CSS Drop Down Menu

Tuesday, October 4, 2016

"తలతిరగడం" తగ్గించే సులువైన మార్గాలు !

శరీరం లేదా మనస్సు బ్యాలెన్స్ (సమతౌల్యంను) కోల్పోయినప్పుడు ఇలా జరగడం సహజం అయితే ఇది వ్యాధి మాత్రం కాదు. ఇది లోబ్లడ్ ప్రెజర్, డీహైడ్రేషన్,మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన వంటి డిజార్డర్స్ వల్ల కలిగే లక్షణాలు, అలాగే తలకుగాయాలు తగిలినప్పుడు కూడా ఇలాంటివిజరుగుతుంటాయి. తలతిరుగుడుకు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఉన్నాయి. ఇవి తల తిరగడం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

తలతిరుగుడు నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగించవు, కాబట్టి తలతిరుగుడు తగ్గడానికి ఈ క్రింది సూచించిన 12 హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి.

 చమోమెలీ టీ తాగడం వల్ల మానసికంగా ఉపశమనంకలుగుతుంది.శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఎనర్జీ అందడం వల్ల తలతిరిగే సమస్యలుండవు.

ఉదయం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల శరీరం మొత్తానికి ఆక్సిజన్ క్రమంగా సప్లై అవుతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. లాంగ్ డీప్ బ్రీత్ వల్ల తలతిరగడం నివారించుకోవచ్చు.

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వెంటనే ఇమ్యూనిటి పవర్ ను అందిస్తుంది. దాంతో తలతిరుగుడును తగ్గించుకోవచ్చు. ఉసిరికాయను నేరుగా అలాగే తినడం లేదా, ఉసిరికాయకు కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసి పేస్ట్ చేసి, నీళ్ళు కలిపి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం దీన్ని పరగడపును తాగాలి.

ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలాగే నానబెట్టాలి, ఉదయం వడగట్టి, ఆ నీటితో పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు లక్షణాలను నివారిస్తుంది.

జాజికాయ పొడి మిక్స్ చేసిన జీలకర్ర తినడం వల్ల డీజినెస్ తగ్గిపోతుంది.

తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే అరకప్పు పెరుగు తినడం వల్ల తల తిరగడం, అలసట తగ్గిపోతుంది. 

బాదం ఒక బెస్ట్ డ్రై ఫ్రూట్ , బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి,. అలాగే వీటితో పాటు పాలు కూడా తాగడం వల్ల తలతిగడం దూరం చేస్తుంది.

తులసి, ఒక గ్లాసు పాలలో కొద్దిగా తులిసి వేసి బాయిల్ చేసి, రాత్రి నిద్రించడానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు తగ్గిపోతుంది.

తల నుదిటి బాగంలో కొద్దిగా పెప్పర్మింట్ ఆయిల్ ను అప్లై చేసి, మర్ధన చేయడం వల్ల తలతిరగడం తగ్గుతుంది.

సెలరీ జ్యూస్ తలతిరుగుడు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రెజర్ తగ్గిస్తుంది,. లోయర్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది తల తిరగడం తగ్గిస్తుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది. సగం నిమ్మకాయను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా ఎనర్జీ పొందుతారు .

డీహైడ్రేషన్ కారణంగా తలతిరుగుతుంది. కాబట్టి, తరచూ కొద్దిగా నీళ్ళు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల తలతిరుగటాన్ని నివారించుకోవచ్చు.



0 comments:

Post a Comment