CSS Drop Down Menu

Tuesday, August 9, 2016

"మగవాళ్ళని రానివ్వని గుళ్ళు" ఎక్కడున్నాయో తెలుసా ?

మీకు తెలుసా ? మగవాళ్ళను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయని ...! అవును మీరు విన్నది కరక్టే. మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడి లోకి మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ కాపలాదారులు పహారా కాస్తుంటారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం !

  బ్రహ్మ దేవునికి ఆలయాలు అరుదు. అలంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో కలదు. బ్రహ్మ దేవుడు మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటుపక్క పోరు.
 
దేవీ ఆలయం కన్యాకుమారి లో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.
 
అట్టుకల్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఒక్క మగాడూ అటువైపు వెళ్ళడు. వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన.
 
మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.
 
చక్కులాతుకవు దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమంవారిని పూజిస్తారు.
 
చెంగన్నూర్ భగవతీ ఆలయం కేరళలో కలదు. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.


0 comments:

Post a Comment