CSS Drop Down Menu

Thursday, March 30, 2017

"జీలకర్ర నీటిని పరగడుపున తాగితే" కలిగే ప్రయోజనాలు ఎన్నో !

ఉదయాన్నే జీలకర్ర నీటిని ఇలా తాగితే చాలు ఎలాంటి కొవ్వు అయినా కరిగిపోతుందట. జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారుచేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. 


జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలంటే... ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో ఒక స్పూను జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. దీంతో కింద చెప్పిన లాభాలు కలుగుతాయట.

1. జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. కడుపులో పురుగులు ఉంటే చనిపోతాయి.

2. జీలకర్ర నీటిని తాగితే గర్భిణీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజం చేస్తాయి.

3. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్‌ఫుల్ మెడిసిన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది. దాని వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి.

4. జీలకర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు రావు.

5. సహజసిద్ధమైన యాంటీ వైరల్‌, యాంటీ బయోటిక్‌, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి. కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తగ్గుతాయి.

6. జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలలో రాళ్లు కరుగుతాయి. మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి.

7. కడుపులో వికారం ఉండడం, తల తిప్పడం, త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది.

8. కడుపులో ఏర్పడే అల్సర్లను, పుండ్లను తగ్గించడంలో జీలకర్ర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రోజూ కొద్దిగా జీలకర్ర నీటిని తాగితే చాలు. దీంతో ఆయా సమస్యలు దూరమవుతాయి.

9. జీలకర్ర నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారు.

10. నిద్రలేమితో బాధ పడేవారు జీలకర్ర నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి.

11. జీలకర్ర నీటిని ఓ నెల రోజులపాటు ఉదయాన్నే తాగటం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఒంట్లో కొవ్వు కరిగి పోతుంది.

Tuesday, March 28, 2017

వేడినీటితో స్నానం చేస్తే వ్యాయామం చెయ్యనక్కర లేదట ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. మరికొందరు సీజన్‌కు అనుగుణంగా వేడి, చన్నీటితో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, వేడి నీటితో స్నానం చేసే వారు వ్యాయాయం చేయనక్కర్లేదట. ఈ విషయాన్ని లండన్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.

బాగా అలసిపోయి వచ్చినా.. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా.. వేడినీటితో స్నానం చేస్తే మ‌న‌సు హాయిగా ఉంటుంది. నిజానికి వేడి నీటితో స్నానం చేయడం మంచి అల‌వాటే. పైగా, ఇది ఓ వ్యాయామంతో సమానమట. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చని, అంతేగాక‌, రక్తపోటు, మధుమేహంవంటి రోగాలు సైతం త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని వారు చెబుతున్నారు. 

ఇందుకోసం 2,300 మందిపై పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో 30 నిమిషాలు బ్రిస్క్‌వాక్ చేయించ‌డంతో 140 కేలరీలు ఖ‌ర్చయినట్లు, అనంత‌రం వారికి వేడినీటితో స్నానం చేయించిన‌ట్లు తెలిపింది. వేడి నీటితో స్నానం చేశాక‌ కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు వారు తెలిపారు. అయితే, శ్రమతో బ్రిస్క్ వాక్ చేయడం కంటే వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమని లండన్ పరిశోధకులు తెలిపారు.

Monday, March 27, 2017

"మంచు మనోజ్‌ ఫై పోసాని కృష్ణమురళి" సంచలన వ్యాఖ్యలు !

తిరుపతి శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన మోహన్ బాబు 67వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పోసాని కృష్ణమురళి హీరో మంచు మనోజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు మనోజ్‌ను "సీఎం చేయడం" లేదంటే "మావోయిస్ట్ నేత"గానైనా మార్చండంటూ పోసాని వ్యాఖ్యానించారు.అప్పుడైనా మనోజ్‌లోని కోరికలు, ఆశయాలు నెరవేరుతాయని పోసాని తెలిపారు. 

Thursday, March 23, 2017

Tuesday, March 21, 2017

శరీరానికి నీరు పట్టిందా? ఐతే ఇవి వాడండి !

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ఆపండి. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని బయటికి పంపించేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికంగా నీరుండేలా చేస్తుంది.


శరీరంలోని నీటిని వెలివేయాలంటే.. విటమిన్ బీ6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అర‌టి పండ్లు, అవ‌కాడోలు, బీన్స్‌, పాల‌కూర వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న నీరు బ‌య‌టికి పోతుంది.

నట్స్, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పంచదార, పిండి పదార్థాలు, ఉప్పు తీసుకోకూడదు. ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో నిల్వ అయ్యే అధిక నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

జీల‌క‌ర్ర‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శ‌రీరం నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. జీలకర్రను రోజూ మీరు తాగే నీటిలో అరస్పూన్ లేదా ఒక స్పూన్ వేసి నానిన తర్వాత ఆ నీటిని తాగితే.. ఒంట్లోని నీరు బయటికి వెళ్తుంది. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Saturday, March 18, 2017

ఈ ఏటీఎం కార్డుతో రోజుకు ఎన్నిసార్లు నగదు డ్రా చేసుకున్నా సర్వీస్ ఛార్జీలు పడవు!

బ్యాంకులు విధిస్తున్న నిబంధనలతో ఏటీఎం కేంద్రాల వైపు, బ్యాంక్ బ్రాంచిలవైపు చూసేందుకే వినియోగదారులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని తపాలా శాఖ తనకు అనువుగా మార్చుకుంటోంది.
పోస్టాఫీసులో రూ.50తో అకౌంట్ ప్రారంభిస్తే చాలు.. వెంటనే ఏటీఎం కార్డు కూడా అందజేస్తామని, తమ ఏటీఎం కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి సేవా రుసుములు విధించమని ప్రకటించుకుంటోంది.
దీని ప్రకారం.. కనిష్టంగా రూ.50 చెల్లించి తపాలా కార్యాలయాల్లో ఎవరైనా ఖాతా ప్రారంభించవచ్చు. పాస్ బుక్, ఏటీఎం కార్డు సౌకర్యం కలిగిన ఈ ఖాతాల ద్వారా సులభంగా నగదును తీసుకునే పథకాన్ని ప్రకటించింది.
 తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తపాలా ఏటీఎం కార్డును ఉపయోగించి ఏ పోస్టాఫీసు, ఏ బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచైనా నగదు తీసుకోవచ్చని తెలిపారు.
ఈ ఏటీఎం కార్డుకున్న సౌలభ్యం ఏమిటంటే.. ఒకేరోజు ఎన్నిసార్లయినా నగదు డ్రా చేసుకోవచ్చు.. ఎన్నిసార్లు తీసుకున్నా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు పడవు. బ్యాంకుల మాదిరిగానే తపాలా పొదుపు ఖాతాలకు 4 శాతం వడ్డీని అందిస్తున్నారు. పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ అనే కొత్త పథకంలో డిపాజిట్లపై 4.5 నుంచి 5.5 శాతం వడ్డీని అందిస్తారు.

Thursday, March 16, 2017

"వేసవి కాలం"లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

వేసవి కాలం వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ కాలంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించి.. ఆపై అందులో ఉప్పు లేదా బెల్లం, నిమ్మరసం కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది. ఈ నీరు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

ఎండాకాలంలో చెర్రీ, బెర్రీలు.. బొప్పాయి, యాపిల్ వంటి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లు.. ఎండు ద్రాక్షలు, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. రోజూ ఒక గ్లాసుడు నిమ్మరసంలో పుదీనా చేర్చి తీసుకోవడం ద్వారా నీరసం తగ్గిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.


మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే వాటర్‌మెలాన్ జ్యూస్ రోజూ తీసుకోండి. 90 శాతం ఇందులో నీటి శాతం ఉండటం ద్వారా శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Wednesday, March 15, 2017

గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల గిఫ్ట్ ?

రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాలకు గతంలో ఉన్న ఈ.ఎస్.ఎల్.నరసింహన్‌ను నియమించింది. అయితే రెండు రాష్ట్రాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించిన నరసింహన్ తెలంగాణా రాష్ట్రం విషయంలో కాస్త ఎక్కువగా కేర్ తీసుకున్నారన్నదే రాజకీయ విశ్లేషకుల భావన. కేసీఆర్ గవర్నర్ కాళ్ళకు మొక్కడంతోనే ఒక్కసారిగా గవర్నర్‌కు ఆయనపై ప్రేమ ఒక్కసారిగా పెరిగిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ చంద్రబాబునాయుడు పరిస్థితి అలాక్కాదు. అయితే ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ త్వరలో రిటైర్డ్ అవుతున్నారు. దీంతో కేసీఆర్ గవర్నర్‌కు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే గిఫ్ట్.. ఏంటది.. అనుకుంటున్నారా.. అయితే చదవండి.

నరసింహన్ అత్యున్నత స్థాయి వృత్తి నిపుణత, నిజాయతీ కలిగిన పోలీస్ అధికారి. సాధారణ డిఎస్‌పి నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వరకు ఎన్నో పదవులు నిర్వహించారాయన. అందుకు గుర్తింపుగా, రిటైర్ అయిన తర్వాత గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఒక సాధారణ డిఎస్‌పిగా రాజకీయవాదులకు సెల్యూట్ కొట్టిన రాష్ట్రంలోనే, ముఖ్యమంత్రి చేత నమస్కారం పెట్టించుకొనే గవర్నర్ హోదా సంపాదించడంతోనే ఆయన జీవితం సార్ధకమైంది.

ఇప్పుడు నరసింహన్ పదవీ విరమణ చేయబోతున్నాడు. హైదరాబాదుతో ఆయన బంధం చాలా తక్కువ. కానీ, రిటైర్ అయిన తర్వాత ఆయన హైదరాబాదులోనే స్థిరపడేటట్లు ఒప్పించారట కేసీఆర్. అందుకోసం గచ్చిబౌలి సమీపంలో ఒక ఎకరా విస్తీర్ణంలో, దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన రాజభవనం వంటి ఇల్లు కట్టించి ఇవ్వనున్నారట. ఈ మూడేళ్లపాటు తనకు చేసిన ఉపకారానికి కేసీఆర్ ఇస్తున్న కానుక ఇదని అంటున్నారు. వృత్తి జీవితమంతా నీతికి, నిజాయితీకి కట్టుబడిన నరసింహన్ అంత భూరి కానుక స్వీకరించడానికి సిద్ధంగా వున్నారో లేదో అనే చర్చ జరుగుతోంది.


Wednesday, March 8, 2017

"నిర్మాతల"ఫై హీరోయిన్ మాధవీలత సంచలన వాఖ్యలు !

మాధవీలత. టాలీవుడ్ హీరోయిన్. "నచ్చావులే" చిత్రం ద్వారా వెండితర అంరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన నటనతో ప్రతి ఒక్కరికీ నచ్చినప్పటికీ... ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె వెండితెరకు దూరమైంది. అయితే, గత కొంతకాలంగా మీడియాకు కూడా దూరంగా ఉన్న ఆమె.. ఇపుడు ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. 

తెలుగు చిత్రపరిశ్రమలో తెరవెనుక జరుగుతున్న కొన్ని సంచలన విషయాలను ఆమె బహిర్గతం చేసింది. ముఖ్యంగా, పలువురు నిర్మాతలు హీరోయిన్లతో ఏవిధంగా వ్యవహరిస్తారో వెల్లడించింది. 'నీకు లైఫ్‌ ఇస్తున్నాం కదా.. మరి, నువ్వు మాకేమిస్తావ్‌ అనే ధోరణిలో ఉంటాయి నిర్మాతల వ్యాఖ్యలు. అంతేకాదు చాలా సున్నితంగా నువ్వు సాయంత్రం ఖాళీయేనా అని అడుగుతారు. బయట ఎవరైనా ఇలా మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కానీ, ఇక్కడే బతకాలి కదా! అందుకే చాలా మంది నోర్మూసుకుని ఆ వేధింపులను భరిస్తుంటారన'ని చెప్పుకొచ్చింది. 

ఇటీవలికాలంలో ఈ తరహా వ్యాఖ్యలు పలువురు నటీమణుల నోటి నుంచి జాలువారుతున్నాయి. మరికొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమ కెరీర్‌ దృష్ట్యా ఈ తరహా విషయాలను బయటకు పొక్కనీయకుండా మిన్నకుండిపోతుంటారు. కానీ, అవకాశాలు లేని, ఇండస్ట్రీలో మోసపోయిన నటీమణులు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారనే కామెంట్స్ లేకపోలేదు. 


ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో వివరించింది. లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. 

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. అలాగే నాయొక్క "YOUTUBE" Channel ను కూడా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేనుపెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే "Like" మరియు "Subscribe" చేసుకొంటారని కోరుకుం టున్నాను.  

నాయొక్క "YOUTUBE" Channel link క్రింద ఇస్తున్నాను. క్లిక్ చేయండి.

https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos 

Tuesday, March 7, 2017

Monday, March 6, 2017

ఆ"బిల్లు గాని పాస్ ఐతే"రాబోయే రోజుల్లో "ఎమ్మెల్యే"లకు గడ్డుకాలమే?

ఒక్కసారి గెలిస్తే ఐదేళ్లు ఢోకా లేదు. ఎంజాయ్.. హ్యాపీ. పనులు చేసినా.. చేయకపోయినా అడిగే నాథుడే లేడు. అడిగినా చేస్తే చేస్తాం.. లేకపోతే లేదు. ఇప్పుడైతే ఫుల్ ఖుషీ. ఎప్పుడో ఓసారి నియోజకవర్గానికి వెళ్లి అలా కనిపించి వస్తే సరి.. మళ్లీ జనంతో అవసరం వచ్చేది ఐదేళ్లకు కదా.. అప్పుడు చూసుకోవచ్చు.. ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అనుకునేది ఇలాగే. నియోజకవర్గం అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులకు త్వరలోనే షాక్ తగలనుందా.. రీకాల్ ఆఫ్షన్ దిశగా కేంద్రం ఆలోచిస్తుందా.. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు సరిగా పని చేయకపోతే.. వారిని రీకాల్ చేసే అధికారం ఓటేసిన ప్రజలకు ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అంటున్నారు. దీనిపై లోక్‌సభలో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల్లో పనిచేయని ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకే ఇవ్వాలనేది ఆయన డిమాండ్. 

ఇందులో భాగంగానే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 చట్టానికి 2016లో పార్లమెంట్ సభ్యులు సవరణలు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం రైట్ టు రీకాల్‌ను ఓ ప్రైవేట్ బిల్‌గా పెట్టబోతున్నట్టు ప్రకటించారు. రీకాల్ ఎలా చేస్తారంటే.. ఈ బిల్ చట్టంగా మారితే.. సంబంధిత ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన వ్యక్తి.. డైరెక్టుగా స్పీకర్‌కు పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్‌కు సూచిస్తారు స్పీకర్. విచారణలో పిటీషన్ వ్యక్తి చెప్పిన విషయాలు వాస్తవం అని నిర్ధారణ అయితే.. ఎన్నికల సంఘం సంబంధిత ఎమ్మెల్యేపై రీకాల్ ఓటింగ్ నిర్వహిస్తుంది. అందులో 75 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే.. అతని పదవి ఊడిపోవడం ఖాయం. ఈ బిల్ సామాన్యుడికి దక్కనున్న బ్రాహ్మాస్త్రం అంటున్నారు నిపుణులు. రైట్ టు రీకాల్ బిల్ చట్టం అయితే.. ఎన్నికైన ఎమ్మెల్యే రెండేళ్లలోపే పదవి కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అందలం ఎక్కించిన ఓటరు.. అగాథంలోకి నెట్టే అధికారం కూడా ఇస్తారా.. లేదో చూడాలి. Friday, March 3, 2017

"నువ్వుల నూనె" ఉపయోగాలు !

స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి.. 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిత్యం పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే.. పిల్లల ఎదుగుదల సులువవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.ఇంకా నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది. అందుకే కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బీలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నువ్వుల నూనె చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. చుండ్రు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. అలాగే నాయొక్క "YOUTUBE" Channel ను కూడా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేనుపెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే "Like" మరియు "Subscribe" చేసుకొంటారని కోరుకుం టున్నాను.  

నాయొక్క "YOUTUBE" Channel link క్రింద ఇస్తున్నాను. క్లిక్ చేయండి.


https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos 


Thursday, March 2, 2017

వాటర్ బాటిల్స్‌ను "కొనేముందు" ఈ జాగ్రత్త తీసుకోండి !

ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరైనా మినరల్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసి తాగుతారు. అది మంచిదే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్‌ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించినది. ఇంతకీ ఏంటది? అని అడగబోతున్నారా? అయితే చదవండి..

ఇకపై మీరు వాటర్ బాటిల్‌ను కొని తాగడానికి ముందు దాని కింద భాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. pp, hdpe, hdp, pete, pet, pvc, ldpe అని ఏవైనా ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయా? అవును.. కనిపిస్తాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా? ఆ వాటర్ బాటిల్ తయారుచేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. అంటే ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా.. వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్ బాటిల్‌ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫో, ఏది హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..

pete లేదా pet
వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌తో తయారుచేసిన వాటర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయట. ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మనకు మంచిది కాదట.

hdpe లేదా hdp
వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్ లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవట. అవి పూర్తిగా సురక్షితమైనవట. కాబట్టి వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యనిపుణులు.

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. అలాగే నాయొక్క "YOUTUBE" Channel ను కూడా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేనుపెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే "Like" మరియు "Subscribe" చేసుకొంటారని కోరుకుం టున్నాను.  

నాయొక్క "YOUTUBE" Channel link క్రింద ఇస్తున్నాను. క్లిక్ చేయండి.

https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos