CSS Drop Down Menu

Wednesday, October 12, 2016

నిన్నటి "భిక్షగాడు" నేడు "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ"లో సీట్ సంపాదించాడు !

జ‌య‌వేల్ సొంత ఊరు ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా. ఇతను పుట్టే నాటికి వారికి కొంత పంట పొలాలు ఉండేవి కానీ 1980 లో వచ్చిన వరదలకు పంటలు కొట్టుకుపోవడంతో వారి కుటుంబంపై ఒక పెను ప్రభావాన్ని చూపించింది. పూట గడవడమే చాలా కష్టంగా మారుతున్నా రోజులు, ఇక ఇక్కడ ఉంటే బ్రతకడమే కష్టం అవుతుందని వారి కుటుంబం చెన్నైకి వలసపోయింది. అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకి జ‌య‌వేల్ నాన్న చనిపోయారు. ఎలాంటి పరిస్థితిలలో చెన్నైకి వచ్చారో మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైంది జయవెల్ అమ్మకి, తనకి. వాళ్ళ నాన్న చనిపోయిన తరవాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని సమయంలో తన తల్లికి ఏ పని చేయాలో తెలియక భిక్షాట‌న చేయడం ప్రారంబించింది.

జ‌య‌వేల్ తల్లి యాచక వృత్తి ప్రారంబించింది కానీ ఉండేందుకు వారికి ఎలాంటి వసతి లేదు, చివరికి ఫుట్ పాత్ వారికి రక్షణ అయింది. ఫుట్ పాత్ లపై పడుకుంటే అప్పుడప్పుడు పోలీసులు వచ్చి తరిమేవారు అక్కడి నుండి వెళ్లి మరో ఫుట్ పాత్ చూసుకోవలసిందే !అదే వీరి జీవితం.

కొన్ని రోజుల తరవాత జ‌య‌వేల్ అమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది. దానితో చిన్న తనంలోనే భిక్షాట‌న చేయడం ప్రారంబించాడు జ‌య‌వేల్. అలా భిక్షాట‌న చేయగా వచ్చిన డబ్బుతో తన అమ్మ కడుపును నింపుతూ తన కడుపు నింపుకున్నాడు.


సూయం ట్రస్ట్ కు చెందిన ఉమా ముత్తురామన్ అనే మహిళ తన భర్తతో కలసి చెన్నై వీధుల్లో చిన్నారుల జీవితాల‌పై ఓ ప్రాజెక్టు నిమిత్త‌మై జ‌య‌వేల్‌ను క‌లిసింది. జ‌య‌వేల్ లో  తెలివితేటలూ ఉమా ముత్తురామ‌న్ గారిని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రపంచం మొత్తం బిక్షాటన చేసే వారిని నిందించటమే కానీ వారు బిక్షాటన చేసేది జానెడు పొట్ట నింపుకునేందు అని ఎందుకు అనుకోరు .. అంటూ…. ఆకలి ఈ ప్రపంచంలో కొందరిని మంచివారిగా చేస్తుంది, కొందరిని చెడ్డవారిగా చేస్తుంది అందుకే జ‌య‌వేల్ ని చదివించి తనకి మంచి భవిషత్ ని ఇవ్వాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని జయవేల్ తల్లికి చెప్పింది. కానీ జయవేల్ తల్లి మాత్రం తమలాంటి వారు పేరు చెప్పుకొని ప్రభుత్వ పెద్దల దగ్గర డబ్బులు వసూళ్లు చేసుకుంటారని  నమ్మలేదు. ఎందుకంటే అంతకు ముందే చాలా మంది   వచ్చిఫొటోస్  తీసుకోని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మళ్లీ కనబడలేదు. అదే విషయాన్నీ ఉమా ముత్తురామ‌న్ కి కూడా చెప్పింది జయవేల్ తల్లి. దానితో ఆ తల్లి  భాదను అర్ధం చేసుకున్న ఉమా ముత్తురామ‌న్ 1999 లో జయవేల్ ను ఒక స్కూల్లో చేర్పించింది.

వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి చదువును ఇష్టంతో చదవడం ప్రారంబించాడు జయవేల్. దానితో ఇంటర్మీడియట్ లో చాలా మంచి మార్కులు సాధించాడు. ఆపై ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్  సంపాదించాడు. ఇప్పటికే రేసింగ్ కార్ల వృద్ధికి సంబంధించిన కోర్స్ ను పూర్తీ చేసి పై చదువుల కోసం ఇటలీకి ప్రయాణం అవుతున్నాడు. జయవేల్ ని చదివించేందుకు కొంత కష్టం అవుతున్నప్పటికీ తన చదువుకి మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా చూస్తున్నాం అంటున్నారు ఉమా ముత్తురామ‌న్ దంపతులు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి చెన్నై నగర వీధుల్లో బిక్షాటన చేసి, ఒకరి ఆసరాతో చదువులు చదివి…… ఎలాంటి సదుపాయాలు లేకున్నా పరిశోధనల వైపు వెళ్తున్న జయవేల్ మరెందరికో స్ఫూర్తి.

0 comments:

Post a Comment