CSS Drop Down Menu

Thursday, June 23, 2016

" ఆధార్ కార్డు " తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు !

ఏటియం కార్డు రాకముందు డబ్బులు తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పట్లో బ్యాంకుల నుండి డబ్బులు తీసుకోవడానికి ఒక రోజు మొత్తం లైన్ కట్టాల్సి వచ్చేది. ఏటియం లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా సులభంగా ఏటియం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.

ఆ తరువాత ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకొనే సౌకర్యం వచ్చింది. ఆ తరువాత ఒక ఏటియం కార్డు నుండి మరొక ఏటియం కార్డుకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయగలిగే టెక్నాలజీ వచ్చింది, కాని ఇలా డబ్బులు డ్రా చేయాలంటే ప్రతిసారి ఏటియం కార్డుని జేబులో పెట్టుకొని తిరగాలి. కాని ఇప్పుడు ఏటియం కార్డు కూడా అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

మన దేశంలో అన్ని పనులకు ఉపయోగపడేలా రూపొందించిన ఆధార్ కార్డు ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకొనే ఆవకాశాన్ని కల్పించారు ఆధార్ కార్డుని రూపొందించిన సంస్థ వారు.


 బ్యాంకు ఆకౌంట్ కి ఆధార్ కార్డుని జత చేసిన వారు తమ ఆధార్ కార్డుని ఏటియం మెషిన్ లో ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు మీ వేలి ముద్రని కూడా డబ్బులు డ్రా చేయడానికి వాడుకోవచ్చు అని తెలిపారు. ఆధార్ కార్డు సదుపాయం ఉన్న ఏటియం మెషిన్ లను తొలిసారిగా బెంగళూరు లోని జయనగర్ డీసీబీ బ్యాంకులో ఆధార్ కార్డు రూపకర్త అయిన నందన్ నీలెకని గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా త్వరలోనే అన్ని ఏటియం మెషిన్లకి ఆధార్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకొనే టెక్నాలజీని విస్తరిస్తామని అని చెప్పారు.


0 comments:

Post a Comment