CSS Drop Down Menu

Friday, March 11, 2016

"ఐఫోన్‌" కోసం పాపని అమ్మిన వాళ్ళకు చివరికి ఏమయింది ?

వాళ్లదో దిగువ మధ్యతరగతి కుటుంబం. అరకొర ఆర్థికపరిస్థితులతో బతుకుబండిని లాక్కొస్తున్న భార్యాభర్తలకు ఐఫోన్‌ కొనుక్కోవాలన్న ఆశతో 18 రోజుల పసికందును ఆన్‌లైన్‌లో అమ్మేసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్స్‌కి చెందిన డ్వాన్‌- షోమెయ్‌ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. షోమెయ్‌ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంటే.. డ్వాన్‌ ఇంటర్నెట్‌  కేఫ్‌లలో చేస్తుంటాడు.

అయితే ఇల్లు గడవక పాప పోషణకు అవసరమైన వస్తువులు  కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు  లేదంటూ పసికందును ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. దీంతో ఆ పసిగుడ్డును ఒక యువతి 2,500 పౌండ్లకు కొనుగోలు చేసింది. ఆ డబ్బుతో ఒక ఐఫోన్‌, ఓ బైక్‌ కొనుక్కోవాలన్నది ఆ జంట ప్లాన్. పాపను కొన్న యవతి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జంటను వెతికి పట్టుకున్నారు. ఎందుకు అమ్మారన్న ప్రశ్నకు ఆర్ధిక స్థోమత లేని కారణంగా ఈ పని చేశామని ఆ జంట తమగోడు వెళ్లబోసుకుంది. చివరకు వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచగా షోమెయ్‌కి రెండున్నర ఏళ్ల పాటు సస్పె్న్షన్, డ్వాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది.

1 comment:

  1. అయ్యెర ఐఫోన్కొనుగో
    లయ్యెర ! అమ్మణి ధరణిన లబ్బరు బొమ్మ
    న్గయ్యర !అమ్ముడు బోయెన్!
    శయ్యన గ్రోలిన బిఱుసుర చట్టున బోయెన్ !

    జిలేబి

    ReplyDelete