CSS Drop Down Menu

Saturday, July 30, 2016

జపాన్‌ లో "వెరైటీ" హోటల్!

జపాన్‌లో ఉన్న రెస్టారెంట్‌లలో ఆ హోటల్ వెరైటీ. నగ్న మహిళలపై ఆహార పదార్థాలు పేర్చుతున్నారు. వాటిని తినమంటారు. ఇంకేమైనా ఉందా.. అలా నగ్న మహిళపై పేర్చిన ఆహారాలూ మీరు తింటారా? వాంతులు చేసుకోరూ.. అయితే జపాన్‌లో మాత్రం ఎంచక్కా లాగించేస్తారు. ఇదేంటి నిజమా అనుకునేరు. ఆ నగ్న మహిళలంటే నిజమైన వారు కాదండోయ్. బొమ్మలు మాత్రమే. 
 
జపాన్‌లో ఉన్న రెస్టారెంట్‌లలో ఇదో వెరైటీ రెస్టారెంట్‌. దాని పేరు క్యానబాలిస్టిక్‌ రెస్టారెంట్‌. అచ్చం నిజమైన నగ్న మహిళలా కనిపించే బొమ్మలపై వివిధ రకాల ఆహార పదార్థాలు పేర్చుతారు. మహిళల ఆకారంలో రూపొందించిన బొమ్మల్ని టేబుల్‌పై ఉంచుతారు. వచ్చినవాళ్లు అలా నగ్న మహిళలపై పెట్టిన ఆహారపదార్థాలను వినియోగదారులు ఇష్టంగా తింటున్నారు. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు.

Wednesday, July 27, 2016

"నకిలీ తేనె" ను గుర్తించడం ఎలాగో తెలుసా ?

నేడు ఎక్క‌డ చూసినా క‌ల్తీ ప్ర‌పంచం న‌డుస్తోంది. మ‌నం తినే, తాగే ప్ర‌తి ప‌దార్థం కూడా క‌ల్తీ అవుతోంది. నేడు ప్ర‌స్తుతం కల్తీ అవుతున్న ప‌దార్థాల్లో చెప్పుకోద‌గిన‌వి అనేక‌మే ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్య‌మైనది తేనె కూడా ఒక‌టి.
తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాల‌కు తేనె నిలయం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో తేనెకు అధిక ప్రాధ‌న్య‌త ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ప‌లు ఔష‌ధాల‌తోపాటుగా ఇస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తేనె వాడ‌కం ఎక్కువ‌వ‌డంతో వ్యాపారులు దాన్ని కూడా క‌ల్తీ చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌నాల‌కు అస‌లు తేనె ఏదో, న‌కిలీ తేనె ఏదో గుర్తించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే న‌కిలీ తేనె ఏదో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దామా!

మీరు కొన్న తేనె అస‌లుదో, న‌కిలీదో గుర్తించాలంటే దాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. న‌కిలీ తేనె అయితే వెంట‌నే నీటిలో క‌రుగుతుంది. అస‌లు తేనె గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది. అంతే త‌ప్ప నీటిలో అంత త్వ‌ర‌గా క‌ర‌గ‌దు.

ఒక కాట‌న్ బాల్‌ను తీసుకుని దాన్ని తేనెలో ముంచాలి. అనంత‌రం దానికి అగ్గిపుల్ల‌తో నిప్పు పెట్టాలి. అస‌లు తేనె అయితే కాట‌న్ బాల్ మండుతుంది. న‌కిలీ తేనె అయితే కాటన్ బాల్ మండ‌దు.

 ఓ తేనె చుక్క‌ను గోరుపై వేసుకోవాలి. ఆ చుక్క గోరుపై అటు ఇటు క‌దిలితే అది న‌కిలీ తేనె అన్న‌మాట‌. అదే ఆ చుక్క క‌ద‌ల‌కుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను అస‌లైందిగా భావించాలి.

తెలుసుకున్నారుగా! నకిలీ తేనెను ఎలా గుర్తించాలో. ఇక‌ముందు మీరు తేనె కొన్న‌ప్పుడు ఇలా ప్ర‌యోగం చేసి చూడ‌డం మ‌రిచిపోకండి. ఎందుకంటే న‌కిలీ తేనె అయితే దాంట్లో క‌లిపే కెమికల్స్ వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఎంతైనా మ‌న ఆరోగ్య‌మే మ‌న‌కు ముఖ్యం క‌దా!

Saturday, July 23, 2016

వారానికి ఒక్కసారైనా "పెసరట్టు" తినండి! ఎందుకంటే ?

పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కనీసం వారానికి ఒక్క రోజైనా  తింటే  ఎంతో మంచిది. పెసరట్టును తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకి పంపిస్తుంది. 
 
  
పెసరట్టుతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్రలను తీసుకుంటే ఎంతో మేలు. అలాగే, ఇది చక్కెర వ్యాధి, అధిక బరువు, కొలెస్ట్రాల్, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారంతా తినవచ్చు. పెసలు మొలకలు వచ్చిన తర్వాత పిండి చేసుకుంటే దానిలో ఉండే పోషకాలు ఫైబర్, ప్రోటీన్ రెండింతలు అవుతాయి. 

Thursday, July 21, 2016

"కూల్ డ్రింక్స్" కన్నా" ఫ్రూట్ డ్రింక్స్" ప్రమాదకరం !

కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించిన వాళ్లు, కార్బోనేటెడ్ వాటర్ తాగలేని వాళ్ళు ఎక్కువగా తాగేది ఫ్రూట్ పేరుతో తయారుచేసిన పానీయాలు. అందులో మాజా, పల్పీ ఆరెంజ్, స్లైస్, యాపీ, నింబు వంటి ఫ్లేవర్లు చాలా పాపులర్. చాలామంది కూల్ డ్రింక్స్ తాగనివాళ్లు కూడా వీటిని ఫ్రూట్ కంటెంట్‌గా భావించి తాగుతుంటారు. వాస్తవానికి మామూలు కూల్‌డ్రింక్స్‌కి, వీటికి తేడా ఉండ‌దు. చక్కెర నీళ్లకు ఫ్రూట్ కాన్సన్‌ట్రేషన్, ఫ్లేవర్ కలుపుతారు. ఫ్రూటీ, మాజా, పల్పీ ఆరెంజ్, ట్రాపికానా, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇలా మార్కెట్లో ఉన్న చాలా బ్రాండ్స్ పరిస్థితి ఇదే. వాటిల్లో ఫ్రూట్ కంటెంట్ 20 శాతం కంటే తక్కువ. వాటికీ, మిగిలిన కూల్ డ్రింక్స్‌కీ ఏమాత్రం తేడా లేదు. 
 
పల్పీ ఆరెంజ్‌లో 11.8 శాతం ఆరెంజ్, మాజా: 19.5 శాతం మామిడి, యాపీ ఫిజ్: 1.9 శాతం యాపిల్ పల్ప్ కాదు. కాన్సన్‌ట్రేటెడ్ యాపిల్ జ్యూస్. యాపిలో 160 ఎంఎల్‌లో 21 గ్రాములు షుగర్ ఉంటుంది. మినిట్ మేడ్ నింబులో నిమ్మకాయ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. అసలైన నిమ్మకాయ ప్రసక్తే లేదు. ప్రతీ వంద ఎంఎల్‌కీ 11.7 శాతం షుగర్ ఉంటుంది. డైట్ కోక్‌లో షుగర్ వాడరు అనుకుంటాం. కానీ తీపి రావడం కోసం కృత్రిమ రసాయనాలతో తయారైన స్వీటనర్ వాడతారు. రియల్ ఫ్రూట్ జ్యూస్‌లో దానిమ్మ 35 శాతం, ట్రాపికానా యాపిల్‌లో 44 శాతం యాపిల్ ఉంటాయి.
 
ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని ఫ్రూట్ డ్రింక్స్ అనకూడదు. స్వీట్ బేవరేజెస్ విత్ ఫ్రూట్ ఫ్లేవర్ అనాలి. మామూలు డ్రింకుల కంటే ఇవి ఎక్కువ ఎందుకు ప్రమాదం అంటే, నిల్వ ఉంచడం కోసం దారుణమైన ప్రిజర్వేటివ్స్ వాడుతారు. రియల్, ట్రాపికానా వంటి వాటిల్లో ఫ్రూట్ శాతం ఎక్కువయ్యే కొద్దీ ప్రిజర్వేటివ్స్ శాతం కూడా చాలా ఎక్కువ అవుతుంది. మామూలు కార్బోనేటెడ్ డ్రింకులు, అంటే థమ్సప్, పెప్సీ, కోక్ వంటివి కాస్త ఎక్కువకాలం కూడా నిల్వ ఉంటాయి. అవి ఎక్కువ రోజులు నిల్వ అయిపోయినా, పెద్దగా తెలీదు. కానీ ఫ్రూట్ జ్యూస్ కాన్సన్‌ట్రేషన్‌తో తయారైనవి అలా కాదు. కోలా డ్రింకుల్లో కంటే వీటిల్లో ఎక్కువ రసాయనాలు ఉంటాయి. 
 
ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, చక్కెర నీళ్లు పాడైపోకుండా ఉండటానికి వీటిల్లో ప్రిజర్వేటివ్స్ బాగా కలుపుతారు. కృత్రిమంగా ఆయా పండ్ల రుచి తెప్పించడం కోసం రసాయనాలు వాడతారు. ఫ్రూట్ పేరిట అమ్మే డ్రింక్స్‌లో బెన్‌జోయిక్ యాసిడ్ వాడుతారు. కొన్నిటిలో సోడియమ్ బెన్‌జోయేట్, కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం క్లోరైడ్ కూటా ఉంటుంది. ఇవి కిడ్నీలను దారుణంగా దెబ్బతీస్తాయి. గుండె జబ్బులకైనా చికిత్స ఉంది కానీ, కిడ్నీలు పాడైతే మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇవి కాకుండా ఆయా ఫ్రూట్ జ్యూస్ ఉండే రంగు రావడం కోసం సింథటిక్ ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలపడం మామూలే.
 
ఇక చక్కెర సంగతి చెప్పక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఒక మనిషి ఒక రోజుకి 25 గ్రాముల చక్కెర తింటే సరిపోతుంది. ఈ లెక్కన మీరు ఎంత షుగర్ తీసుకుంటున్నారో కాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ఏ ఫ్రూట్ బేవరేజ్ అయినా పేరుకే ఫ్రూట్ డ్రింక్ కానీ, వాస్తవానికి షుగర్ డ్రింక్ అనే చెప్పాలి. ఏ డ్రింక్ అయినా 5 శాతం షుగర్ దాటితే ప్రమాదం. కానీ మనం తాగేవన్నీ 7 శాతం కంటే ఎక్కువ షుగర్ ఉన్నవే. అంతెందుకు మాజా/స్లైస్ వంటి డ్రింకును నాలుగు-ఐదు రోజులు కదపకుండా ఉంచేయండి. బాటిల్ కింద భాగంలో నిల్వ పదార్థాలు తెట్టు కట్టి కనిపిస్తాయి.

Wednesday, July 20, 2016

"ఏపీ సియం ఇంటి ముందు ఆత్మహత్య " చేసుకుంటానన్న "హీరో" ?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న సాధన సమితి అధ్యక్షుడు, హీరో శివాజీ సంచలన ప్రకటన చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకుండా ప్యాకేజీకి అంగీకరిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిముందు తాను సూసైడ్ చేసుకుంటానని స్పష్టంచేశాడు.ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం వుందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. దీనికోసం అందరం పోరాడుదామని ఆయన చెప్పుకొచ్చారు.                                                                                            

Tuesday, July 19, 2016

"ఒక్క ద్రాక్ష పండు" ఖరీదు "25 వేలు"!

జపాన్‌లో అత్యంత అరుదుగా లభించే రూబీ రోమన్ రకానికి చెందిన ద్రాక్షపండ్ల ఖరీదు గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఒక్క ద్రాక్ష పండు ఖరీదు ఎంతో తెలుసా...? అక్షరాల మన కరెన్సీలో రూ.25 వేలు ఉంటుంది. ఇది పండ్ల ధరా లేక షాపు మొత్తం ధరనా అని అనిపించకమానదు. సాధారణంగా ఒక కేజీ ద్రాక్ష దాదాపు రూ.100 అంటేనే కొనడానికి ఆలోచిస్తుంటాం.
అలాంటిది గుత్తిలో ఒక పండుని అంత ధర పెట్టి ఎవరు కొనుక్కుంటారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఖరీదైన, అరుదైన పండ్లను కొనుగోలు చేయడానికి జపాన్ వాసులు క్యూ కడుతున్నారు. ఇది వారికున్న హోదాగా జపనీస్ భావిస్తుంటారు. అందుకని, అటువంటి పండ్లు చకచకా అమ్ముడు పోతున్నాయి. ఇలాంటి పండ్లను విక్రయించే దుకాణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
 
కోనిషి అనే పండ్ల దుకాణదారుడు అరుదైన రూబీ రోమన్ రకపు ద్రాక్ష గుత్తిని 1.1 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో సుమారు 7.35 లక్షలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడు. అయితే ఈ గుత్తిలో ఉన్నవి కేవలం 30 ద్రాక్ష పండ్లు మాత్రమే. అంటే ఒక్క ద్రాక్ష ఖరీదు మన లెక్కలో పాతికవేలన్నమాట. రూబీ రోమన్ ద్రాక్ష ప్రత్యేకత ఏంటంటే... ప్రత్యేక పరిస్థితుల్లో, పలు నూతన పద్ధతుల్లో ఈ పంటను సాగుబడి చేస్తుంటారు. చక్కెర 18 శాతం వరకు ఉండే ఒక్కో ద్రాక్ష పండు 20 గ్రాముల వరకు బరువు తూగుతుంది. 1992 నుంచి జపాన్ తీరప్రాంతం ఇషికవలో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. 
 
2008 నుంచి వినియోగంలోకి వచ్చిన ఈ పండ్ల ధర ఏటికేడాది పెరుగుతూ పోతోంది. ఈ ద్రాక్షకు ఎంత డిమాండంటే ఒక్కోసారి వేలం పాట కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా నిర్వహించిన వేలం పాటలోనే కోనిషి ఈ అరుదైన ద్రాక్ష గుత్తిని అంత రేటు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. తాజాగా జరిగిన వేలంలో అత్యధిక ధరతో ఈ సీజన్‌ తొలిపంటకు చెందిన పండ్లను సొంతం చేసుకుని కోనిషి మరో సరికొత్త రికార్డును సృష్టించాడు. 
 

Monday, July 18, 2016

ఆ "జంట చేసిన పనికి" అందరూ అభినిందాల్సిందే !

పెళ్లంటే….భారీ కట్నకానుకలు, విందుభోజనాలు,హంగులు ఆర్బాటాలు. ఇక సంపన్నుల పెళ్ళి గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు భోజనం మీద చేసే ఖర్చు, స్టేజ్ డెకరేషన్ కు చేసే ఖర్చు…ఓ కుటుంబానికి పది నుండి పదిహేను సంవత్సరాలకు సరిపోతుంది. అయితే ఈ జంట మాత్రం తమ  పెళ్లిని అందరికీ కనువిప్పు కలిగించేలా చేసుకున్నారు. ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎంపికైన అభర్, IDBI బ్యాంక్  మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం… వీరిద్దరూ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఆ ఇష్టమే క్రమంగా పెళ్లికి దారితీసింది.


అయితే….తమ వివాహాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదా గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తమ పెళ్లికి ఖర్చు అయ్యే డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా…ఓ 10 రైతు కుంటుంబాలను గుర్తించి…ఒక్కో రైతు కుటుంబానికి 20 వేల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను అందించారు. అంతే కాకుండా…చదువు విలువ తెలిసిన వారు కాబట్టి…52 విలువైన కాంపిటేటివ్ బుక్స్ ను కొనుగోలు చేసి నాగ్ పూర్ లోని….వివిధ లైబ్రరీలకు ఉచితంగా అందించారు.

పెళ్లికి వచ్చిన అతిథులకు సింపుల్ గా చపాతీ, వెజ్ కర్రీ పెట్టి పంపించారు. హంగు ఆర్భాటాలకు కాకుండా….ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబాలకు  వీరు చేసిన కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Saturday, July 16, 2016

"హ్యాంగోవర్" తగ్గించే ఐస్‌క్రీమ్‌ !

''మందుబాబులం మేము మందుబాబులం''... అంటూ మందుబాబులు రాత్రిపూట ఫుల్లుగా తాగి స్వర్గాల్లో తేలిపోతుంటారు. కాని తెల్లవారేసరికి హ్యాంగోవర్‌తో సతమతమవుతుంటారు. ఆ సమయంలో విపరీతమైన తలనొప్పి బాధిస్తుంటుంది. మజ్జిగ తాగినా కూడా ఆ కిక్ వదిలిపోదు. ఆ కిక్‌ని పోగొట్టే మందు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సరిగ్గా అలాంటివారి కోసమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఓ ఐస్‌క్రీమ్‌ను కనిపెట్టింది.
 
 
 
 
''ట్రీ ఫ్రూట్ జ్యూస్'' అనే ఈ గ్రేప్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ను తింటే చాలు.. క్షణాల్లో హ్యాంగోవర్ ఎగిరిపోతుంది. ఆసియాలోనే ఎక్కువగా ఆల్కహాల్ సేవించే దేశం దక్షిణ కొరియాలో ఈ ఐస్‌క్రీమ్ ఎక్కువగా అమ్ముడుపోతుందట. త్వరలో ఇది భారతదేశంలో అందుబాటులోకి రానుంది.

Thursday, July 14, 2016

"చద్దన్నం" తినడం వల్ల కలిగే ఉపయోగాలు!

రాత్రి మిగిలి పోయిన అన్నంను పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.రాత్రి అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు. 

అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాల్సిన విషయం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. 

మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్న పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి మరియు ఉల్లిగడ్డ నంజుకుని తింటే బాగుంటుంది. కాని ఇప్పుడు చూద్దాం అన్నా ఏ ఒక్కరు కూడా అలా తినడం లేదు. పల్లెటూరులో సైతం రాత్రి అన్నంను పశువులకు పెట్టడంను మనం చూస్తున్నాం. 


అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల పెరిగే పోషకాల గురించి చెబితే తప్పకుండా షాక్‌ అవుతారు. ఉదాహరణకు 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు మనం చూద్దాం... చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. 

వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.

ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే. 

పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుందని తేలింది. 

పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.

ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే వారు.  


Tuesday, July 12, 2016

"అల్లం జ్యూస్" త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు !

అల్లం దీని గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాన్ని  వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా అలవాటు చేసుకున్నారు. కానీ రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం అనే చెప్పాలి. అయితే అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే.. జ్యూస్ రూపంలో అంటే.. ఒక కప్పు అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలా తగినంత జ్యూస్ తీసుకోవడంవలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా!
 

 అల్లం వంటల్లో అద్భుతమైన రుచినే అందిస్తూనే కడుపులోని మంటను కూడా తగ్గిస్తుంది.
 
విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నాటు వైద్యులు చెపుతారు. 
 
అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది.
 
రక్త శుద్దికి, అలాగే రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.
 
డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
 అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి.ఇవి కాన్సర్ ని నివారించడానికి ఉపయోగపడుతాయి. 
 
 గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. 
 
 మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
 అల్లం వల్ల అల్సరు ఏర్పడదు. నోటి దుర్వాసనను పోగొడుతుంది, దంతాలను ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.
 

Monday, July 11, 2016

ఆరోగ్యం కావాలంటే ఆహారంలో " మైదా"ను దూరం పెట్టండి !

ఒకప్పుడు దక్షిణాది భారతీయులకి మైదా అంటే ఏమిటో తెలియదు. బియ్యం లేదా గోధమపిండితోనే వారి జీవనశైలి ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడో! బేకరీల దగ్గర నుంచీ పరాఠా హోటళ్ల దాకా మైదాదే ప్రపంచం. కానీ ఆహార నిపుణులు మాత్రం ఈ మైదాని స్లో పాయిజన్‌గా గుర్తిస్తున్నారు. వీలైనంతగా మైదాకు దూరంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే...

  గోధుమ గింజల్లో ఉండే పిండి పదార్థాలను వేరు చేస్తే అదే మైదాగా మారుతుంది. నిజానికి మైదా రంగు తెలుపు కాదు- పసుపు. పసుపు రంగులో ఉండే మైదాకు తెల్లటి తెలుపుని ఇచ్చేందుకు Benzoic peroxide అనే రసాయనాన్ని కలుపుతారు. ఇక మెత్తగా ఉండేందుకు alloxan అనే రసాయనాన్నీ వాడతారు. ఆహారంలో ఇలాంటి కృత్రిమ రసాయనాలు చేరిక ఏమంత ఆరోగ్యం కాదని వేరే చెప్పనవసరం లేదు కదా!

 మైదాలో GI (glycaemic index) చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిని తిన్నవెంటనే చాలా అధికంగా, చాలా త్వరగా చక్కెరను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇలా త్వరగా ఉత్పత్తి అయిన చక్కెరను నియంత్రించేందుకు మన శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుంది. తరచూ మైదాని తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి, తద్వారా పాంక్రియాస్‌ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే చక్కెర వ్యాధి బారిన పడక తప్పదు.

  మైదాలో పిండిపదార్థాలే కానీ పీచుపదార్థాలు కనిపించవు. మనం తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావాలంటే, అందులో ఎంతో కొంత పీచుపదార్థం తప్పనిసరిగా ఉండితీరాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పేగుల్లో పుండు మొదలుకొని మొలల వ్యాధి వరకూ నానారకాల రోగాలు దాడిచేసే ప్రమాదం మైదా కలిగిస్తోంది.

  మైదాలో ఉండే పోషకాల పట్టికను చూస్తే గుండె తరుక్కుపోక తప్పదు. అందులో పిండిపదార్థాలు తప్ప విటమిన్లు కనిపించవు. ఇక ఖనిజాలు, ప్రొటీన్ల శాతమూ అంతంతమాత్రమే! అంటే మైదాతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం తప్ప మరేదీ మిగలదన్నమాట.

  మైదాలో gliadin అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తాత్కాలికంగా పెంచుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. అంటే ఒక పరాఠా తిన్నవాడు వెంటనే మరో పరాఠా కోసం సిద్ధపడిపోతాడన్నమాట. అసలు మైదాలో ఉండేదే పిండిపదార్థాలు! ఇక ఈ పిండిపదార్థాలను రెట్టింపుగా తీసుకునేలా చేయడం వల్ల మైదా ఊబకాయానికి దారితీస్తోంది.

  ఇప్పుడు ఏ సందు చివర చూసినా బేకరీలే కనిపిస్తున్నాయి. బేకరీ పదార్థాలలో మైదాదే ముఖ్యపాత్ర. పఫ్‌ దగ్గర నుంచి బ్రెడ్ వరకూ మైదా లేనిదే బేకరీలో పని జరగదు. ఇక ఈ మైదాకి తోడు అజినమోటో, MSG వంటి పదార్థాలు కలిస్తే ఇక చెప్పేదేముంది. అనారోగ్యాన్ని టోకుని ఆహారం ద్వారా తీసుకున్నట్లు అవుతుంది.

అసటే మన ఆహారంలో పిండిపదార్థాల శాతం ఎక్కువ. బియ్యం, స్వీట్లు, దుంపలు... వంటి ఆహారాన్ని మనం అధికంగా తీసుకుంటూ ఉంటాము. ఇక వీటికి తోడు ఇప్పుడు బేకరీ చిరుతిళ్లు, పరాఠాలు, పూరీలు, చపాతీలు... అన్నీ కూడా మైదాతోనే తయారవుతున్నాయి. కాబట్టి మైదా పదార్థాల జోలికి పోయేముందు కాస్త నిదానించి, మంచీ చెడూ బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Saturday, July 9, 2016

"మనిషి"ని పోలిన పండ్లను ఎప్పుడైనా చూశారా..?

ప్రకృతిలో అనేక వింతలు దాగున్నాయని మన పెద్దలు అంటూ ఉంటారు. మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..ఎన్ని విషయాలు కనుగొన్నా..ఇంకా అంతుచిక్కని ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నారిఫోన్ పండ్లు. మామూలుగా పండ్లు ఏ ఆకారంలో ఉంటాయి. రౌండ్‌గా ఉండటమో లేదంటే నిలువుగా ఉండటమో జరుగుతుంది. కానీ అచ్చం మనిషిని పోలినట్టు ఉంటే పండ్లును ఎప్పుడైనా చూశారా..? కనీసం ఆ మాటైనా విన్నారా..? కానీ అలాంటి పండు ఒకటి ఉంది. దానిని చూడాలనుకుంటే థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే. 


 యువతి రూపంలో ఉండే ఈ అరుదైన ఫలాలను బియర్ గ్రీన్ ఫ్రూట్ అంటారు. వీటికి బౌద్ధపురాణాల ప్రకారం వీటిని నారిఫోన్ ఫలాలుగా పిలుస్తారు. పూర్వం బౌద్దుల దేవుడైన ఇంద్ర..ఆయన సతీమణి వెస్సంతర..ఇద్దరు పిల్లలో కలిసి హిమఫోన్ అడవుల్లో ఉండేవారట. ఓ రోజు వెస్సంతర తినడానికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను చూసిన కొందరు రుషులు ఆమెపై వ్యామోహంతో వెంబడించారట. అది గమనించిన ఇంద్ర..వాళ్ల దృష్టిని మరల్చడానికి వెస్సంతరను పోలినట్టుగా ఉండే ఫలాలు గల 12 నారిఫోన్ వృక్షాలను సృష్టించాడు. ఆ పండ్లను చూసి ఆకర్షితులైన మనులు వాటిని తింటూ వెస్సంతర‌ను మరచిపోయారట. అలా ఆ ఫలాలను తిన్న మునులు నాలుగు నెలల పాటు నిద్రలోనే ఉండిపోయారట. తర్వాత వాళ్లు నిద్ర లేచేసరికి వారికున్న మహిమాన్విత శక్తులన్నీ కోల్పోయినట్లు చెబుతున్నారు.


 ఇంద్ర..వెస్సంతర మరణించాక ఆ అడవి..నారిఫోన్ వృక్షాలు మాయమైపోయాయట. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కనిపిస్తున్నాయని అంటున్నారు. అలాగే బ్యాంకాక్‌ సమీపంలోని సింగ్‌బురి బౌద్థ ఆలయం ఆవరణలోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయట. అయితే వీటిని నమ్మేవాళ్ళతో పాటు ఇలాంటి పండ్లు లేవని కొట్టిపారేసేవాళ్లు ఉన్నారు. వీటిని కల్పితాలని..ఇలాంటివి అసలు భూమ్మీద లేవని...గ్రాఫిక్స్ అని వాదించేవాళ్లు కోకొల్లలు. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు నిజాలు నిగ్గు తేల్చేందుకు రెడీ అయ్యారు.

Thursday, July 7, 2016

రాత్రిపూట "చపాతీ" లే తినండి ! ఎందుకంటే ?

అధిక బరువు ఉన్నవారు కానీ లేదా అన్నం తింటే తొందరగా అరగటంలేదని చాలా మంది రాత్రిపూట అన్నం బదులు చపాతి తింటున్నారు. మరి ప్లేట్ నిండ అన్నం తినేవారికి రెండు లేక మూడు చపాతిలు కడుపునింపుతాయా ! అంటే అన్నం కంటే వెయ్యి రేట్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చాలా విషయాల్లో మేలు చేస్తోంది ఈ చపాతి అంటున్నారు నిపుణులు.


  • చపాతి ఉపయోగించే గోధుమలలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది.
  • ఇందులో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి. శరీరానికి కావల్సిన పౌష్టికాహారాన్ని అందిస్తాయి.
  • చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
  • గోదుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
  • ఇక రోటీల్లో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతాయి.
  • అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్‌క్యులోసిస్, సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి చపాతీలు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని సంరక్షించుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • వెయిట్ పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు తిరుగులేని ఆహారమని చెప్పుకోవాలి.
  • చపాతీలు చక్కగా జీర్ణమై మరుసటి రోజు శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

 


Tuesday, July 5, 2016

"బాడీ పెయిన్స్‌" త‌గ్గించుకునేందుకు సులువైన చిట్కా !

ఇదేంటి.. బాడీ పెయిన్స్‌ను ఆలివ్ ఆయిల్, ఉప్పు తగ్గిస్తాయా? అనేగా మీ డౌట్‌. అవునండి నిజమే.. బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలామంది ఇంగ్లీష్ మందులు వాడుతారు. నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడుతారు. అయితే వాటివ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ తప్పట్లేదు. తద్వారా నొప్పి తగ్గి మరో ఆరోగ్య సమస్యను కొనితెచ్చుకుంటారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు సూపర్ చిట్కా వుంది.. అదేమిటో చూద్దాం..
 
అరకప్పు ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పులను కూడా ఈ మిశ్ర‌మంతో త‌గ్గించుకోవ‌చ్చు. 
 
ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలున్నాయని.. ఈ మందు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని.. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే.. నొప్పులకు చెక్ పెట్టవచ్చుని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 


Monday, July 4, 2016

అరుదైన "తెలుపు" జంతు జాలాలు !
Saturday, July 2, 2016

"రజనీ యా మజాకా"

క‌బాలీ సినిమా విడుద‌ల‌కు ముందే స్పెష‌ల్ ఫ్లైట్లు గ‌గ‌నత‌లంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌లో ర‌జ‌నీకాంత్ ప్ర‌చారం మారుమోగిపోతోంది. ర‌జ‌నీ అభిమానుల‌కు ఎయిర్ ఏషియా క‌బాలి ఆఫ‌ర్ ఇచ్చింది. క‌బాలి ఫ‌స్ట్ షోతో బెంగ‌ళూరు నుంచి చెన్న‌ైకు జులై 15న బ‌య‌లుదేరుతోంది. ఆ రోజు ఉద‌యం 6.10కి బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి చెన్న‌ైకి ఫ్లైట్ గం. 7.10 నిమిషాలకు చేరుతుంది. 
 
AirAsia-Kabali
 
తిరిగి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, 4 గంట‌ల‌కు బెంగ‌ళూరు చేరుకుంటుంది. దీని ధ‌ర 7,860 రూపాయ‌లు నిర్ణ‌యించారు. ఫ్లైట్ టిక్కెట్టుతో పాటు క‌బాలి మూవీ టిక్కెట్, ఆడియో సీడీ, బ్రేక్ ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్... ఇవి కాక చెన్న‌ై ఎయిర్ పోర్ట్ నుంచి సినిమా థియేట‌ర్‌కు ర‌వాణా ఛార్జీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం డిజైన్ చేసిన క‌బాలి స్పెష‌ల్ ఫ్లైట్ ఇపుడు ముంబై, చెన్న‌ై, ఢిల్లీ ఎయిరోడ్రోమ్‌ల‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. మరి కబాలి హంగామా ఎలా ఉంటుందో చూడాల్సిందే.
 

Friday, July 1, 2016

"నిద్రపోయే ముందు" స్మార్ట్ ఫోన్ వాడితే ?

నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడితే బరువు పెరుగుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక్క స్మార్ట్‌పోన్‌ అనే కాదు.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ వంటి వాటిని కూడా నిద్రపోయే ముందు ఉపయోగించకూడదట. నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తుంటే ఆ స్ర్కీన్‌ మీద ఉన్న ఫోటాన్ల గుంపు  మెదడుకు ‘ఇది నిద్రపోయే సమయం కాదు. అప్పుడే మెలటోనిన్‌ హార్మోన్‌ను విడుదల చేయొద్దు’ అని సందేశం పంపిస్తుందట. 
 
 
చీకటిలో ఉన్నప్పుడు నిద్ర వచ్చేలా చేసే హార్మోన్‌ మెలటోనిన్‌. మెదడు దీనిని విడుదల చేయకపోవడం వల్ల నిద్ర పట్టదట. ఒకవేళ నిద్ర పట్టినా అది గాఢ నిద్ర కాదట. ఈ విధంగా తక్కువగా నిద్రపోవడం వల్ల మెటబాలిజమ్‌ దెబ్బతినడంతోపాటు శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిలు కూడా క్షణక్షణానికీ మారుతూ ఉంటాయి. అందువల్ల పగటి సమయంలో అలసిపోయినట్టుగా, నీరసంగా అనిపించడంతోపాటు ఆకలి ఎక్కువ అవుతుందట. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవడంతోపాటు ఇన్సులిన్‌ స్థాయిలో మార్పులు రావడం ఊబకాయానికి దారి తీస్తుందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.