CSS Drop Down Menu

Thursday, September 29, 2016

"పెరుగు"లో వీటిని క‌లుపుకుని తింటే ?

జీల‌క‌ర్ర‌ పొడి ఒక స్పూన్‌ను ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది. 

ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. జీర్ణక్రియ మెరుగవుతుంది. 

పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. 

పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

Wednesday, September 28, 2016

Tuesday, September 27, 2016

శృంగార ప్రియులకు శుభవార్త ! ఇకపై రోబోలే ...

మనిషి జీవితమే యాంత్రికంగా మారిపోతోంది. అలాంటిది ఇప్పుడు సెక్స్ కూడా యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటి అంటే సేఫ్ సెక్స్. ఎలాంటి సమస్యలు ఉండవు. పోలీసు కేసులు ఉండవు. ఎవరితో గొడవ ఉండదు అని చెబుతున్నారు. 2050 నాటికి అమ్‌స్ట‌ర్‌డ్యామ్‌లోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్స్‌లో ఇదే పరిస్థితి ఏర్పడబోతుందని ఓ పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 

అమ్మాయిలను తలదన్నేలా ఈ రోబోలను తయారు చేస్తారట. దీని వల్ల చాలా సమస్యలు తప్పుతాయని రోబోఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు. డబ్బులు అవసరైమనపుడు ఏటీఎమ్‌కి వెళ్లినట్టు.. కోరిక తీర్చుకోవడానికి ఈ ఎస్‌ఎమ్‌ (సెక్స్‌ మెషీన్స్‌) వద్దకు వెళ్లొచ్చట. మోడళ్లతోపాటు కావాల్సిన షేప్‌, రంగు, బాడీ సైజ్‌తో శృంగార ప్రియులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. పైగా వీటి వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి వ్యాధులూ సంక్రమించవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కాగా అభిరుచులకు అనుగుణంగా ఈ సెక్స్‌ రోబోలను మార్కెట్‌లో విక్రయిస్తారు. ఈ రోబోలు మనుషుల కంటే బెటర్‌ లవర్స్‌గా వ్యవహరిస్తాయని రోబోఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. బెడ్రూమ్‌లో వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా ఈ ప్రోగ్రామింగ్‌ జరుగుతుందనీ, వారి కోరికలు, అవసరాల మేరకు మనుషులను మించినస్థాయిలో అత్యుత్తమమైన ప్రేమికులుగా ఇవి తమ భాగస్వామి లేదా తమను కొనుక్కున్న యజమాని/యజమానురాలితో వ్యవహరించగలవని లోవాలోని కిన్‌వుడ్‌ కాలేజ్‌కు చెందిన రోబోటిక్‌ నిపుణుడు జోయెల్ స్నెల్ అంటున్నారు. 

సెక్స్‌ చేసేటప్పుడు మనుషులతో పోలిస్తే.. ఇవి ఉత్తమంగా వ్యవహరిస్తాయని అందువల్ల రాబోయే కాలంలో రోబోలతో సెక్స్‌ ఒక వ్యసనంలా మారిపోతుందన్నారు. మానవ సంబంధాల్లో సాధ్యంకాని విధంగా, స్ర్తీ లేదా పురుషుడు తాము కోరిన సమయంలో, కోరినరీతిలో సెక్స్‌ చేయడానికి ఈ రోబో లవర్స్‌ సిద్ధంగా ఉంటాయన్నారు. సెక్స్‌ క్రైమ్‌పై పెద్ద పోరాటం చేయడానికి, సురక్షితమైన క్రియేటివ్‌ సెక్స్‌ కార్యకలాపాలకు ఇవెంతో దోహదపడతాయని బిహేవియర్‌ థెరపిస్ట్‌ నికోలస్‌ అజులా చెబుతున్నారు. 

Monday, September 26, 2016

ప్రస్తుతం బూమ్మీద ప్రాణాలతో ఉన్న వ్యక్తులు ఎవరూ ఈ సినిమా చూడలేరు ?

మీరు చదివిన టైటిల్ నిజమే... ప్రస్తుతం బూమ్మీద ప్రాణాలతో ఉన్న వ్యక్తులు ఎవరూ ఆ సినిమా చూడలేరు. ఒక వేళ మీరు వందేళ్లు మించి బ్రతికితే మాత్రం ఆ సినిమా చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే.... 100 ఏళ్ల తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే తెరకెక్కించిన '100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్‌ సీ' చిత్రం 2115వ సంవత్సరం నవంబర్‌ 18న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడున్న వారెవరూ చూడలేని, ఇప్పట్లో విడుదల కాని ఈ సినిమాను తీయడం ఎందుకు? అనే డౌట్ మీకు రావొచ్చు.... వెర్రి వేయి విధాలా అంటే ఇదే. రికార్డుల కోసం కూడా ఇలాంటి సినిమా తీయొచ్చు.
అసలే పైరసీ రాజ్యమేలుతున్న ఈ ఆన్ లైన్ కాలంలో ...... అన్నేళ్లు ఆ సినిమా బయటకు లీక్ కాకుండా ఎవరు కాపాడతారు? అంటే అందుకు సంబంధించిన తగిన ఏర్పాట్లు చేసామని అంటున్నారు. ఈ సినిమా ప్రిటును బుల్లెట్‌ ప్రూఫ్‌ లాకర్‌లో పెట్టి 18 నవంబర్‌ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్‌ చేశారు. వందేళ్ల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానిస్తారట. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు వీళ్లు కూడా ఈ సినిమా చూడలేరు. వారి వారసులే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? సినిమాలో ఏం చూపించారు? తెలియాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే.

Saturday, September 24, 2016

వేంకటేశ్వరస్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులో పెడతారో మీకు తెలుసా ?

ఇదివరకు తిరుమలలో తొండమాన్‌ చక్రవర్తి స్వామివారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్‌ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడట. స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నారు. పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడట. స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్ళి చూడు అన్నారట స్వామి.
 
  మరుసటి రోజు వెళదాం అని అనుకుని స్వామివారు చెప్పారట ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడట. మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలని బయలుదేరాడట. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచినడిచి భీముడి ఇంటి దగ్గరలో సృహ తప్పి పడిపోయాడట. అప్పుడు ఆ భీముడే తొండమాన్‌ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకెళ్ళాడట. తొండమాన్‌ చక్రవర్తి అడిగాడట. ఒరేయ్‌ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు. వేంకటేశ్వరస్వామివారికి నువ్వంటే చాలా ఇష్టం అని.
 
భీముడు అన్నాడు.. నేనేం చేస్తాను స్వామి కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు. కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేశావు. వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసిదళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వరస్వామివారిమూర్తికి సమర్పించేవాడట. ఏ పని మొదలుపెట్టినా గోవింద నేను చేయడమేమిటి. నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడట. అప్పుడు తొండమాన్‌ చక్రవర్తి అనుకున్నారట. వీడేమో అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు. నేనేమో నేను చేస్తున్నారు అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరం చేసే పెద్ద తప్పిందం.
 
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామివారికి సమర్పించి తను తినేవాడట. స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యాడట. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకుని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటిమీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకి తొడిగారట. స్వామివారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారట. ఇప్పటికీ  స్వామివారి ఆనందనిలయంలో మొదటి నైవేద్యం కుండతో  పెరుగు అన్నం. ప్రతిరోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటి మాత్రమే స్వామి తింటారని పురాణాలు చెబుతున్నాయి. దీని సారాంశం ఏంటంటే ఎక్కడ భక్తి ఉందో అక్కడ స్వామివారు వశుడై పోతాడట. ఎక్కడ గర్వం, అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరట. 


Friday, September 23, 2016

వీకెండ్‌లో బాగా నిద్రపోతున్నారా! అయితే ?

సాధారణంగా వీకెండ్ (వారాంతం) వచ్చిందంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వారమంతా కష్టపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా నిద్ర పోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని, అలసట దూరం అవుతుందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, వీకెండ్‌లో పూర్తిగా నిద్రపోవడం వల్ల విశ్రాంతి లభించకపోగా శరీరానికి అలసట ఏర్పడుతుందని పరిశోధకులు అంటున్నారు. 

 
  ఇదే అంశంపై స్వీడన్‌లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఓ సర్వే జరిపారు. వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై జరిపిన ఈ పరిశోధనలో కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లో అధిక సమయంతో పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. దీంతో విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది ఏర్పడుతుందన్నది పరిశోధన సారాంశం.
 


Thursday, September 22, 2016

ఝాన్సీ కామెంట్స్‌కు షాక్ తిన్న జనాలు !

యాంకర్ ఝాన్సీ... తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సీనియర్ యాంకర్. బుల్లితెర తో పాటు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో వందల ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన అనుభవం ఉంది. అలాంటి ఝాన్సీ ఇటీవల ఓ ఆడియో వేడుక సక్సెస్ మీట్ లో నోరు జారారు. ఇండియాలోనే ప్రముఖుడైన సినీ నేపథ్య గాయకుడు ఏసుదాసును ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. 'మనలో ఒక్కడు' అనే తెలుగు సినిమా ఆడియో సక్సెస్ మీట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సభ్యులు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సన్మాన సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ ఏసుదాసును పొగడ్తలతో ముంచెత్తే క్రమంలో నోటికి వచ్చిన పదాలు వాడేసింది. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే ఆయన్ను అవమానించింది.


ఈ కార్యక్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ.... ‘అమర గాయకుడు ఏసుదాసు గారు' అంటూ సంబోధించింది. ఝాన్సీ అలా అనడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. చనిపోయిన వారి విషయంలో మాత్రమే ‘అమరుడు' అనే పదం వాడతారు.


ఆమె అలా వ్యాఖ్యానించడంతో సభలో ఉన్నవారి ఎక్స్ ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి, కొందరు సీరియర్ గా ఫేసు పెడితే, మరికొందరు నవ్వుకున్నారు. అయితే అప్పటికీ ఝాన్సీ తన తప్పును గుర్తించలేదు. అలాగే తన వ్యాఖ్యానం కొనసాగించింది.


అయితే సభ ముగిసిన తర్వాత ఆమె చేసిన తప్పును కొందరు ఆమెకు వివరించిన వెంటనే ఈ విషయమై ఆమె ఏసుదాసును కలిసి క్షమాపణలు చెప్పినట్లు, చిత్ర యూనిట్ సభ్యులు కూడా కొందరు ఆమెను ఈ విషయమై మందలించినట్లు సమాచారం.Friday, September 9, 2016

మాంసంలోని "కొవ్వు"ని తగ్గించాలంటే ?

ఆదివారం  నాన్ వెజ్ లాగించేయాల్సిందేనని అందరూ అనుకుంటారు. అయితే మాంసంలోని కొవ్వు పదార్థాలతో ఒబిసిటీ వంటి ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారు. అందుకే మాంసం ముక్కల్లో క్యారెట్ ముక్క వేసి ఉడికిస్తే మాంసంలోని కొవ్వుని క్యారెట్ పీల్చుకుంటుంది. ఉడికిన క్యారెట్‌ను బయటకు తీసి పారేసినా ఓకే లేకుంటే మిగిలిన కాయగూరలతో కలిపి సూప్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకు ఆ సూప్‌ని తాగించవచ్చు. 


Wednesday, September 7, 2016

"స్నానాలు" ఎన్ని రకాలో తెలుసా ?

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది. అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు. సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు. కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...? దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో...

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
 
ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది. ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం. వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
 
ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు. కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు. ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
 
* పురాణాలలో స్నానం : మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.


* మంత్ర స్నానం: వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
 
* భౌమ స్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".
 
* ఆగ్నేయ స్నానం: సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"
 
* వాయువ్య స్నానం: ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"
 
* దివ్య స్నానం: లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
 
* వారుణ స్నానం: పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".
 
* మానస స్నానం : నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
 


Monday, September 5, 2016

"మినరల్ వాటర్" మంచిదేనా ?

ఒక‌ప్పుడు ఏ ఇంటి ముందు ఆగి కాస్త దాహం తీర్చ‌మంటే... రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. ఇపుడు క‌నీసం హోట‌ల్‌లోనూ తాగ‌డానికి పరిశుభ్ర‌మైన నీరు దొర‌క‌డం లేదు. అందుకే అంతా మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వ‌స్తోంది. ఇక మ‌నం నీరు తాగే ముందు అది మిన‌ర‌ల్ వాట‌రేనా అని ఆలోచించ‌డం కామ‌న్ అయిపోయింది. ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ని కొని అవే మంచివని లీటర్ 4 రూపాయల నుండి 25 రూపాయలు వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నాం.  కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్‌లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరూ.

రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే, రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.


భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా, ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా, రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయిందని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక స్టార్ హోటల్స్ లో రాగి పాత్రలని వాడుతున్నారు.. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ప‌రిశుభ్ర‌మైన నీరు తాగండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి.


Saturday, September 3, 2016

"బెల్లం పాలు" తీసుకొంటే కలిగే ప్రయోజనాలు !

పంచదార లేకుండా ఒక కప్పు పాలు లేదా టీ తాగాలి అనుకుంటున్నారా ? కానీ.. స్వీట్ నెస్ మాత్రం మిస్ అవకూడదని భావిస్తున్నారా ? అయితే పంచదారకు బదులు పాలల్లో బెల్లం కలుపుకుని తీసుకోండి. రుచితో పాటు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 


బెల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే.. పాలలో బెల్లం కలుపుకుని తీసుకోవడం వల్ల.. మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే పంచదార తీసుకోవడాన్ని తగ్గించడానికి మనలో చాలామంది ప్రయత్నిస్తున్నాం.

అయితే పంచదారకు బదులు.. బెల్లం చక్కటి ఆప్షన్. ఇది మీరు తీసుకునే పాలు లేదా టీని టేస్టీగానే కాదు.. హెల్తీగానూ మారుస్తుంది. పెద్దవాళ్లు.. డైలీ డైట్ లో పాలు, బెల్లం చేర్చుకోవడం చాలామంచిదని.. నిపుణులు సూచిస్తున్నారు. మీకు తెలుసో ? తెలియదో గానీ.. ఒకప్పుడు పల్లెటూర్లలో కాఫీ, టీలలో బెల్లంనే వాడేవాళ్లు. మరీ ప్రతిరోజూ ఒక కప్పు పాలు, బెల్లం కాంబినేషన్ తీసుకోవడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి:- మీరు అధిక బరువు ఉన్నారని పంచదారకు దూరంగా ఉంటున్నారా ? అయితే.. పాలల్లో బెల్లం కలుపుకుని తీసుకోవడం స్టార్ట్ చేయండి. బెల్లంలో పొటాషియం, పాలలో క్యాల్షియం ఉండటం వల్ల.. మిమ్మల్ని స్లిమ్ అండ్ ట్రిమ్ గా మార్చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుని చూడండి.. ఫలితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు.

రక్తహీనత :-  అనీమియా అరికట్టడానికి చాలామంది మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. బెల్లంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. అనీమియా అరికట్టే పవర్ ఉంది. ఒక గ్లాసు పాలు, బెల్లం మహిళల్లో అనీమియా సమస్యతో పోరాడుతుంది.

చర్మానికి, జుట్టుకి బెల్లంపాలు:- చర్మానికి, జుట్టుకి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. డైలీ డైట్ లో ఈ కాంబినేషన్ ను చేర్చుకుంటే.. మీ చర్మం గ్లోయింగ్ గా మారడమే కాకుండా.. ఫ్రెష్ గా కనిపిస్తుంది. అలాగే జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

రుతుక్రమంలో పొట్టనొప్పి:- మహిళలకు రకరకాల సమస్యలను నివారించడంలో బెల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పి నివారించడంలో ఈ కాంబినేషన్ చక్కటి పరిష్కారం. బెల్లం పొట్టలో చల్లటి అనుభూతిని కలిగిస్తుంది.

రోగ నిరోధక శక్తీ:- ఇమ్యునిటీని మెరుగుపరచడానికి బెల్లం, పాలు మిశ్రమం అద్భుతమైన ఔషధం. ఈ రెండింటిలోనూ.. ఉండే పోషకాలు.. మనుషుల శరీరంలో అనారోగ్యాన్ని నివారించి.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

జాయింట్ పెయిన్స్:- చిన్నప్పటి నుంచి.. బలమైన ఎముకలు పొందడానికి పాలు తాగాలని వింటూ ఉంటాం. పాలు, బెల్లం రెండూ.. ఎముకలు, కండరాలకు పోషణ అందిస్తాయి. పాలలో బెల్లం మిక్స్ చేసి తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి.

జీర్ణక్రియ:- బెల్లం తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెల్లం, పాలు కలిపి తీసుకుంటే.. జీర్ణసంబంధిత సమస్యలు, కాన్ట్సిపేషన్, పేగుల్లో సమస్యలను నివారించవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను రెగ్యులేట్ చేస్తుంది.

బెల్లం, పాలలో అద్భుతమైన..పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి.. ఖచ్చితంగా ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ప్రతిరోజూ తీసుకుంటే.. ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

 

Friday, September 2, 2016

భోజనం ఎలా చేయాలి ?

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం:- నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌. 
 
కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం:- భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేయ‌నీయ‌ద‌ట‌.
 
ఉప‌వాసం ఉండ‌డం:- హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా. ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం మంచిదేన‌ట‌. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌టం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌.

Thursday, September 1, 2016

"ఆర్థిక" సమస్యల నుంచి బయటపడాలంటే ?

ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య వినిపించదు

ప్రతిఒక్కరూ.. తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాగించడానికి చాలా ముఖ్యమైనది. ఆహారంతోపాటు, డబ్బు కూడా చాలా అవసరమైనది. అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావాల్సినంత డబ్బు పొందగలుగుతాం. కొన్ని సార్లు.. అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. మనకు అనుకూలంగా అన్నీ సాగుతుంటాయి. అయినా కూడా.. మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. ఎప్పుడూ.. డబ్బు కొరతగా, లేమి అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే.. వెంటనే.. అలర్ట్ అవ్వాలి. మీ కష్టార్జితం కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడకపోతే.. తర్వాత మరింత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం, కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవడం, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల.. మీరు సంపాదించిన ధనం మీ దగ్గరే ఉంటుంది. డబ్బు లేదు అన్న సమస్య దగ్గరకు రాకుండా ఉంటుంది. మరి అందుకోసం ఏం చేయాలో చూద్దాం.
 
ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. అలాగే.. మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య మరోసారి వినిపించదు.

1.పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

2.మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా..స్థిరంగా ఉంటుంది.

3.వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.

4.మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఇది కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది.

5.కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు.. అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే.. కూజా లేదా కుండను తెరచి ఉంచకండి.. మూతపెట్టుకోవాలి.

6.మెటల్ ఫిఫ్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

7.సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో వాళ్లందరూ.. కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్లందరి ఆదాయం.. పెరుగుతుంది.

8.మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే.. క్యాష్ లాకర్ ఉత్తరంవైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి.. మంచి లాభాలు పొందుతారు.

9.షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల.. ఎనర్జీని ఇచ్చి.. డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు.

10.మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే.. ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా, అందంగా ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ పెరిగి.. మంచి లాభాలు పొందుతారు.

11.చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ( స్టెయిర్ కేస్ ) ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది.

12.మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.

13.మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా.. ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇట్లు.. పేదరికం, డిప్రెషన్ కి సంకేతం.

14.వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే.. సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను. . గ్రహించే శక్తి వాస్తుకే ఉంది.

15.ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే.. కుటుంబ సభ్యులు.. అనారోగ్యంపాలవడం, తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి.

16..లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ.. డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.