CSS Drop Down Menu

Wednesday, August 31, 2016

చనిపోయేందుకు పార్టీ ?

మరణం అనే మాట అంటే చావు భయం. చనిపోతామని తెలిస్తే ఇంకేముంది... అంతా అయిపోయింది అని గుండె చెరువయ్యేలా ఏడుస్తారు. కానీ ఓ మహిళ ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది. తను ఇక ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న ఆ మహిళ తన చావు బాధాకరంగా ఉండకూడదని, చాలా సంతోషకరమైన ముగింపు కావాలని కోరుకుంది. దాంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన స్నేహితులందరికీ ఆహ్వానాలు పంపింది. 
 
ఆమె పేరు బెట్సీ డావిస్. 41 ఏళ్ల వయసున్న ఆమె రంగస్థల నటి, చిత్రకారిణి కూడా. ఆమె ప్రాణాంతక వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. మరో 6 నెలలకు మించి బ్రతకవని ఆమెకు స్పష్టం చేశారు. ఆ మాట విన్న బెట్సీ కుంగిపోలేదు. తిన్నగా ఇంటికి వెళ్లింది. ఓ ఆలోచనకు వచ్చి తనకు బాగా ఆప్తులైన లిస్టును తయారుచేసుకుంది. తను ఓ పార్టీ ఆరేంజ్ చేయబోతున్నాననీ, ఆ పార్టీ అన్ని పార్టీల మాదిరిగా ఉండకపోవచ్చనీ, కాబట్టి మనసు స్థిరత్వం, దృఢంగా ఉండేవారు మాత్రమే రావాలనీ, చివరికి ఏం జరిగినా ఎవ్వరూ బాధపడకూడదనీ, అలా బాధపడతామేమోనని అనుకునేవారు తన పార్టీకి రావద్దని తెలిపింది. 
 
'మనసులోని మాటలు పంచుకోవడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయడం, ఇష్టమైన ఆహారపదార్థాలు, ఆల్కహాల్ నచ్చినంత పుచ్చుకుని హాయిగా గడపాలి, ఎవరూ ఏడవకూడదు' వంటి షరతులు విధించింది. ఆమె కండిషన్లు చూసి కొందరు వెళ్లకపోయినా 90 శాతానికి పైగా హాజరయ్యారు. రెండు రోజులపాటు ఆమె తన స్నేహితులతో పార్టీలో హాయిగా గడిపింది. 
 
ఆ ఆనందం ఇక చాలని భావించి, విందు తరువాత ఎక్కువ మోతాదులో మందులు వేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై నెలలో జరిగింది. "తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరు నెలలకు మించి బతికే అవకాశం లేనివారు యుక్తవయస్కులై ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఆత్మహత్య చేసుకోవచ్చు" అనే కొత్త చట్టం కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకువచ్చింది. ఈ చట్టం రాగానే ఇలా ఆత్మహత్య చేసుకున్న తొలి మహిళగా బెస్టీ నిలిచింది.
 


Tuesday, August 30, 2016

సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ?

సినిమా హీరోలు, హీరోయిన్లు ఏం తీసుకుంటారు. ఒక్కసారిగా సన్నబడతారు. సెలబ్రిటీలు ఏం తింటారు.. ఒక్క సారిగా బరువు అలా తగ్గిపోతారు. వారు ఎలాంటి జ్యూస్ లు తాగుతారు. తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి. బరువు తగ్గటం అత్యధికులకు ఓ ప్రధాన సమస్య. ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోక పోతే ఆరోగ్య సమస్యలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. అయితే బరువును తగ్గించుకోవటం కోసం అనేక మార్గాలున్నా అన్నీ సురక్షితం కావు. సహజ సిద్దంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు. వీటన్నటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. 
 
కావాల్సినవి :-
ఒక స్పూన్ తేనె
ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

తయారు చేసే విధానం :- అన్నింటినీ కలిపివేయాలి. తేనె కరిగేదాకా కలపాలి. తయారు చేసిన ఈ డ్రింక్ ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. వారం రోజుల పాటు ఈ డ్రింక్ ను తాగాలి. ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్లీ ఈ డ్రింక్ ను తీసుకోవాలి. ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

Monday, August 22, 2016

ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి ?

ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.
 
ఆదివారం: ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అందుకే  ఆయా రంగుల పట్ల ఆకర్షితులమవుతుంటాము. దీనినే ” కలర్ సైన్స్ ” అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.
 
  సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.

 మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. 
 
బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
 
గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. 
 
శుక్రవారం : శుక్రవారం దేవీ(అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.
 
శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
 


Tuesday, August 16, 2016

మన ముఖ్యమంత్రులు తీసుకునే "వేతనాలు" ఎంతో తెలుసా ?

భారత రాష్ట్రపతి కంటే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకునే వేతనాలు అధికం. భారత రాష్ట్రపతికి రూ.1.50 లక్షలు వేతనంగా ఇస్తుంటే ఉపరాష్ట్రపతికి రూ.1.25 లక్షలు, గవర్నర్‌కు రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తున్నారు. 
 
కానీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకునే వేతనాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెల వేతనం రూ.4.21 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం రూ.2.20 లక్షలు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వేతనం రూ.2.50 లక్షలు, మధ్యప్రదేశ్ వేతనం రూ.2 లక్షలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.1.01 లక్షలుగా పొందుతున్నారు. 
 
అయితే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఒక్క పైసా తీసుకోవడం లేదు. నెలవారీ వచ్చే వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తారు. మమత ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా వేతనంగా తీసుకోక పోవడం గమనార్హం. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం నెలకు ఒక్కటంటే ఒక్క రూపాయిని వేతనంగా పొందుతున్నారు. 
 
మరోవైపు... మంత్రుల వేతనాలను 250 శాతం, ఎమ్మెల్యేల వేతనాలను 126 శాతం పెంచూతూ మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లును పాస్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి. అలాగే, మంత్రుల వేతనాలు రూ.3,20,000లకు, ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించాల్సివుంటుంది.
 

Sunday, August 14, 2016

"తల్లీ కొడుకుల" సహజీవనం !ఇలాంటి వారికి ఎలాంటి "శిక్ష" విదించాలి ?

వారిద్దరూ స్వయానా తల్లీకొడుకులు. తల్లి వయసు 36 యేళ్లుకాగా, కుమారుడి వయసు 19 యేళ్లు. వీరిద్దరూ కలిసి ఓ నీచపు పనికి పూనుకున్నారు. సభ్యసమాజం తలదించుకునే పని చేశారు. వీరిద్దరు చేసిన పాడుపనికి నేరం రుజువైతే ఇద్దరికీ జైలుశిక్ష పడనుంది. న్యూమెక్సికో నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

 న్యూమెక్సికోకు చెందిన మోనికా మారెస్ (36), కాలబ్ పీటర్సన్(19) తల్లీ కొడుకులు. కొన్నాళ్ల తర్వాత పీటర్సన్‌ను తల్లిదండ్రులు వేరేవారికి దత్తత ఇచ్చారు. అయితే, గత యేడాది క్రిస్మస్ సందర్భంలో కుమారుడిని మోనికా తొలిసారి కలిసింది. ఆ తర్వాత తరచూ ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌లు చేసుకుంటూ వచ్చారు.

 రోజులు గడిచే కొద్దీ.. పీటర్సన్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తల్లి మోనికా అంటే ఇష్టం పెంచుకున్నాడు. ఎంతలా అంటే ఆమెను ప్రేమించేంతంగా. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కూడా కొడుకు పట్ల అదే ఫీలింగ్స్ కలిగాయి. దీంతో ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చాలాకాలం పాటు దాచి ఉంచి జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఓ రోజున వారు చేసిన పాడుపని బయటపడింది.

 దీంతో తమ చేసిన పాడు పనిని కప్పించుకునేందుకు సరికొత్త ఎత్తు వేశారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్(జన్యు లైంగిక ప్రేమ(ఆకర్షణ)పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేస్తున్నట్టు నటిస్తూ.. తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక్కడే వారిద్దరూ తప్పు చేశారు. దేశ చట్టాల గురించి పెద్దగా అవగాహన లేక పోవడంతో వారు చిక్కిపోయారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్‌పై అమెరికా, బ్రిటన్‌లో నిషేధం ఉంది. దీంతో వీరిద్దరూ చట్టం ముందు తలొంచుకుని నిలబడాల్సి వచ్చింది. ఈ నేరం రుజువైతే వారిద్దరూ 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Saturday, August 13, 2016

ఇలాంటి నీచమైన పనిచేసినవారికి ఎలాంటి "శిక్ష" విదించాలి ?

వారిద్దరూ స్వయానా తల్లీకొడుకులు. తల్లి వయసు 36 యేళ్లుకాగా, కుమారుడి వయసు 19 యేళ్లు. వీరిద్దరూ కలిసి ఓ నీచపు పనికి పూనుకున్నారు. సభ్యసమాజం తలదించుకునే పని చేశారు. వీరిద్దరు చేసిన పాడుపనికి నేరం రుజువైతే ఇద్దరికీ జైలుశిక్ష పడనుంది. న్యూమెక్సికో నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
న్యూమెక్సికోకు చెందిన మోనికా మారెస్ (36), కాలబ్ పీటర్సన్(19) తల్లీ కొడుకులు. కొన్నాళ్ల తర్వాత పీటర్సన్‌ను తల్లిదండ్రులు వేరేవారికి దత్తత ఇచ్చారు. అయితే, గత యేడాది క్రిస్మస్ సందర్భంలో కుమారుడిని మోనికా తొలిసారి కలిసింది. ఆ తర్వాత తరచూ ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌లు చేసుకుంటూ వచ్చారు. 
 
రోజులు గడిచే కొద్దీ.. పీటర్సన్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తల్లి మోనికా అంటే ఇష్టం పెంచుకున్నాడు. ఎంతలా అంటే ఆమెను ప్రేమించేంతంగా. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కూడా కొడుకు పట్ల అదే ఫీలింగ్స్ కలిగాయి. దీంతో ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చాలాకాలం పాటు దాచి ఉంచి జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఓ రోజున వారు చేసిన పాడుపని బయటపడింది. 
 
దీంతో తమ చేసిన పాడు పనిని కప్పించుకునేందుకు సరికొత్త ఎత్తు వేశారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్(జన్యు లైంగిక ప్రేమ(ఆకర్షణ)పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేస్తున్నట్టు నటిస్తూ.. తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక్కడే వారిద్దరూ తప్పు చేశారు. దేశ చట్టాల గురించి పెద్దగా అవగాహన లేక పోవడంతో వారు చిక్కిపోయారు. జెనటిక్ సెక్సువల్ అట్రాక్షన్‌పై అమెరికా, బ్రిటన్‌లో నిషేధం ఉంది. దీంతో వీరిద్దరూ చట్టం ముందు తలొంచుకుని నిలబడాల్సి వచ్చింది. ఈ నేరం రుజువైతే వారిద్దరూ 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

Friday, August 12, 2016

"వెయ్యి సంపాదించినప్పటి ఆనందం ఇప్పుడు కోట్లు సంపాదించినా" లేదంటున్నహీరోయిన్ ?

సాధారణంగా సెలబ్రిటీలంటే ధనవంతులనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సినీ పరిశ్రమలో ఎంతో మంది కష్టపడిపైకొచ్చినవారే. ఆకోవకు చెందిందే బొద్దుగుమ్మ సమంత. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కోటి రూపాయలు దాటి రెమ్యునరేషన్ తీసుకుంటూ సక్సెస్ బాటలో పయనిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటి సమంత ఇంత స్థాయికి రావడానికి చాలా కష్టపడిందట. డబ్బుల కోసం కూడా చాలా కష్టపడ్డానని తన మాటల్లో వివరించింది. 
 
ఆ విషయోలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం..''నాకు పద్నాలుగేళ్లు వచ్చేసరికే డబ్బు సంపాదన మొదలుపెట్టా. ఏ చిన్న పని దొరికినా చేసేదాన్ని. పెద్దవారి ఇళ్లల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడి అతిథులపై పన్నీరు చల్లే పనికి కూడా వెళ్లేదాన్ని. మూడు గంటలు నిలబడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా భద్రపరుచుకునేదాన్ని. ఆ డబ్బులో ఆనందం కలిగేది. కానీ ఇప్పుడు కోట్లు, కోట్లు సంపాదించినా అప్పటి ఆనందం మాత్రం కలగడం లేదని చెప్పింది. నిజంగా సమంత గ్రేట్ సుమా! 

Wednesday, August 10, 2016

ఆగస్టు 11న ఆకాశంలో అద్భుతం !

ఆకాశంలో మరో అద్భుతానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 11న అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఆనందించవచ్చు. ఎలాగంటారా? అయితే ఈ స్టోరీ చదవండి. మినుగురు పురుగుల వెలుగులా.. గంటకు సుమారు 200 వరకు ఉల్కలు భూవాతావరణానికి ప్రవేశించనున్నాయి. ఈ ఉల్కల ద్వారా ఒక్కసారిగా భారీ వెలుగు వెదజల్లుతాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
ఈ ఉల్కలు సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చే సమయంలో అడ్డువచ్చే దుమ్ము, ధూళి కణాలను ఢీకొన్నప్పుడు మండిపోయి భారీ వెలుగు వస్తుంది. ఇలాంటి ఉల్కల వెలుగు ఎన్నో సంవత్సరాలకు ఓసారే చూసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్త బిల్ కుక్ తెలిపారు. ఈ ఉల్కలు బిలియన్ మైళ్ల పాటు ప్రయాణించి.. ఆపై భూవాతావరణంలోకి వస్తాయని.. ఆ సమయంలో దుమ్ము, ధూళిని ఢీకొని మండితూ వెలుగునిస్తాయని శాస్త్రవెత్తలు చెప్తున్నారు. 

Tuesday, August 9, 2016

"మగవాళ్ళని రానివ్వని గుళ్ళు" ఎక్కడున్నాయో తెలుసా ?

మీకు తెలుసా ? మగవాళ్ళను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయని ...! అవును మీరు విన్నది కరక్టే. మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడి లోకి మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ కాపలాదారులు పహారా కాస్తుంటారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం !

  బ్రహ్మ దేవునికి ఆలయాలు అరుదు. అలంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో కలదు. బ్రహ్మ దేవుడు మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటుపక్క పోరు.
 
దేవీ ఆలయం కన్యాకుమారి లో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.
 
అట్టుకల్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఒక్క మగాడూ అటువైపు వెళ్ళడు. వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన.
 
మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.
 
చక్కులాతుకవు దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమంవారిని పూజిస్తారు.
 
చెంగన్నూర్ భగవతీ ఆలయం కేరళలో కలదు. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.


Saturday, August 6, 2016

మనిషి మూత్రంతో "బీర్‌" ?

బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది నమ్ముతుంటారు కూడా. ఎందుకంటే బీర్ మన శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది. అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా బీర్‌కి యమా గిరాకీ పెరిగింది. సాధారణంగా బీర్‌లో ఆల్కాహాల్‌ శాతం తక్కువ ఉండడమే కాకుండా శరీరానికి చల్లదనాన్నిఇవ్వడం, ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాకపోవడం వల్లే బీర్‌ను అత్యధికంగా ప్రజలు సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీర్‌లో ఎన్నో రకాలున్నాయి. 

 
 
జనాల్లో బీరుకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మనిషి మూత్రంతో బీరును తయారుచేయబోతున్నారు. బెల్జియంలోని ఒక ప్రముఖ యూనివర్శిటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎలాంటే మనిషి మూత్రంను సోలార్‌ హీటర్‌ ద్వారా శుద్ది చేసి దాని నుండి పొటాషియం, నైట్రోజన్‌, పాస్పరస్‌ను వేరుచేయనున్నారు. ఆ మిగిలిన నీటితో బీర్‌ను తయారు చేస్తున్నారు.
 
మనిషి మూత్రంతో చేస్తున్నఈ  బీర్‌ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదని ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా నిపుణులు అంటున్నారు. మరి వినడానికే వింతగా అనిపిస్తున్న ఈ బీర్‌ మందుబాబుల ఆదరణ పొందుతుందో లేదో వేచిచూడాలి..!

Friday, August 5, 2016

"కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.

 
  * మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు.
 
* పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. 
 
* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
 
* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
 
* మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
 
* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
 
* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట.
 
* మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 
 
* గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. 
 
* పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. 
 
* గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
 
* మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. 
 
* మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
 
* ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. 
 
* వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు.. నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, 'సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం,పీచు పదార్థం 0.9 మి గ్రా,ఎనర్జీ  97 కేలరీలు ఉంటాయి.
 

Wednesday, August 3, 2016

5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గించే జ్యూస్ !

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని చాలామంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ తినడాన్నితగ్గించాలని వారంటున్నారు. వీటిల్లో అధికపాళ్లలో సోడియం ఉంటుంది.

ఇది శరీరానికి మంచిది కాదు. వీటివల్ల క్యాలరీలు కూడా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బరువు తగ్గించడం కోసమని నిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలుపుకొని తాగుతుంటారు. అయితే దీనికంటే కొత్తిమీర జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చునని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...!
 
 
  కొత్తిమీరను మిక్సీలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దానిలో నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె కూడా కలపాలి. ఈ జ్యూస్‌‌ని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. అయితే మీరు ట్రై చేయండి.


 

Monday, August 1, 2016

కూల్ డ్రింక్ తాగిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా ?

కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుంచి మ‌న శ‌రీరంలో మార్పులు జ‌రుగుతాయి. కూల్ డ్రింక్‌లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చ‌క్కెర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్‌లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.


కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు డ్రింక్‌లో ఉన్న షుగర్‌ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. 

కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు రక్తంలోకి షుగర్‌ను పంపించడం కొనసాగుతుంది. కూల్ డ్రింక్‌లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా శరీరంలో నిండుతుంది. దీనితో రక్తపోటు పెరిగి, కంటి పాపలు చిన్నగా అవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చెయ్య‌దు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్నపిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు శరీరంలో డోపమైన్ అనే ఓ కెమికల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే అవుతుంది.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కూల్ డ్రింక్‌లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరగ‌డంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.
   
మన శరీరానికి ఇంతలా హాని తలపెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు, మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది.