CSS Drop Down Menu

Friday, December 30, 2016

Tuesday, December 27, 2016

Monday, December 26, 2016

"జాజికాయ"తో ఎన్నో ప్రయోజనాలు !

జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కామవాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడిచేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది. నరాల బలహీనతని పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. 

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 

తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు. అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. 

ఈ కాయలో లభించే 'మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జాజికాయ వాడకం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం. గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.


Saturday, December 24, 2016

రాజమౌళిని "కొట్టిన" విజయేంద్రప్రసాద్! ఎందుకో తెలుసా?


ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నేలమీద ఒక లైనులో పాకుతూ వెళుతున్న చీమల్ని నలుపుతూ చంపడం గమనించాను. వెంటనే పిర్ర మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాను. ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాజమౌళి. ఎత్తుకుని సముదాయించాను. ఇప్పుడు ‘నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? అని అడిగాను. కన్నీళ్ళు పెట్టుకుంటూనే తెలియదన్నాడు. ‘ఎందుకు ఏడ్చావ్‌?' అని అడిగాను. నొప్పి పుట్టింది అన్నాడు. నువ్వు నలిపినప్పుడు చీమలకు కూడా అలాగే నొప్పి పుడుతుంది. జీవహింస మహాపాపం. ఇతరుల్ని ఎప్పుడూ అలా బాధ పెట్టకూడదు' అని చెప్పాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఎప్పుడూ కొట్టలేదు అంటూ విజయేంద్రప్రసాద్ నవ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.Friday, December 23, 2016

అచ్చం జయలలిత ముఖంలా ఉండే 68 కిలోల ఇడ్లీ !

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణించిన నేపథ్యంలో.. ఆమె మరణించి ఇన్నాళ్లైనా.. తమిళనాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆమెపట్ల అభిమానం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని వాళ్లు చాటుకుంటూనే ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధికి అభిమానులు భారీ స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. 

తాజాగా జయలలిత వయసు (68 సంవత్సరాలు)ను సూచించేలా.. 68 కిలోల బరువున్న ఒక ప్రత్యేకమైన ఇడ్లీ ఒకదాన్ని తయారుచేశారు. అచ్చం జయలలిత ముఖంలాగే ఉండేలా  దాన్ని రూపొందించారు. ఇంతకుముందు కూడా అమ్మ మీద అభిమానాన్ని పలు రకాలుగా తమిళ ప్రజలు చాటుకున్నారు. కానీ, తమిళులకు ప్రీతిపాత్రమైన టిఫిన్ అయిన ఇడ్లీని కూడా ఆమె ముఖం గుర్తుకొచ్చేలా తయారుచేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ఇడ్లీని అమ్మ సమాధి వద్ద ప్రజలకు సందర్శించే విధంగా ఉంచారు. అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మకు ఆలయంతో పాటు విగ్రహం కూడా సిద్ధం చేశారు. చెన్నై మెరీనాలోనే అమ్మకు ఆలయం నిర్మించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Wednesday, December 21, 2016

శృంగార ప్రియులకు ఇష్టమైన రోజులు ?

శృంగార ప్రియులు ఏ రోజుల్లో సెక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్నారనే అంశంపై తాజాగా నిర్వహించిన సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వారంలో మిగిలిన రోజుల కంటే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లో శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారం పట్ల ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా శనివారం రాత్రి 7.30కు ఎక్కువ మంది సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారట. వారానికి నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు తమ నిజమైన వయస్సు కన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారట.

 ఇకపోతే మిగిలిన రోజుల్లో శృంగార ప్రియులు సెక్స్ పట్ల ఆసక్తి చూపట్లేదని.. గురువారం పూట మాత్రం కొంత ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఇక సోమవారం 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. మిగిలిన విషయాల్లోకి వస్తే.. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలో తేలింది. కొన్నిసార్లు సాయంత్రం 4.30 గంటలకు వారు సెక్స్‌కు సరైన సమయంగా ఎంచుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 

Tuesday, December 20, 2016

ప్రతి భారతీయుడి తల మీద ఎంత "అప్పు" ఉందో తెలుసా ?

మనకు తెలీకుండానే మనల్నే ప్రపంచ‌బ్యాంకు వద్ద తాకట్టు పెడుతున్నాయి ప్రభుత్వాలు, మన ప్రమేయం లేకుండా మనల్ని రుణ గ్రస్తుల్ని చేస్తున్నాయి. మనకు తెలీకుండానే మనమీద దేశం చేసిన అప్పు 60 లక్షల 19 వేల కోట్లు. ప్రస్తుతం మన దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం 129.5 కోట్లు.

ఈ దామాషా ప్రకారం ప్రతి భారతీయుడి తల మీద రూ. 46,485 అప్పు వుందన్నమాట ఇది లేటెస్ట్ ఫిగర్స్. ఐతే, 2016 మార్చి 31 నాటికి తలసరి అప్పు రూ.53,796 గా నమోదైనట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. దీనిపై ఏటా చెల్లిస్తూ వస్తున్న వడ్డీ దాదాపు రూ. నాలుగు లక్షల కోట్లు. వృద్ధి సాధించడానికి ధన వ్యయం పెంచడంవల్లే అప్పు పెరిగినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభకు తెలిపారు.  

Monday, December 19, 2016

"చిలకడదుంప"లను తినడం వల్ల కలిగే ఉపయోగాలు !

చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి. విటమిన్ 'ఎ', యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. 

చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.

Tuesday, December 13, 2016

అమ్మ మరణానికి "విగ్రహ ప్రతిష్టాపనే" కారణమా ?

నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన తమిళ దివంగత సీఎం జయలలిత మరణానికి సంబంధించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే ఉంది. అపోలో వైద్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించిన ఒకరోజు ముందే ఆమె చనిపోయారని కొంతమంది వాదిస్తుంటే.. అసలు అమ్మ మరణానికి స్పష్టమైన కారణాలేంటో చెప్పాలని నటి గౌతమి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమ్మ మరణానికి సంబంధించి ఓ ఆసక్తికర వాదనను కొంతమంది తెరపైకి తెచ్చారు. ఓ విగ్రహ ప్రతిష్టాపనకు అమ్మ మరణంతో లింకు పెట్టేశారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన వల్లే అమ్మ మరణించారంటూ ఇప్పుడు తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. దైవ సంబంధిత విషయాలకు అధిక ప్రాధాన్యతమిచ్చే కొంతమంది వ్యక్తులు.. ఇలాంటి ప్రచారానికి ఆస్కారం కల్పించారన్న వాదన కూడా లేకపోలేదు.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. కాంచీపురం జిల్లాలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన ఏకాంబరనాథర్‌ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం ఉంది. కొన్నాళ్ల క్రితం ఇది ధ్వంసం కావడంతో.. దీని స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఆలయ కమిటీ ప్రతిపాదనల్ని తోసిపుచ్చుతూ..చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు చెప్పారు. అంతేకాదు మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేత ప్రాణానికి గండం ఏర్పడుతుందని కూడా చెప్పారట. అయితే ఇవేవి పట్టించుకోని ఆలయ కమిటీ ఈ నెల 5న కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. జయలలిత కూడా అదే రోజున కన్నుమూయడంతో.. అమ్మ మరణానికి విగ్రహ ప్రతిష్టాపనే కారణమంటూ కొంతమంది వాదించడం మొదలుపెట్టారు.

Wednesday, December 7, 2016

శీతాకాలం లో ఏఏ పండ్లు తినాలో తెలుసా?

శీతాకాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. శీతాకాలంలో దానిమ్మను తీసుకోవచ్చు. దానిమ్మను అలాగే తీసుకోవడం లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం వంటివి చేయొచ్చు. ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పూర్తిగా కలిగివుండే ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చును. 

అలాగే సి విటమిన్ ఫ్రూట్స్ గల నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్, టాంగరీన్స్ వంటివి తీసుకోవాలి. టాంగెరీన్స్ తీసుకోవడం ద్వారా వింటర్లో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీ లభించాలంటే నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందే. అయితే ఫ్రూట్ జ్యూస్ తీసుకునేటప్పుడు వేడి చేసిన నీటిని చల్లార్చి వాటితో తయారు చేసిన జ్యూస్‌లను తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Monday, December 5, 2016

"లేత మునగ ఆకు" చేసే మేలేంటో తెలుసా?

మునక్కాడలు అందరికీ తెలుసు.  కాడలు అడిగితే ఇవ్వడానికి బాధపడతారు. లేత చిగుళ్లు ఇచ్చేందుకు ఎవరు బాధపడరు.  వీటితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. తోటకూరలాగా, పప్పు పులుసు, పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే వాత వ్యాధులన్నిటిలోనూ ఔషధంలా పనిచేసి నొప్పులు, పోట్లు తగ్గిస్తాయి. 

కడుపులో పైత్యం, మంట, గ్యాస్, వేడిని తగ్గిస్తుంది. కడుపులోని పాములను వెళ్లగొట్టేందుకు సహకరిస్తుంది. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం కొవ్వును కరిగించి, పొట్ట తగ్గించేందుకు స్థూలకాయం తగ్గేందుకు తోడ్పడతాయి. గుప్పెడు లేత మునగ చిగుళ్లను నీటిలో వేసి రసం పొడి కలిపి కమ్మని చారును కాసుకుని ప్రతి ఉదయం రాత్రి ఒక్కో గ్లాసు చొప్పున తాగండి లేదా అన్నంలో తినండి. చాలా కమ్మటి ఆహార పదార్థం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.