CSS Drop Down Menu

Thursday, July 14, 2016

"చద్దన్నం" తినడం వల్ల కలిగే ఉపయోగాలు!

రాత్రి మిగిలి పోయిన అన్నంను పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.రాత్రి అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు. 

అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాల్సిన విషయం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. 

మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్న పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి మరియు ఉల్లిగడ్డ నంజుకుని తింటే బాగుంటుంది. కాని ఇప్పుడు చూద్దాం అన్నా ఏ ఒక్కరు కూడా అలా తినడం లేదు. పల్లెటూరులో సైతం రాత్రి అన్నంను పశువులకు పెట్టడంను మనం చూస్తున్నాం. 


అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల పెరిగే పోషకాల గురించి చెబితే తప్పకుండా షాక్‌ అవుతారు. ఉదాహరణకు 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు మనం చూద్దాం... చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. 

వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.

ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే. 

పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుందని తేలింది. 

పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.

ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే వారు.  


0 comments:

Post a Comment