CSS Drop Down Menu

Monday, May 16, 2016

మరీ ఇంత ఘోరమా ?

కార్మికుల కష్టంతో కోట్లకు పడగలెత్తే బడా కంపెనీలు.. వారి కనీస అవసరాల విషయంలో మాత్రం కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయి. అమెరికాలోని కొన్ని చికెన్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కార్మికులు టాయ్ లెట్ కి వెళ్తే.. ఎక్కడ ఉత్పత్తి తగ్గిపోతుందోనన్న అతితో కార్మికలను టాయ్ లెట్ కు వెళ్లడానికి కూడా నిరాకరిస్తున్నాయి. అభివృద్ది విషయంలో ప్రపంచ దేశాలన్ని కీర్తించే అమెరికాలో కార్మికులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం శోచనీయం. కనీస మానవ విలువలకు కూడా తిలోదకాలిస్తూ.. ఫక్తు వ్యాపార లావాదేవీల కోసం అమాయక కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాయి అమెరికాలోని చికెన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. చౌక ధరకే చికెన్ విక్రయాలు చేస్తూ ప్రపంచ మార్కెట్ లో అధిక ఎగుమతులు చేస్తున్న అమెరికా చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కనీస మానవత్వం పాటించకపోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. టాయ్ లెట్ కు అనుమతించకపోవడంతో చిన్న పిల్లల కోసం వాడే డైపర్స్ ద్వారా తమ టాయ్ లెట్ అవసరాలను తీర్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి కార్మికులు. ఇదిలా ఉంటే మరికొందరేమో.. ఎక్కడ టాయ్ లెట్ కు వెళ్లాల్సి వస్తోందేమోనన్న భయంతో మంచినీళ్లు తాగడం కూడా మానేశారట. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఆక్స్ ఫామ్ సంస్థ తన తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. కార్మికుల హక్కులను తుంగలో తొక్కి ఇలా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న చికెన్ ప్రాసెసింగ్ కంపెనీల పట్ల అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో.. లేదో..!


0 comments:

Post a Comment