CSS Drop Down Menu

Tuesday, May 31, 2016

"9 కోట్లు డబ్బు" వచ్చినా కూలిపనే ముద్దంటున్నాడు !

ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. అతను కోటీశ్వరుడయ్యాడు. అయినప్పటికీ తన పాత వృత్తిని మానుకోనని చెబుతున్నాడు. తాను కూలీ పని చేసేవాడినని, ఇప్పుడు అదే చేస్తానని చెబుతున్నాడు. అయితే, కేవలం ఓవర్ టైమ్ చేయడం మాత్రమే మానేస్తానని చెప్పాడు. సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలి కోట్లు వచ్చినా, అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినా కార్లు కొంటారు. భవంతులు కొంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, ఏదైనా చిన్న పని చేసి ఉంటే లాటరీ తగలగానే మానేయడానికే చూస్తారు.

కానీ లండన్‌కు చెందిన కార్ల్ క్రూక్ మాత్రం తాను మళ్లీ నిర్మాణ పనుల్లో కూలీకి వెళ్తానని చెప్పాడు. ఓసారి కార్ల్ స్థానిక దుకాణంలో కూల్ డ్రింక్ కొన్నాడు. ఓ స్కాచ్ కార్డ్ వచ్చింది. దాని ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఏకంగా రూ.9 కోట్ల కంటే ఎక్కువగా లాటరీ తగిలింది. దీంతో అతను అనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తాను తన వృత్తిని మానుకోనని, కూలీ పని చేస్తున్నప్పుడే తాను ఇక్కడ ఎందుకు ఉన్నానని అనుకునేవాడినని, కానీ తనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ నచ్చిందని, ఈ పని కొనసాగిస్తానని తన యజమానికి కూడా చెప్పానని అన్నారు.

Monday, May 30, 2016

గుండె జబ్బులకు, కాలి బొటనవేలి వెంట్రుకలకుగల సంభందం ?

కాలి బొటనవేళ్లపై వెంట్రుకలు లేకపోతే గుండె సంబంధిత వ్యాధులకు గురవుతారట. అసలు వెంట్రుకలకు గుండెకు లింకేంటి అనుకుంటున్నారా... అయితే పూర్తి కథనం చదవాల్సిందే. సాధారణంగా స్త్రీ లేదా పురుషుల శరీరరంపై పలుచోట్ల వెంట్రుకలు ఉంటాయి. అలాగే కాళ్లపైనా, కాలి బొటనవేలిపై కూడా కొద్దిగా వెంట్రుకలు ఉంటాయి. అయితే కాలి బొటన వేలిపై వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతున్నట్టు అర్థమని డాక్టర్‌ ఓజ్‌ తెలిపారు. 
 
ఈ విషయాన్ని డాక్టర్ వివరంగా తెలిపారు. ఎలాగంటే గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ధమనుల ద్వారా రక్తం సరఫరా అవుతుంది. ఇతర శరీర భాగాలతో పోల్చితే గుండె నుంచి దూరంలో ఉన్న కాలి పాదాలకు కొద్దిగా రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. గుండె నుంచి రక్తం తీసుకువెళ్లే ధమనుల పని తీరు సక్రమంగా లేకపోతే, ఏవైనా అడ్డంకులు ఏర్పడితే కనుక బొటనవేలు ప్రాంతానికి రక్తం సరఫరా సరిగ్గా జరుగదు. అందుకే చేతికైన గాయాలతో పోల్చుకుంటే కాలి గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. 
 
ఇక కాలి బొటన వేలి మీద వెంట్రుకలు ఉండడానికి కూడా కారణం గుండె నుంచి సరఫరా అయ్యే రక్తమేనట. అందుకే కాలి బొటన వేలిపై వెంట్రుకలు లేకపోవడం భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉందట. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదట. దీనిని పరిష్కరించుకోవాలంటే ఆహరంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయట. అడ్డంకులు తొలిగిపోతే కాలికి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని ఓజ్ వెల్లడించారు.

Saturday, May 28, 2016

పోర్న్ చిత్రాలు చూడ్డంలో పెళ్లయిన స్త్రీలే ఫస్ట్ !

ఇంటర్నెట్ ఆవిర్భవించాక అందులో పుట్టుకొచ్చిన అశ్లీల దృశ్యాలతో కూడినవే పోర్న్ సైట్లు. మొదట్లో ఈ సైట్లను మగాళ్లు ఎక్కువగా చూస్తారు అనుకునేవారు. కానీ అసలు పోర్న్ వీడియోలను చూస్తున్నది ఎంతమంది... ఎవరు... అనే దానిపై ఇటీవల ఓ సైన్స్ మ్యాగజైన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. అవేమిటంటే... పోర్న్ వీడియోలను మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ చూస్తారట. 
 
అదికూడా పెళ్లి కాకముందు మగవారు 24 శాతం మంది పోర్న్ చిత్రాలను చూస్తే పెళ్లి చేసుకున్నాక ఆ శాతం 14కి పడిపోతుందట. ఇకపోతే ఆడవారు మాత్రం పెళ్ళికి ముందు 9 శాతం మంది పోర్న్ వీడియోలను చూస్తారనీ, పెళ్లయ్యాక మాత్రం 28% మంది చూస్తున్నట్లు తేలింది. మహిళలు పెళ్లయ్యాక దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తే మగవారు మాత్రం ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా విషయాల కారణంగా వాటి జోలికి వెళ్లడంలేదని తేలింది.

Friday, May 27, 2016

భోజనం చేసిన వెంటనే "నీరు" త్రాగితే ?

మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు, పొట్ట భాగము. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వచ్చేవి. 10% మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, మిగిలిన 90% రోగాలు పొట్ట వల్లే వస్తున్నవి. అన్ని రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు.
 
మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం, మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానము. 
 
"భోజనాంతే విషం వారీ", అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.
 
మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్ ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు.

Wednesday, May 25, 2016

"తేలుకాటు"కు సులువైన చిట్కాలు !

తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగా ఉంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పుట్టడం, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. తేలు కుట్టగానే బెత్తెడు‌పైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టాలి.

కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోయే ప్రమాదం లేకపోలేదు. 

కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆసమయంలో తీయగావుంటుందని నిపుణులు తెలిపారు. 

విషం పారకుండా ఉండటానికి తాత్కాలికంగా ముల్లంగిని తింటే మంచిది. 
 
ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది.

అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం పోతుందని వైద్యులు చెపుతున్నారు. 

Tuesday, May 24, 2016

పెట్రోల్ బంకుల్లో చేసే "మోసం" గురించి తెలుసుకోండి !

ఏటా రహదారుల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాటి ఇంధన ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు యజమానులు తమ పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా వినియోగదారులను మోసం చేస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్ బంకుల్లో మనల్ని ఏమార్చి అక్కడి సేల్స్‌మెన్ మనల్ని ఏవిధంగా మోసం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్ నింపే నాజిల్‌ను సేల్స్‌మెన్ తమ చేతి వేళ్లతో ఎప్పటికీ పట్టుకునే ఉండటం మీరు చూశారా? అయితే ఈ విధంగా చేసే వారి పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారు నాజిల్‌ను మధ్య మధ్యలో పట్టుకుని వదిలేస్తుంటారు. అలా చేయం వల్ల ట్యాంక్ నిండే సమయంలో ఇంధన సరఫరాకు బ్రేక్ పడుతుంది. దీంతో ఫ్యుయల్ తక్కువగా లోడ్ అవుతుంది. అయితే స్క్రీన్‌పై మాత్రం పూర్తిగా నింపినట్టు నంబర్లు కనిపిస్తాయి.
 
సాధారణంగా వాహనాల్లోకి ఇంధనం నింపే డీజిల్, పెట్రోల్ పైపుల చివరి భాగం ఎక్కువ పొడవుగా ఉంటుంది. అయితే ఇందులోనూ ఓ ట్రిక్ ఉంది. మనం ఇంధనాన్ని నింపమని చెబితే చివరి సమయంలో పూర్తిగా నిండకుండానే ఒక్కోసారి ముందుగానే పైప్‌ను ట్యాంక్‌లో నుంచి తీసేస్తారు. అలా తీసిన సమయంలో కొంత ఇంధనం పైప్ ముందు భాగంలో అలాగే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ ఇంధనం కూడా మనకే దక్కాలి. కానీ మనం తీసుకోకుండానే దానికి కూడా డబ్బులు చెల్లిస్తాం.
 
ఇక పెట్రోల్ బంకుల్లో మనల్ని మోసం చేసే మరో ట్రిక్ ఇది. ఇంధనం నింపే వ్యక్తి మనతో మాటలు కలిపి మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాడు. దీంతో ఎంత ఇంధనం నిండింది సరిగ్గా చూసుకోం. అప్పుడు కూడా మనం మోసపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంకో ట్రిక్ విషయానికి వస్తే పైన చెప్పిన దానికి అదనమే అవుతుంది. అదేంటంటే ఉదాహరణకు మీరు వేయి రూపాయ‌ల ఇంధనం నింపమని అడిగితే సేల్స్ వ్యక్తులు రూ.200 వరకు నింపి ఎంత అని మళ్లీ మధ్యలో అడుగుతారు. అప్పుడు మీటర్‌ను 0 కు రీసెట్ చేయకుండా రూ.800తో క్లోజ్ చేస్తారు. దీంతో ముందు రూ.200, తరువాత రూ.800 అనుకుని మీరు రూ.1000 చెల్లిస్తారు. అప్పుడు రూ.200 మోసగింపబడతారు. ఇలాంటి మోసాలు కూడా పెట్రోల్ బంకుల్లో జరిగేందుకు అవకాశం ఉంది.
 
చివరిగా ఇంకో మోసం చేసే ట్రిక్ గురించి తెలుసుకోండి. ఇంధనం నింపమని మీరు అడిగితే ముందు సేల్స్ వ్యక్తి సరైన విధంగానే ఫ్యుయల్ నంబర్‌ను ఎంటర్ చేస్తాడు. ఉదాహరణకు రూ.500 కావాలనుకుంటే రూ.500.00 అని ఎంటర్ చేస్తాడు. అయితే మధ్యలో మాటల ద్వారా మీ దృష్టి మరల్చి ఆ రీడింగ్‌ను 500గా మారుస్తాడు. ఇక చివర్లో ఆ 500ని చూసి మీరు రూ.500 ఇస్తారు. కానీ అంతే మొత్తంలో ఇంధనం మీకు అందదు. ఎందుకంటే రూ.500.00 అని ఎంటర్ చేస్తే స్క్రీన్ అలాగే ఉంటుంది. కానీ 500 ఎంటర్ చేస్తే స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అంటే మోసం జరిగిందని గుర్తించాలి.

Monday, May 23, 2016

సబ్బులను కొనే ముందు వీటి గురుంచి ? తెలుసుకోండి !

ప్రతి రోజు మనం తప్పకుండా చేసే పని స్నానం ఒకటి, స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే, శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలి,అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి, సాధారణంగా ఎక్కువ మంది స్నానం చేయడానికి వివిధ రకాల సబ్బులని ఉపయోగిస్తారు, చాల మంది సబ్బులని టీవీలలో వచ్చే యాడ్స్ చూసి మరియు సబ్బుల నుండి వచ్చే సువాసనను చూసి కొంటారు, కాని మార్కెట్ లో ఉండే సబ్బులలో 70% సబ్బులు మన శరీరానికి హాని చేసేవే, కేవలం లాభాల కోసం మాత్రమే మా సబ్బులో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని ఇంకా ఆఫర్స్ కూడా ఇస్తాయి, సబ్బుల యొక్క నాణ్యతని నిర్ణయించడానికి టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది.  • మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? ఆ అదే! ఇప్పుడదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.
  • అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం.
  • భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.
76 అంతకు మించి శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు.

  •  గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది.

  • గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి.                           

Saturday, May 21, 2016

వీడెవడండీబాబూ?అతను చేసిన పనిచూసి యావత్ ప్రపంచం నోరెళ్ళబెట్టింది.

ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. పైగా.. ఇలా పోస్ట్ చేసి.. నలుగురికి తెలిసేలా చేయడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఇంట్లో శుభకార్యం జరిగినా, ఆఖరికి దుఃఖం జరిగినా వారి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'పుర్రెకో బుద్ధి.. జిహ్వ‌కో రుచి' అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఓ వ్యక్తి పోస్ట్‌ చేసిన వీడియోని చూసి యావత్ ప్రపంచం నోరెళ్ళబెట్టింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే అమెరికాలో నివసించే పకమలో కిహే ఎకి అనే వ్యక్తి తన భార్య ప్రసవం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్ బుక్‌లో లైవ్ షో ఇచ్చి తన స్నేహితులకి చూపించి మురిసిపోయాడు. తన భార్య ప్రసవనొప్పులు పడుతున్న దగ్గర్నుండి ప్రసవం అయ్యే వరకు లైవ్ షో రన్ చేశాడు. మొత్తం 45 నిమిషాల పాటు ప్రసారం చేశాడు. లైవ్ షో చూసిన అతని ఫ్రెండ్స్, కుటుంబీకులు అతని భార్యకు ధైర్యం చెబుతూ కామెంట్స్, లైక్స్ చేశారు. అయితే, కొంతమంది మాత్రం ఇదేం పబ్లిసిటీ రా బాబు అని మండిపడుతున్నారు. 

Friday, May 20, 2016

ఈ రోడ్లపై పడిన నీరు "క్షణం"లోనే మాయమవుతుంది!

ఏ దేశంలోనైనా రోడ్లు ఎలా ఉంటాయి? ఎలా ఉండడమేటి, విదేశాల్లో అయితే రోడ్లు చాలా బాగుంటాయి. అక్కడ రోడ్లపై గుంతలను వెతకాలి. కానీ మన దగ్గరైతే గుంతల్లో రోడ్లను వెతకాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు, నాయకుల అవినీతి, నాణ్యతా ప్రమాణాల లోపం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, క్వాలిటీ లేని మెటీరియల్ వాడడం… ఇలా ఎన్నో కారణాల మూలంగా మన దగ్గర వేస్తున్న రోడ్లు కేవలం కొద్ది రోజులకే గుంతలు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు వర్షం పడిందంటే చాలు ఇక ఆ గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతుంది. దీంతో అలాంటి దారిపై ప్రయాణించాలంటేనే జంకాల్సి వస్తుంది. అయితే ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్లు మాత్రం అదుర్స్ అనే రీతిలో ఉన్నాయి. ఎందుకంటే అవి అలాంటి ఇలాంటి రోడ్లు కావు. ఎన్ని వేల లీటర్ల నీటిని ఆ రోడ్లపై పోసినా కేవలం ఒకే నిమిషంలో ఆ నీరంతా రోడ్ల లోపలికి ఇంకి పోతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ!

permeable-concrete 

టార్మాక్ అనే పేరు గల సంస్థ టాప్‌మిక్స్ పెర్మియబుల్ కాంక్రీట్ అనే ఓ ప్రత్యేకమైన కాంక్రీట్‌ను తయారు చేసింది. దీంతో రోడ్డు వేస్తే చాలు, ఎంత నీరు ఆ రోడ్డుపై పడ్డా వెంటనే లోపలికి ఇంకిపోతుంది. అలా ఇంకిపోయిన నీటిని అవసరం అనుకుంటే ప్రత్యేక పైపుల ద్వారా దారి మళ్లించి నిల్వ చేసుకోవచ్చు. వాటిని శుద్ధి చేసి వినియోగించుకోవచ్చు. ఈ పెర్మియబుల్ కాంక్రీటు ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో పడిన 1 వేయి లీటర్ల నీటిని కేవలం 1 నిమిషంలోనే లోపలికి గ్రహిస్తుంది. ఇంకో విశేషమేమిటంటే ఈ తరహా రోడ్ల నిర్మాణానికి వ్యయం కూడా తక్కువే అవుతుందట. అయితే ఈ కాంక్రీట్‌తో నిర్మించిన రోడ్లపై గంటకు 50 కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువ వెళితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందట. ఎక్కువ బరువున్న వాహనాలకు ఈ రోడ్లు అనువుగా ఉండవట. త్వరలోనే ఈ ఇబ్బందులను కూడా అధిగమించి కాంక్రీట్‌ను మరింత దృఢంగా తయారు చేస్తామని చెబుతోంది టార్మాక్ సంస్థ. మన దేశంలో కూడా ఇలాంటి రోడ్లు వేస్తే ఎంతో బాగుంటుంది కదూ, అప్పుడు వర్షం పడినా ఎంచక్కా రోడ్లపై నిర్భయంగా వెళ్లవచ్చు.

ఈ వీడియో గాని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి . 
Wednesday, May 18, 2016

చిన్న కుర్రాడి ఐడియా ఖరీదు 200 కోట్లు!

సాధారణంగా వంద రూపాయలు సంపాదించాలంటే ఎంతో శ్రమించాలి. అదే ఎవరైనా ఉచితంగా డబ్బులిస్తానంటే ఎవరొద్దంటారు చెప్పండి. ఇక్కడ ఒక బుడ్డోడి ఐడియాకి ఏకంగా రూ.200 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ తాను ఐడియాని ఇవ్వనని.. తన ఐడియాతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తానని తేల్చిచెప్పేశాడు. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అమెరికాలో 14 ఏళ్ల టేలర్ రోసెంథాల్‌కు వచ్చిన ఓ చిన్న ఆలోచన.. వ్యాపార ప్రపంచాన్నే భ్రమింపజేసింది. ఇంతకీ ఈ బుడ్డోడి ఆలోచన ఏమిటంటే.. రకరకాల ఫస్ట్ ఎయిడ్ కిట్‌లతో కూడిన ఏటీఎం మెషీన్‌ను తయారు చేయడమే. శరీరానికి గాయాలైనా, వడదెబ్బకి పడిపోయినా, కాలిన గాయాలకు ఇలా రకారకాల రోగానికి కావలసిన ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను ఈ వెండింగ్ మెషీన్ అమ్ముతుంది.
 
సమస్యకు తగిన బటన్ ప్రెస్ చేస్తే చాలు అందుకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేస్తుంది. ఈ సరికొత్త ఆలోచన అతనికి ఎలా వచ్చిందో తెలుసా? బేస్ బాల్ పోటీలు జరుగుతున్నప్పుడు తోటి స్నేహితులు గాయపడితే, వారికిఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి తల్లిదండ్రులు మెడికల్ షాపులకు పరుగులు పెట్టడం చూసి అతడికి ఈ ఐడియా వచ్చింది. కాగా రెక్ మెడ్ పేరుతో ఓ స్టార్టప్ సంస్థను టేలర్ స్థాపించాడు.

దీంట్లో ఒక్కో మెషీన్ ధర రూ.35 లక్షలు. ప్రస్తుతం టేలర్ వద్ద 100 మెషీన్లకు ఆర్డర్లు ఉన్నాయట. ఆ ఐడియా తమకు ఇవ్వాలని అందుకుగాను 200 కోట్లు రూపాయలు ఇస్తామని ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయినా తన ఐడియాని ఎవరికీ ఇవ్వనని.. తన వ్యాపారాన్ని తానే ముందుకు తీసుకెళ్తానని ఈ బుడ్డోడు ఖరాఖండిగా చెబుతున్నాడు.
 
Tuesday, May 17, 2016

"బూతు ఎక్కువగా చూస్తే" భక్తి పెరుగుతుందట ?

బూతు (పోర్న్) చూస్తే భక్తి తత్వం పొంగి పొర్లుతుందట..ఎప్పుడూ వినని, ఊహలకైనా రాని ఈ షాకింగ్ న్యూస్ ని ఓ అమెరికన్ నిపుణుడు కనుక్కున్నాడు. ఆశ్చర్యంగా.. వారానికోసారి మాత్రమే పోర్న్ చూసేవాళ్ల కన్నా రెండు. లేదా అంతకన్నా ఎక్కువసార్లు చూసేవాళ్ళలో భక్తి భావనలు ఉప్పొంగుతాయని, ప్రార్థనలు చేయాలనే ఆలోచనలు ఉధృతమవుతాయని శామ్యూల్ పెర్రీ అనే పరిశోధకుడు అంటున్నాడు. తాము తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ తో వీళ్ళు ప్రేయర్స్ చేయడం మొదలుపెడతారని ఈయన తెలిపాడు. ఆరేళ్ళ కాలంలో ఈయన 1300 మందికి పైగా వ్యక్తుల నడవడికను పరీక్షించి ఈ విషయం తేల్చాడు.

 పోర్నోగ్రఫీ అన్నది..దీన్ని తక్కువసార్లు చూసేవారిమీద, అదే సమయంలో ఎక్కువ సార్లు చూసేవారిమీద ఎలాంటి ప్రభావం చూపుతుందని శామ్యూల్ అధ్యయనం చేశాడు. చాలా సార్లు చూసేవారు తాము చర్చీలకు, ఇతర ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటామని, ప్రేయర్లు చేస్తుంటామని తెలిపినట్టు ఆయన వివరించాడు. అంటే తామేదో తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ వారిలో కనుక్కున్నానని చెప్పాడు. ఆత్మన్యూనత వారిలో కనిపించిందని విశ్లేషించాడు. ఇది మనుషుల్లోని చిత్రమైన మనస్తత్వాన్ని ప్రతిబింబించిందని పేర్కొన్నాడు. అలాగే తక్కువసార్లు పోర్న్ చూసినవారు తమలో ఆత్మన్యూనతా భావం లేదని, ప్రార్థనా మందిరాలకు తక్కువగా వెళ్తుంటామని చెప్పారట.. తన పరిశోధనల సారాంశాన్ని ఆయన సెక్స్ రీసర్చ్ అనే మెడికల్ జర్నల్ లో వివరించాడు. 

Monday, May 16, 2016

మరీ ఇంత ఘోరమా ?

కార్మికుల కష్టంతో కోట్లకు పడగలెత్తే బడా కంపెనీలు.. వారి కనీస అవసరాల విషయంలో మాత్రం కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయి. అమెరికాలోని కొన్ని చికెన్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కార్మికులు టాయ్ లెట్ కి వెళ్తే.. ఎక్కడ ఉత్పత్తి తగ్గిపోతుందోనన్న అతితో కార్మికలను టాయ్ లెట్ కు వెళ్లడానికి కూడా నిరాకరిస్తున్నాయి. అభివృద్ది విషయంలో ప్రపంచ దేశాలన్ని కీర్తించే అమెరికాలో కార్మికులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం శోచనీయం. కనీస మానవ విలువలకు కూడా తిలోదకాలిస్తూ.. ఫక్తు వ్యాపార లావాదేవీల కోసం అమాయక కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాయి అమెరికాలోని చికెన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. చౌక ధరకే చికెన్ విక్రయాలు చేస్తూ ప్రపంచ మార్కెట్ లో అధిక ఎగుమతులు చేస్తున్న అమెరికా చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కనీస మానవత్వం పాటించకపోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. టాయ్ లెట్ కు అనుమతించకపోవడంతో చిన్న పిల్లల కోసం వాడే డైపర్స్ ద్వారా తమ టాయ్ లెట్ అవసరాలను తీర్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి కార్మికులు. ఇదిలా ఉంటే మరికొందరేమో.. ఎక్కడ టాయ్ లెట్ కు వెళ్లాల్సి వస్తోందేమోనన్న భయంతో మంచినీళ్లు తాగడం కూడా మానేశారట. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఆక్స్ ఫామ్ సంస్థ తన తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. కార్మికుల హక్కులను తుంగలో తొక్కి ఇలా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న చికెన్ ప్రాసెసింగ్ కంపెనీల పట్ల అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో.. లేదో..!

Friday, May 13, 2016

"కొరుకుడు" మసాజ్ గురించి విన్నారా ?

ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలామంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డెస్క్‌ జాబ్‌ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ఈ నొప్పులకు పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్ల వేసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్‌ ఉత్తమం అని చెప్పవచ్చు. మసాజ్‌ చేస్తే ఎటువంటి శారీరక నొప్పి అయినప్పటికీ తగ్గిపోతుంది. 
 
సమర్ధవంతమైన చికిత్సా ప్రక్రియగా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానాలలో కూడా వాడుతుంటారు. బాడీ మసాజ్ అంటే తెలియని వారుండరు. థాయ్ మసాజ్, ఆయిల్ మసాజ్ ఇలా మసాజ్‌లో చాలా రకాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా న్యూజెర్సీకి చెందిన డాట్ అనే మహిళ మసాజ్ థెరపిస్ట్ కొత్త మసాజ్ ని కనిపెట్టింది. అదే బైట్ మసాజ్. 
 
బైట్ అంటే కుక్కకాటు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈవిడ నోరుతూ కొరుకుతూ మసాజ్ చేయడం. నోటితో కొరుకుతూ ఈవిడ చేసే మసాజ్‌‌కు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఈమె 5 సంవత్సరాల వయసు నుంచే ఈ మసాజ్‌కు ఆజ్యం పోసిందట. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులు రిలాక్స్ కోసం ఈవిడ దగ్గరకొచ్చి మసాజ్ చేయించుకుని వెళుతుంటారట. ఎవడి పిచ్చివారికి ఆనందం అంటే ఇదేనేమో.
 Thursday, May 12, 2016

ఆ హోటల్‌లో "తిండిని వేస్ట్ చేస్తే ఫైన్" వేస్తారు ?ఇంటి దగ్గరేమో గానీ, బయట హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, ఆ మాట కొస్తే రోడ్డుపై ఏ బండి వైద్దెనా మీల్స్, చిరుతిండి ఇలా ఏది తిన్నా అందులో ఎంతో కొంత ఆహారాన్ని వృథా చేయడం మనకు పరిపాటే. అవసరం ఉన్నా, లేకున్నా ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేయడం, చట్నీ, కర్రీ వంటి వాటిని ఎక్కువగా తెప్పించుకుని, ఆపైన వాటిలో ఎంతో కొంత వదిలి పెట్టడం ఎక్కడైనా జరుగుతుండేదే. అయితే దీన్ని గురించి ఎవరూ ఆలోచించరు. ఎంతో విలువైన ఆహారం వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఈ క్రమంలో ముంబైలో ఉండే ఆ హోటల్ యాజమాన్యం ఇలాంటి ఆహారపు వృథాను అరికట్టేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

ముంబైలోని మాతుంగా అనే హోటల్ వారు ఆహారం వృథా చేసిన కస్టమర్లకు ఫైన్ వేస్తున్నారు. అయితే వారు అన్ని పదార్థాలపై మాత్రం ఫైన్ వేయడం లేదు. కేవలం సాంబార్, రసం వరకు మాత్రమే దీన్ని పరిమితం చేశారు. ఆ హోటల్‌లో ఎవరైనా కస్టమర్ సాంబార్ లేదా రసంను మిగిలిస్తే చాలు వారిపై రూ.13 జరిమానా పడుతుంది. బిల్‌తోపాటు ఆ రూ.13లను కూడా కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న పప్పులు, ఇతర ఆహార పదార్థాల ధరలను దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎవరూ వృథా చేయరాదని భావించే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ హోటల్ యజమానులు తెలుపుతున్నారు. అవును మరి, ఎంతో విలువైన ఆహారాన్ని వృథా చేస్తే ఆ మాత్రం ఫైన్ పడాల్సిందే! లేదంటే, అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ ఎక్కువ ఆర్డర్ ఇచ్చి ఫుడ్‌ను అనవసరంగా వేస్ట్ చేస్తారు కదా!

ఇంతకీ ఇలా ఫైన్ వేస్తే కస్టమర్లు ఊరుకుంటారా? అనేదే మీ ప్రశ్న కదూ! అయితే ఆ హోటల్ అనుసరిస్తున్న ఈ పద్ధతికి కస్టమర్లు మొదట్లో విసుక్కున్నారట! అయితే క్రమంగా వారు దానికి అలవాటు పడిపోయారట. ఈ క్రమంలో వీలైనంత వరకు తమకు సరిపడా ఆహారాన్నే ఆర్డర్ ఇచ్చి మరీ తింటున్నారు. నిజంగా ఐడియా అంటే అదీ! ఇదే ఐడియాను దేశంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్స్‌లో పాటిస్తే ఎంత బాగుంటుందో కదా! అప్పుడు ఇంకా ఎక్కువ ఆహారం వృథా కాకుండా చూడవచ్చు. అంతేకాదు పార్టీలు, డిన్నర్‌లకు కూడా దీన్ని వర్తింపజేస్తే సరి! ఆహారం దొరక్క అలమటిస్తున్న ఎంతో మందికి ఈ విధానం ద్వారా ఆహారాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.

Wednesday, May 11, 2016

భాష రాదని భయమా ? ఐతే ఈ టీష‌ర్ట్ ఉంటే ప్ర‌పంచం మొత్తం చుట్టేయవచ్చు !

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎవ‌రికైనా అక్క‌డి ప్ర‌జ‌ల భాష అర్థం కాదు. ఒక‌వేళ ఆ భాష ముందుగానే వచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ రాక‌పోతే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలో కొత్త ప్ర‌దేశంలో ఏం కావాల‌న్నా, ఏం చేయాల‌న్నా, ఎక్క‌డికి వెళ్లాల‌న్నా భాష కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆ భాష ఇబ్బంది త‌ప్పుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలా అంటే ఐకాన్ స్పీక్ టీ ష‌ర్ట్‌తో..!
అవును, ఐకాన్ స్పీక్ పేరిట ఇప్పుడు కొత్త‌రకం టీ ష‌ర్టులు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఇంతకీ వీటి వ‌ల్ల ఉప‌యోగం ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. స‌హ‌జంగా మ‌నం నిత్యం చేసే కొన్ని ప‌నుల‌తోపాటు కొత్త ప్రాంతానికి విహారానికై వెళ్లిన‌ప్పుడు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ట్యాక్సీలు, రూమ్‌లు, ఫుడ్ త‌దిత‌ర స‌మాచారం మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో భాష స‌మస్య వస్తుంటుంది. అయితే దీన్ని సుల‌భంగా ప‌రిష్క‌రించాల‌నే ఉద్దేశంతోనే ఐకాన్ స్పీక్ టీ ష‌ర్టుల‌ను రూపొందించారు. ఈ టీష‌ర్టుల మీద ముందు భాగంలో పైన చెప్పిన ఆయా ప‌నుల‌ను సూచించే ప‌లు ఐకాన్లు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఫుడ్‌ని సూచించేందుకు ప్లేట్‌, ఫోర్క్‌, స్పూన్‌ను క‌లిగిన సింబ‌ల్‌, ప్ర‌యాణం కోసం కారు, విమానం, బైక్ సింబ‌ల్స్… అలాగ‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో విహారంలో ఉన్న‌ప్పుడు ఈ టీ ష‌ర్ట్‌ను ధ‌రిస్తే భాష స‌మ‌స్యను సుల‌భంగా ప‌రిష్క‌రించుకునేందుకు వీలుంటుంది. మ‌న‌కు ఏం కావాల‌న్నా ఎదుటి వ్య‌క్తులకు మన టీ ష‌ర్ట్‌పై ఉన్న సింబ‌ల్స్‌ను చూపిస్తే స‌రిపోతుంద‌న్న‌మాట‌. 
ఇంత‌కీ ఈ ఐకాన్ స్పీక్ టీ ష‌ర్ట్ ధ‌ర ఎంత‌నుకుంటున్నారు?  కేవ‌లం 33 యూఎస్ డాల‌ర్లు మాత్ర‌మే. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.2,100 అన్న‌మాట‌. ఈ టీష‌ర్ట్‌ను కొనాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. కావాల‌నుకునే వారు https://iconspeak.world/  సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Tuesday, May 10, 2016

ప్రపంచంలోనే మొదటి "సెక్స్ థీమ్ పార్క్‌"

సెక్స్ మూడు రానివారు బ్రెజిల్‍‌లోని సెక్స్ థీమ్ పార్క్‌కు వెళ్తే చాలంటున్నారు పరిశోధకులు. బ్రెజిల్ అనగానే సాధారణంగా అందమైన అమ్మాయిలతో పాటు సముద్ర తీరాలు, కార్నివాల్స్ గుర్తుకువస్తాయి. బికినీలతో బీచ్‌‌ల్లో బోలెడంతమంది అమ్మాయిలు కనిపిస్తారు. 
 
అయితే బ్రెజిల్‌లో ప్రపంచంలోనే మొదటి సెక్స్ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అంతా శృంగారాన్ని ప్రేరేపించే అంశాలుంటాయి. దీనికి ‘ఎరోటికా ల్యాండ్‌’ అని మరో పేరు కూడా ఉంది. ఈ పార్క్‌లోకి నన్‌లకు, పిల్లలకు ప్రవేశం లేదు. ఈ పార్క్‌ ప్రవేశ రుసుమును 100 డాలర్లుగా నిర్ణయించారు. 2018లో ఈ పార్క్ ప్రారంభం కానుంది.
 
ఇంకా ఇక్కడుంటే స్విమ్మింగ్ పూల్‌లో నగ్నంగా స్విమ్ చేయడంతో పాటు పార్కుల్లోనూ నగ్నంగా తిరగొచ్చు. అంతేకాదు.. ఈ పార్కులో ఉన్న రెస్టారెంట్లలో ఆహారం, పానీయాలు కూడా కామోద్రేకాన్ని కలిగించేవిగా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. అయితే బహిరంగ శృంగారం మాత్రం ఈ పార్కులో నిషిద్ధం. అందుకోసం ప్రత్యేకంగా రూమ్‌లు అద్దెకు లభిస్తాయి.

Monday, May 9, 2016

మే 9న (నేడే) "ఆకాశంలోఅరుదైన అద్భుత" సన్నివేశం !

మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అంతరిక్షంలో జరగబోయే ఓ అద్భుతం మీ కళ్ల ముందు ఆరోజు ఆవిష్కృతం కానుంది. 10 ఏళ్ల తర్వాత సూర్యుణ్ణి బుధ గ్రహం దాటివెళ్లే అరుదైన సన్నివేశం ఆకాశంలో చోటు చేసుకోనుంది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు చెన్నై బిల్లా ప్లానిటోరియంలో నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. అరుదైన సన్నివేశాన్ని మామాలు కళ్లతో చూడకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధగ్రహం సూర్యుడిని ముందు నుంచి దాటివెళ్లే సన్నివేశం మే 9వ తేదీ సాయంత్రం 4.15 నుం చి 6.20 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో బుధగ్రహ వ్యాసం సూర్యుడికన్న చిన్నదిగా ఉండడంతో ఈ అరుదైన సన్నివేశం చిన్న చుక్కవలే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు 7 గంటల పాటు ఈ అరుదైన సన్నివేశం భూమిపై నివసించే వారు వీక్షించొచ్చు. ఈ అరుదైన సంఘటనను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీక్షించవచ్చు. మరోవైపు ఈ అరుదైన సంఘటన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పెన్స్ లాంటి దేశాల ప్రజలకు వీక్షించే అవకాశం లేకుండా పోయింది.

అయితే మన దేశంలోని ప్రజలు సూర్యాస్తమయ సమయంలో ఈ సన్నివేశం చూడొచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో సూర్యోదయంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకోవడం వారికి కలిసొచ్చింది. అందుకే వారు ఈ అరుదైన సంఘటనను వీక్షించొచ్చు.
దేశంలో గత 1999 నవంబర్‌ 15వ తేదీ, 2003 మే 7వ తేదీ, 2006 నవంబర్‌ 8వ తేదీన ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మళ్లీ పదేళ్ల అనంతరం 9వ తేదీ చోటుచేసుకోనున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఒట్టికళ్లతో వీక్షించకూడదని, కళ్లకు అద్దాలు పెట్టుకొని చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒక శతాబ్దానికి 8 సార్లు మాత్రమే బుధగ్రహం సూర్యుణ్ణి దాటి వెళుతుందని, 2019 నవంబర్‌ 11వ తేదీ మళ్లీ ఇటువంటి సన్నివేశం చూడవచ్చని వారు తెలిపారు.
ఈ అరుదైన సంఘటనను ప్రజలు వీక్షించే విధంగా కెనడాలోని ఒట్టావా సెంటర్‌ ఆఫ్ ద రాయల్ ఆస్ట్రానోమికల్ సొసైటీ వారు ప్రత్యేకంగా టెలిస్కోపులను సిద్ధం చేశారు.

Saturday, May 7, 2016

"ఆచారం దెబ్బ"కు బెంబేలెత్తుతున్న కొత్త జంటలు !

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ వాసులకి కొన్ని విచిత్రమైన ఆచారాలుంటాయి. అలాంటి ఆచారమే స్వీడన్‌లోనూ ఉంది. దీనిగురించి తెలిస్తే ఖంగుతినాల్సిందే. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. స్వీడన్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలోని వధువైన, వరుడైన ఒంటరిగా కనిపిస్తే ఇతరులు వచ్చి వారితో అదరచుంబనం చేస్తారట. వరుడు ఒంటరిగా దొరికినా ఇదే తంతు. ఇక వధువు ఒంటరిగా దొరికినా ముద్దుల్లో వర్షాల్లో తడిసిముద్దయిపోవాల్సిందే. ఇది  కేవలం పెళ్లి రోజుకే పరిమితం. 
 
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు తమ ఎదురుగా ఇతరులు ముద్దు పెట్టుకుంటే అంగీకరించరట. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండరట. ఎక్కడ వదిలివెళ్తే తమ జంటను ముద్దు పెట్టుకుంటారోనని ఆ రోజు కనీసం బాత్రూంకి వెళ్లాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారట. ముద్దు పెట్టించుకునేటప్పుడు వద్దు, వద్దు, మొహం తిప్పుకోవడం లాంటివి చేయకూడదట, వారు ఎన్నిసార్లు, ఎన్ని ముద్దులు పెట్టిన పెట్టించుకోవాల్సిందేనట. సంప్రదాయం అంటే ఇదే మరి. 

Friday, May 6, 2016

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

“భూవోఘ్రాణ స్వయస్సంధి” అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్య భాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలి అని అర్ధం. ఈ ప్రదేశంలో ఇడ, పింగళ, సుషున్ను అనే ప్రధాన నాడులు కలుస్తాయి. ఇది ఆజ్ఞా చక్రం అని పిలువబడే పీయూష గ్రంధికి అనుబంధ స్థానం. దీనినే జ్ఞానగ్రంధి అని కూడా పిలుస్తారు. ఎవరైతే సుషున్ను నాడికి చురుకుదనం కల్గిస్తారో వారు మేథావులవుతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యూటరీ గ్రంధులపై ఉంటుంది. కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భ్రుకుటి స్థానాన్ని మానవ ధన(+),  మెడ వెనుక భాగాన్ని ఋణ(-) విద్యుత్ కేంద్రాలుగా పేర్కొన్నాడు. 

ఈ రెండు మానవ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణం చేస్తూంటాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులు నుదుటిపై చల్లని వస్త్రాన్ని వేయమంటారు. ఈ కీలకమైన సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమను ధరించాలి. సాయంత్రం - రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఓజస్సు వృద్ధి చెంది, చర్మ రోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది.
 
బొట్టు శరీరంలోని ఉష్ణాన్ని పీల్చివేస్తుంది. జఠర కోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. మనం సూర్యుడిని నేరుగా చూడలేము. అదే రంగుల కళ్ళద్దాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజు ద్వారా సూర్యుని చూడగలం. ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెందటం వల్ల కళ్ళకు హాని కలుగదు. అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్ళకు హాని కలుగకుండా రంగు ఏవిధంగా పని చేస్తుందో, ఆవిధంగానే బొట్టు కూడా భ్రుకుటి స్థానం లోని జ్ఞాననాడికి హాని కలుగకుండా మానవులను కాపాడుతూ ఉంటుంది.

Thursday, May 5, 2016

డార్క్ చాక్లెట్ తినండి ! మధుమేహాన్ని దూరం చేసుకోండి ?

రోజూ 100 గ్రాముల చాక్లెట్ తినండి.. మధుమేహాన్ని దూరం చేసుకోండి.. అంటున్నారు పరిశోధకులు. రోజుకు వంద గ్రాముల వరకు డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చునని లండన్‌లోని వార్విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చాక్లెట్‌లోని పదార్థాలు ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రిస్తుందని తద్వారా గుండెపోటు వంటి వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చును.

వార్విక్ వర్శిటీ నిర్వహించిన పరిశోధనలో 18-69 ఏళ్ల వయస్సు గల 1153 మందిపై జరిపిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. రోజూ వంద గ్రాముల చాక్లెట్ తినేవారిలో హృద్రోగ సమస్యలు, డయాబెటిస్ సమస్యలు చాలామటుకు తగ్గిందనేదే. చాక్లెట్ తయారీలో ఉపయోగించే కోకో పదార్థం మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధనలు తెలిపారు.
 
ఈ పరిశోధనలో 24.8 గ్రాముల చాక్లెట్ రోజువారీ తీసుకునే 80 శాతం మందిలో చురుకుదనం పెరిగిందని పరిశోధకులు చెప్పారు. అలాగే చాక్లెట్ రోజువారీ తీసుకునే పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ యాక్టివ్‌గా ఉన్నట్లు.. విద్యాభ్యాసంలో ముందున్నారని వారు చెప్పుకొచ్చారు.

Wednesday, May 4, 2016

సర్వరోగనివారిణి "మస్క్ మిలాన్" ( కర్బూజా ) !

నోరూరించే స్వీట్స్ తినాలంటే షుగర్.. వేడి వేడి సమోసాలు, బజ్జీలు ఆరగిద్దామంటే.. ఊబకాయం... స్పైసీ ఫుడ్ తినాలంటే.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్.. ఇలా ఆహారం విషయంలో చాలా నిబంధనలు వెంటాడుతున్నాయి. కాబట్టి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే.. సీజనల్ ఫ్రూట్స్ మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. ఎలాంటి ఫ్రూట్ తిన్నా.. ఏ సమస్య ఉండకపోగా, ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వేసవిలో అందరికీ తినాలనిపించే పండ్లు చాలా రకాలుంటాయి. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ చాలానే అందుబాటులో ఉంటాయి. వాటిలో వాటర్ మిలాన్ ( పుచ్చకాయ ), మస్క్ మిలాన్ ( కర్బూజా ) ముఖ్యమైనవి. ఈ రెండు ఫ్రూట్స్ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా... వేసవితాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలో కర్భూజా అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్.

వేసవిలో లభించే పండ్లలో కర్బూజ ఒకటి. రుచిలోనే కాదు.. పోషకాలలోనూ ఈ పండుకు సాటిలేదు. వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్భూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 92శాతం నీరే ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చు.
కర్బూజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ పండు అంటే.. చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది.
కర్బూజాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో పోషకవిలువలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ ‌ను బ్యాలెన్స్‌ చేస్తాయి.
ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు.
అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది కర్బూజా.
కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్‌ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.
కర్బూజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అజీర్తి, ఎగ్జిమా, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కర్బూజా చక్కటి పరిష్కారం.
కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే కర్బూజా విత్తనాల్లో కూడా పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.
కర్బూజ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి.
కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి.. ఎవరైనా.. నిర్మొహమాటంగా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
కర్బూజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
కర్బూజాలో అత్యంత ఎక్కువగా ఉండే విటమిన్ సి.. ఎలాంటి అల్సర్స్ నైనా నివారించడానికి సహాయపడుతుంది.
కర్బూజాలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కాన్స్టిపేషన్ నివారించవచ్చు.
మస్క్ మిలాన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నరాలు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల.. చాలా రిలాక్స్ గా నిద్రపడుతుంది.
కర్బూజా తొక్కలో ఉండే పోషకాలు పంటి నొప్పి నివారిస్తాయి. కాబట్టి నీటిలో కర్బూజా తొక్కను ఉడికించాలి. తర్వాత ఆ నీటితో మౌత్ వాష్ చేసుకుంటే.. పంటినొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Tuesday, May 3, 2016

హనుమంతుని కుమారుడెవరో తెలుసా ?

హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా... అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు.

హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజుడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు.రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది.మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు.ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా! రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గరలో, గుజరాత్‌లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం! ఇదీ మకరధ్వజుని వృత్తాంతం!

హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా... అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు.హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజురడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు.

రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది.

మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు.

ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా! రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గరలో, గుజరాత్‌లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం! ఇదీ మకరధ్వజుని వృత్తాంతం!
- See more at: http://www.teluguone.com/devotional/content/makardhwajudu-57-35582.html#sthash.OGlIaMP5.dpuf
హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా... అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు.

హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజురడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు.