం ఎక్కువవుతుందనీ, రక్తపోటు పెరిగిపోతుందనీ, గుండె వేగం హెచ్చుతుందనీ హెచ్చరిస్తుంటారు. చిన్నపిల్లలు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతారు. అలాంటిది కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలతో కలిపి మద్యాన్ని పుచ్చుకుంటే ఏమౌతుందో తెలిసిందిగా మరి! ఇప్పుడైనా కాస్త జాగ్రత్త పాటిస్తే మంచిది.