CSS Drop Down Menu

Wednesday, April 27, 2016

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడే పిల్లల్లో "మెల్లకన్ను" వస్తుందా ?

ఏదైనా అతిగా చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. కానీ సైంటిఫిక్‌గా రుజువుచేశారు పరిశోధకులు. స్మార్ట్‌ఫోన్ అతిగా వాడే ఐదేళ్లలోపు పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియాలోని చొన్నామ్‌వర్సిటీ వైద్యుల బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో ఏకదాటిగా అరగంటపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తూ గడిపే పిల్లలకు మెల్లకన్ను వస్తున్నట్లు తేల్చేశారు. 

ఏడు నుంచి 16 ఏళ్ల వయసున్న 12 మందిపై ఈ పరిశోధన చేపట్టారు. రోజూ 4 నుంచి 8 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేలా ప్లాన్ చేశారు. స్మార్ట్‌ఫోన్- వాళ్ల కంటి చూపునకు మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరం వుంచారు. ఇలా చేస్తే.. రెండునెలల్లో 12 మందిలో 9 మందికి కళ్లలో తేడాలొచ్చినట్టు గుర్తించారు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి కనుపాపలు పైకి, కిందకు, పక్కకు మారే ప్రమాదం ఎక్కువట. స్మార్ట్‌ఫోన్‌ను 2 నెలలుగా వాడని 12 మందిలో 9 మంది పిల్లల చూపు బాగా మెరుగుపడింది. సో.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను 30 నిమిషాలకంటే కంటే ఎక్కువచూడొద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. 

0 comments:

Post a Comment