CSS Drop Down Menu

Friday, April 22, 2016

"తేలు విషం"తో సిగరెట్లు !

పాకిస్థాన్‌లో స్మోక్ లవర్స్‌కు పిచ్చి పీక్‌కు వెళ్లింది? ఇప్పుడు తాగుతున్న  సిగరెట్ కిక్  చాలక మరింత కిక్ కోసం కొత్తదారులు వెదుకుతున్నారట. గంజాయి, మార్ఫిన్, చరస్, ఓపియమ్ లాంటి మత్తు పదార్ధాలు కూర్చిన సిగరెట్ల కంటే తేలుకొండి విషంతో తయారు చేసిన సిగరెట్లకు పిచ్చి గిరాకీ ఏర్పడిందట. మీరు చదివింది నిజమే.. పొగాకుతోపాటు తేలుపొడిని కూడా కలిపి సిగరెట్లలో కూర్చిన సిగరెట్ తాగితే  కిక్కు నషాళానికెక్కి.. తు..చ ల్..మే ఆవూ.. అనిపిస్తుందట.

మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలతో తయారైన సిగరెట్లు తాగి తాగి బోరు కొట్టిన పాకిస్థానీ స్మోకర్ల బుర్రలో పుట్టిందీ తేలు సిగరెట్. మొదట తేళ్లను చంపి వాటిని ఎండబెట్టి బొగ్గుల మీద వాటిని కాల్చి పొడి చేసి ఆ పొడిని  సిగరెట్లలో కూరి తాగుతారు. పాకిస్థాన్ నార్త్ వెస్ట్రన్‌లోని ఫక్తున్హా  ప్రాంతం ఈ సిగరెట్లకు బాగా ఫేమస్. ఈ స్కార్పియన్ సిగరెట్లను ఇరవయ్యో ఏట నుంచి కాలుస్తున్న సోహబత్ అనే వ్యక్తి జలీల్ కబాబ్ హౌజ్‌లో ఒక వ్యక్తి దగ్గర ఒక్కో తేలును జస్ట్.. రూపాయి, రెండు రూపాయలకు కొనుగోలు చేసేవాడు. పెషావర్‌లో వేడి అధికంగా ఉండి తేళ్ళు విపరీతంగా దొరికే మటాని ఏరియా నుంచి తెచ్చి వీటిని సప్లై చేస్తున్నారట. తేలు తోక, కొండె భాగాల్లో ఉండే విషాన్ని ఒకసారి రుచి చూస్తే చాలు దానికి బానిసలై పోతారట. ఈ కొండి భాగాన్ని కొంతమంది హషిష్, పొగాకు మిశ్రమంతో కలిపి  సిగరెట్లు లేదా సన్నని గొట్టంలో కూర్చి పీల్చుతారు. ఈ కిక్కు సుమారు పదిగంటల పాటు ఉంటుందట. మొదటి ఆరు గంటలు శరీరం కొద్దిగా ఇబ్బందిపడినా మత్తుకు అలవాటు పడ్డ తరువాత అడ్జెస్ట్  ఐపోతుందట. కిక్కు సంగతేమో గానీ, ఈ స్కార్పియాన్ సిగరెట్లు తాగడం వల్ల మెదడు బాగా దెబ్బతింటుందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు. మామూలుగా దొరికే 1750 రకాల తేళ్ల జాతుల్లో 25 రకాల తేళ్ల విషం మనుషుల ప్రాణాలు తీస్తుందని చెబుతున్నారు. తేలు విషంతో కూడిన సిగరెట్లను తాగేవాళ్ళలో మెమొరీ లాస్ ఎక్కువని అంటున్నారు. భ్రాంతిలో మునిగిపోవడం లాంటి  రుగ్మతలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

0 comments:

Post a Comment