CSS Drop Down Menu

Monday, February 27, 2017

"A నుండి Z" వరకు ఉన్న పాముల పేర్లు తెలుసా ?

"A నుండి Z" వరకు ఉన్న పాముల పేర్లు తెలుసా ? తెలియకపోతే ఈ క్రింది "లింక్" ఫై క్లిక్ చేసి చూడండి ! మీ పిల్లలకు కూడా చూపించండి. 








Saturday, February 25, 2017

"మీలో ఎవరు కోటీశ్వరుడు" షోపై "యండమూరి" సంచలన వ్యాఖ్యలు ?

మనసు ఏముందో అది మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం రచయిత యండమూరి వీరేంద్రనాధ్ అలవాటు. ఈ విషయంలో ఎవరేమన్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. సొసైటీలో జరుగుతున్న దాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తారాయన. తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడి షోపై రచయిత యండమూరి వీరేంద్రనాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు బుల్లితెర షోలకు ఒకొక్కరి వద్ద 15 రూపాయలు చొప్పున 10 లక్షల మంది వద్ద వసూలు చేసి దాంతో కోటి 50 లక్షలు సంపాదించి, అందులో ఆరులక్షలు రూపాయలను మనకు పడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనికన్నా లాటరీ టికెట్ కొనుక్కోవడం బెటరంటూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన వ్యాఖ్యలను పెడర్ధాలు తీయడం కొంతమంది మొదలుపెట్టారు. చిరంజీవి ఆ షో చేయడంవల్లే ఆయన ఇలా అన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Thursday, February 23, 2017

"అన్నం తిన్న తర్వాత" ఈ పనులు గాని మీరు చేస్తున్నట్లైతే ?

అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి..ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆ పొరపాట్లను చేయకండి.

అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు… తిన్నతర్వాత పక్కకెల్లి చేతులు బయట కడగాలి తప్ప కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది.

చాలామంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు ఉండదు.ఇది దరిద్రానికి సంకేతం.కాబట్టి తిన్నవెంటనే కంచం ముందునుండి లేవాలి.

తినడం పూర్తవగానే పళ్లల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు పెట్టో, పుల్ల పెట్టో  తీస్తుంటారు. అలాకాకుండా నీటితో పుక్కిలించాలి.

నాలుగవ తప్పిదం ఏంటంటే చాలామంది అన్నం తినగానే ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. ఇది పరమదరిద్రానికి హేతువు. ఒళ్లు విరుచుకోవడం లేదంటే తినగానే పడుకోవడం కూడా సరియైన పధ్దతి కాదు.

భోజనం ముగించగానే చాలామంది చేతులు కడుక్కుని,తడి చేతుల్ని విదులుస్తారు.అలా విదల్చడం చేయకూడాదు ఇది దరిద్రానికి హేతువు.. ఇకపై అన్నం తినగానే ఈ అయిదు పనులను చేయకండి.

Monday, February 20, 2017

తమిళ సీఎం సొంత జిల్లాలో షాకిచ్చిన జనాలు ?

సాధారణంగా తమ జిల్లా నేత రాష్ట్రాధినేత (ముఖ్యమంత్రి) అయితే, ఆ జిల్లా వాసులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. కానీ, బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి వింత పరిస్థితి ఎదురైంది. 

తమ నేత ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంలో పళనిస్వామి అనుచరులు భారీ మొత్తంలో స్వీట్లు పంచారు. అయితే, వీటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ... అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో జైలుకెళ్ళారు. దీంతో ఆమె తన ప్రధాన అనుచరుడు ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 

దీంతో ఆయనతో గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సేలంలో బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. 

కానీ, స్థానికులు మాత్రం పళనిస్వామి అనుచురులు ఇచ్చిన స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పళనిశ్వాని మద్దతుదారులు విస్తుపోయారు. తమ నేతపై ప్రజావ్యతిరేకత ఇంత స్థాయిలో ఉందా అంటూ వారు ఆశ్చర్యపోయారు. మున్ముందు కూడా ఇదే స్థాయిలో ఉంటే అన్నాడీఎంకే కనుమరుగు కావడం ఖాయమని వారు వాపోతున్నారు. 

Saturday, February 18, 2017

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చిందా ?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని కూడా చిన్నమ్మ ఎవ్వరినీ చూడనివ్వలేదు. అమ్మ అపోలోలో చేరే రోజు రాత్రి పూట ఆమెను మన్నార్ గుడి గ్యాంగ్ కొట్టి.. కిందకు తోసిందని.. ఆమె కిందపడిపోయారని.. ఆమెను పట్టుకునేందుకు ఒక్కరూ కూడా లేరని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమయ్యేలా అపోలో ఆస్పత్రి వైద్యురాలు రామసీత చెప్పిన నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాపై హల్ చల్ చేస్తున్నాయి. సదరు వీడియోలో అపోలో డాక్టర్ రామసీత.. షాకయ్యే నిజాలు వెల్లడించారు. 

అపోలోకు అమ్మ జయలలిత డెడ్ బాడీనే వచ్చిందని.. ఆమె నాడీ వ్యవస్థ పనిచేయలేదని చెప్పారు. 20 రోజుల ఆస్పత్రిలో ఉంచి.. ఆపై ఎంజీఆర్ సమాధి వద్ద అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పారు. ప్రిజర్వేషన్ కోసమే అమ్మ ముఖంపై హోల్స్ చేశామని రామసీత తెలిపారు. ఈ వీడియో ఫిబ్రవరి పదో తేదీన అప్ లోడ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


Tuesday, February 14, 2017

"బుడగల"తో జపాన్ కళాకారుడి అద్భుత సృష్టి !


"masayoshi matsumoto" అనే  జపాన్ కళాకారుడు  "బుడగల"తో చేసిన  అద్భుత సృష్టి ! ఈ బొమ్మలు చూసిన వారెవరైనా సరే ఈ కళాకారుడిని అభినందించవలసిందే. 

































Monday, February 13, 2017

పవన్ ని "ఇడియట్" అని తిట్టిన చిరంజీవి ! ఎందుకో తెలుసా ?

హార్వర్డ్ యూనివర్సిటీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను నక్సల్స్‌లో కలిసిపోతానని తన కుటుంబం భయపడేదని.. పవన్ వ్యాఖ్యానించారు. తాను యోగిని కావాలనుకున్నానని.. కానీ జీవితంలో  ఏదైనా సాధించాలనే తపన ఉండాలని తన అన్నయ్య (చిరంజీవి) తిట్టి చెప్పడంతో తనకు జ్ఞానోదయం అయిందని పవన్ వ్యాఖ్యానించారు. తనను  అన్నయ్య ఇడియట్ అని తిట్టాడని చెప్పారు.



సమాజాన్ని స్టడీ చేయడం తనకు చిన్నప్పటి నుంచి అలవాటన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదొకటి అధికారంలోకి వచ్చాక చేసేదొకటిగా ఉందని పవన్ అన్నారు. ఓ దశలో అన్నయ్య లైసెన్స్ గన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని పవన్ తెలిపారు.

Monday, February 6, 2017

వెంట్రుకలను తేలిగ్గా తీసి పారేయకండి!వాటికున్న "బలమెంతో" తెలుసా ?

 వాడెంత? వెంట్రుక సమానమని వెంట్రుకలను తేలిగ్గా తీసి పారేయకండి. దానికున్న స్పెషాలిటీ గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే! మనిషి నెత్తిమీద వుండే వెంట్రుక రెండు ఏనుగులను కట్టి వేసేంత బలం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మితీరాల్సిందే. రీసెంట్‌గా వెంట్రుక స్ట్రెంగ్త్‌పై జరిగిన పరిశోధనలో దాని పవర్ బయటపడింది. 

సుమారు 3 ఔన్సుల బరువుండే ఒక్కో వెంట్రుక డజన్ పెన్నీల బరువును మోస్తుందట. ఈ లెక్కన అసలు వెంట్రుక కథేంటో తేలుద్దామని రంగంలోకి దిగిన సైంటిస్టులు రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ! ఒక్కో  తల మీదుండే వెంట్రుకల మొత్తంతో 12 టన్నుల బరువున్న రెండు ఏనుగులను కట్టివేయవచ్చని తేలింది. మనుషుల వెంట్రుకలు కెరటీన్‌తో తయారైతే, గుర్రాలు వంటి జంతువుల కాళ్ల చర్మం నుంచి పుట్టే వెంట్రుకలకు మనకు తెలియనంత స్ట్రాంగ్‌నెస్ ఉందట. అంతే బలంగావుండే మనిషి  వెంట్రుకలను తేలిగ్గా తీసి పారేయుకుండా వాటికి తగిన పోషక పదార్ధాలు అందించి జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని సైంటిస్టులు సెలవిస్తున్నారు. వెంట్రుకలు చిట్లిపొకుండా విటమిన్లు, ప్రొటీన్లు తీసుకుని వాటిని జాగ్రత్తగా చూసుకుంటే మంచిదంటున్నారు. అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్‌లో క్రాఫ్ చేయించుకుంటే హ్యపీ‌హెయిర్ మీ సొంతం.

Saturday, February 4, 2017

"తనకు ఎవరూ పిల్లనివ్వడానికి రావడం లేదన్న" జబర్దస్ ఫేం సుడిగాలి సుధీర్ !


జబర్దస్ట్ యాంకర్‌ రేష్మీతో ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం టీవీ ప్రొగ్రాంలో భాగంగా నవ్వించడానికే తనకు ఆమెకు లింకు పెడుతుంటారని జబర్దస్ ఫేం సుడిగాలి సుధీర్ వివరణ ఇచ్చారు. రేష్మీతో అఫైర్ వార్తలను ఖండించాడు. ఇటీవల టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అమ్మాయిల పిచ్చి ఉందన్నట్టు స్కిట్లు రాస్తుంటారని తెలిపాడు. ఇలాంటి విషయాల్ వల్ల తన క్యారెక్టర్ పై చెడు ప్రభావం పడిందని, దాంతో తనకు ఎవరూ పిల్లనివ్వడానికి రావడం లేదన్నారు. కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. తన జీవితంలో ఇంతకు ముందే ప్రేమ విఫలమైందని, ఇక తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని సుధీర్ వివరించాడు. 



ఇటీవల యాంకర్ రష్మీకి, సుడిగాలి సుధీర్‌కు మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నట్టు వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రష్మి స్పందిస్తూ 'ఎవరికి కావాల్సింది వాళ్లు మాట్లాడుకుంటారు. నాకు వచ్చే నష్టమేముంది' అని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అఫైర్ పై సుధీర్ వివరణ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. 




Wednesday, February 1, 2017

చెర్రీ "డబ్బుల కోసం" నన్ను నానా హింసలు పెట్టాడన్న చిరు !

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. "ఖైదీ నంబర్ 150"వ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి... నిర్మాతపై కనకవర్షం కురిపిస్తున్నారు. అయితే, తన తనయుడైన ఖైదీ చిత్ర నిర్మాత రామ్ చరణ్‌కు నాన్నపై ఉండే ప్రేమ కంటే.. డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉందనీ, అందువల్ల తనను నానా హింసలు పెట్టినట్టు చిరంజీవి తన తనయుడిపై పంచ్‌లు వేశాడు.

సంక్రాంతి పండుగ రోజున 'ఖైదీ నంబర్ 150' హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వివి.వినాయక్‌లతో నాగబాబు కుమార్తె నీహారిక యాంకర్‌గా ఓ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో చిరంజీవిని నీహారిక అడిగిన ఓ ప్రశ్నవేసింది. "డాడీ... నీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా" అని నీహారిక తన పెదనాన్న చిరంజీవిని అడిగింది. 

నీహారిక అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసిన చిరంజీవి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమన్నారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్ ఫుడ్, ఎక్సర్ సైజుల గురించి నిత్యమూ పర్యవేక్షిస్తుండే వారని, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ, నిత్యమూ వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు.

"నిత్యమూ నా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సపోర్ట్, ప్రేమతో... నా పని సులువైంది. ఇదంతా ఆలోచిస్తుంటే... అబ్బా, నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ, ప్రేమ కాదు... వాడు సినిమా నిర్మాత. సో, హీరో బాగుంటేనే కదా, నాలుగు డబ్బులు వస్తాయని, డబ్బు మీద మమకారంతో వీడు నన్ను నానా హింసలూ పెట్టాడు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది" అని చిరంజీవి నవ్వుతూ అన్నారు.