CSS Drop Down Menu

Friday, January 13, 2017

శవయాత్రలో "బికినీ"లతో డ్యాన్సు !

సంప్రదాయాలు రకరకాలు. పుట్టినరోజు వేడుకలకు సహజంగా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఐతే మరణం సంభవిస్తే మాత్రం ఇంటిల్లపాదీ అంతా శోకంలో మునిగిపోతారు. ఐతే కొన్నిచోట్ల ఇందుకు భిన్నంగా కనబడుతుంది. తమిళనాడులో చనిపోయినవారికి పెద్దపెట్టున మేళం వాయిస్తూ శవం ముందు చిందులు వేస్తూ ఊరేగింపు చేస్తారు. ఇలాంటిదే తైవాన్లోనూ జరిగింది. 

 కౌన్సిలర్‌గా పనిచేసిన తంగ్ హ్సింగ్ మరణించారు. ఐతే మరణించేముందు ఆయన తన చివరి కోరిక ఒకటి చెప్పారట. అదేమిటంటే... తన మరణం కూడా పుట్టినరోజులా జరుపుకోవాలనీ, అంతా సంతోషంగా తన శవాన్ని తీసుకెళ్లాలని కోరుకున్నారట. అంతేకాదు... తన శవయాత్రలో కనీసం 50 మంది అమ్మాయిలు బికినీలు ధరించి డ్యాన్సు చేస్తూ ఉండాలని కోరుకున్నారట. 

 ఆయన గత డిసెంబరులో చనిపోయారు. దాంతో ఆయన కోరుకున్నట్లుగా శవ యాత్రలో 50 మంది అమ్మాయిలు బికినీలు ధరించి వాహనాల పైకి ఎక్కి నాట్యం చేశారు. అంతా బికినీలతో అలా డ్యాన్సులేస్తుంటే రోడ్లపై వెళ్లేవారు వారి ఫోటోలను తీసుకునేందుకు ఎగబడ్డారట. దాంతో శవయాత్ర కాస్త వినోదయాత్రలా మారిపోయింది.

0 comments:

Post a Comment