CSS Drop Down Menu

Tuesday, June 14, 2016

"బొట్టు బిళ్ళ‌లు"తో అయోడిన్ లోపాన్ని నివారించు కోవచ్చు!

మ‌హిళ ముఖానికి అందం బొట్టు. నుదుట బొట్టు లేక‌పోతే ముఖం బోసిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు, మ‌ధ్య వ‌య‌సు వారు... తీరిక లేక కుంకుమ బొట్టుకు బ‌దులు బొట్టు బిళ్ళ‌లు వాడుతున్నారు. అయితే, మామూలు బొట్టు బిళ్ళ‌లు పెట్టుకునే క‌న్నా... ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ల‌లు పెట్టుకోవ‌డం ఆరోగ్య‌క‌రం అంటున్నారు మ‌హారాష్ట్ర వైద్య నిపుణులు. 

శ‌రీరంలో అయోడిన్ లోపం వ‌ల్ల గాయిట‌ర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వ‌స్తాయి. దీనిని నివారించేందుకు అతివ‌ల‌కు ఓ సులువైన మార్గం ఇది. మ‌హారాష్ట్ర‌లో మ‌హిళ‌లు ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ళ‌ల‌ను విరివిగా వాడుతున్నారు. వీటిని నుదుట‌న పెట్ట‌కుంటే, రోజుకు 100 నుంచి 150 మిల్లీ గ్రాముల అయోడిన్ శ‌రీరంలోకి వెళ్లిపోతుంద‌ట‌. అందుకే రాత్రిళ్లు 8 గంట‌ల‌పాటు ఈ బొట్టు పెట్టుకుని ప‌డుకుంటే, అయోడిన్ లోపం నుంచి నివార‌ణ పొంద‌వ‌చ్చ‌ట‌.
 
మ‌న దేశంలో 71 మిలియ‌న్ల మంది అయోడిన్ లోపంతో వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఎన్.ఐ.డి.డి.సి. పి స‌ర్వేలో వెల్ల‌డి అయ్యింది. అందుకే మ‌హారాష్ట్ర‌లోని చాలా మంది మ‌హిళ‌లు ఈ అయెడిన్ బొట్టుబిళ్ళ‌ల‌ను వాడుతూ, అయోడిన్ లోపాన్ని నివారించే మెరుగైన ఫ‌లితాల‌ను పొందుతున్నారు.


 

0 comments:

Post a Comment