CSS Drop Down Menu

Monday, February 20, 2017

తమిళ సీఎం సొంత జిల్లాలో షాకిచ్చిన జనాలు ?

సాధారణంగా తమ జిల్లా నేత రాష్ట్రాధినేత (ముఖ్యమంత్రి) అయితే, ఆ జిల్లా వాసులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. కానీ, బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి వింత పరిస్థితి ఎదురైంది. 

తమ నేత ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంలో పళనిస్వామి అనుచరులు భారీ మొత్తంలో స్వీట్లు పంచారు. అయితే, వీటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ... అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో జైలుకెళ్ళారు. దీంతో ఆమె తన ప్రధాన అనుచరుడు ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 

దీంతో ఆయనతో గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సేలంలో బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. 

కానీ, స్థానికులు మాత్రం పళనిస్వామి అనుచురులు ఇచ్చిన స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పళనిశ్వాని మద్దతుదారులు విస్తుపోయారు. తమ నేతపై ప్రజావ్యతిరేకత ఇంత స్థాయిలో ఉందా అంటూ వారు ఆశ్చర్యపోయారు. మున్ముందు కూడా ఇదే స్థాయిలో ఉంటే అన్నాడీఎంకే కనుమరుగు కావడం ఖాయమని వారు వాపోతున్నారు. 

0 comments:

Post a Comment