CSS Drop Down Menu

Tuesday, June 7, 2016

మీ స్మార్ట్ ఫోన్ లో "రీసైకిల్ బిన్‌" ఆప్షన్‌ కావాలంటే ?

విండోస్ కంప్యూటర్‌లలో కనిపించే రీసైకిల్ బిన్ ఆప్షన్ గురించి మనందరికి తెలుసు. పీసీలో అవసరంలేని ఫైల్స్‌ను ఈ ట్రాష్ క్యాన్‌లోకి డంప్ చేసుకుని అవసరమైనపుడు వాటిలో కావల్సిన ఫైల్స్‌ను రీస్టోర్ చేసుకునే వీలుంటుంది. ఇక్కడ దురదృష్టకర విషయం ఎంటంటే..? మైక్రోసాఫ్ట్ అందిస్తోన్నరీసైకిల్‌బిన్ లాంటి ఫీచర్ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అందించలేకపోతోంది.
 
 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో విండోస్ తరహా రీసైకిల్‌ బిన్ ఆప్షన్ కావాలా..? ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కనిపిస్తోంది. మరి ఇలాంటపుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇష్టంగా ఉంచుకున్న డేటా అనుకోకుండా డిలీట్ అయిపోతే ఏం చేస్తారు..? ఈ సమస్యకు సమాధానమే Dumpster App .ద రీసైకిల్ బిన్ ఫర్ ఆండ్రాయిడ్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ బెస్ట్ రీసైకిల్ బిన్ గా వ్యవహరించగలదు. ఈ యాప్ ద్వారా ఫోన్‌లో డిలీట్ అయినా డేటాను తిరిగి రికవరీ చేసుకునేందుకు వీలుంటుంది. యాప్ ప్రత్యేకతలను తెలుసుకుందాం...

Dumpster App గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఈ యాప్‌‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఎంచక్కా మీ రీసైకిల్ బిన్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.


Dumpster యాప్, మీరు మీ ఫోన్‌లో డిలీట్ చేసే ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అవసరమైనపుడు మీరు వాటిని తిరిగి రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఫోన్‌లో మీరు డిలీట్ చేసే ఫైల్స్‌ను భద్రంగా స్టోర్ చేసే Dumpster యాప్ మీ ముందు రెండు ఆప్షన్‌లను ఉంచుతుంది. అందులో మొదటిది రీస్టోరింగ్ ఆప్షన్. అంటే మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌‍లో అవసరమైన వాటిని తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చన్నమాట. మరొక ఆప్షన్ శాస్వతంగా డిలీట్ చేయటం. అంటే డిలీట్ చేసిన ఫైల్స్‌ను శాస్వతంగా ఫోన్ నుంచి తొలగించటమనమాట.
యాప్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఫైల్స్‌ను ఎంపిక చేసుకోటం ద్వారా Dumpster ఆ ఫైల్స్‌కు సంబంధించిన క్యాచీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఫైల్స్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుతుంది.

Dumpster యాప్ ప్రీమియమ్ వర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. ప్రీమియమ్ వర్షన్ యాప్ క్లౌడ్ బ్యాకప్‌తో పాటు యాడ్ ఫ్రీ ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. ఏడాదికి రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.


0 comments:

Post a Comment