CSS Drop Down Menu

Friday, October 21, 2016

అమ్మవారి దర్శనం కోసం వచ్చే ఎలుగుబంట్లు !

చత్తీస్‌గడ్‌లోని అమ్మవారి దేవాలయంలో జరిగే వింత ఇది. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు. ఇందులో విశేషం ఏముంది... కానీ, ప్రతి రోజు ఉదయాన్నే ఎలుగుబంట్లు అమ్మవారి దర్శనం కోసం వచ్చి నిలబడ‌తాయి. మనుషుల మాదిరిగానే చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటాయి. 



హారతి ఇచ్చి, ప్రసాదం పెట్టిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. మిగతా భ‌క్తులెవ‌రికీ అవి హాని తలపెట్టవు, అప్పుడప్పుడు వాటి పిల్లలను కూడా గుడికి తీసుకొని వస్తాయి. ఆల‌యంలో పూజారుల‌కు ఇది ఒక ఆన‌వాయితీగా మారిపోయింది. దీనితో వారు కూడా ఎప్పుడు బ‌ల్లూక భ‌క్తులు వ‌స్తాయోన‌ని ఎదురుచూసి, ప్ర‌సాదాలిచ్చి పంపుతుంటారు.

0 comments:

Post a Comment