CSS Drop Down Menu

Tuesday, March 1, 2016

అక్వేరియంలా.. మ్యాపేరియం!

అక్వేరియం విన్నాం కాని.. ఇదేంటి మ్యాపేరియం అనుకుంటున్నారా? పెద్ద అక్వేరియంలోపలికి మనం నడుచుకుంటూ వెళ్లి గాజు అద్దాల్లోంచి లోపలున్న చేపల్ని చూసి ఆనందిస్తాం కదా.. అదే ఫార్ములాని తీసుకుని ఈ మ్యాపేరియంని తయారు చేశారు. గ్లోబులా ఉన్న గదిలోకి మనం వెళితే అక్కడ అద్దాల్లోంచి ఖండాలు దేశాలూ కనిపిస్తాయి. పిల్లలు సరదాగా విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు వీలుగా ఈ మ్యాపేరియంని తయారు చేశారు. దాని విశేషాలివిగో..

మామూలుగా పుస్తంకంలో మ్యాప్‌ని చూసి పిల్లలు ఖండాల గురించి దేశాల గురించి తెలుసుకోవాలంటే కాస్త బోర్‌ ఫీలవుతారు. అలాంటి వాటి నుంచి బయటికి వచ్చి సరదాగా మ్యాప్‌పై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ మ్యాపేరియంని తయారు చేశారు. దీన్ని చూడాలంటే అమెరికాలోని బోస్టన్‌ వెళ్లాల్సిందే. అక్కడి మేరీ బేకర్‌ ఎడ్డీ లైబ్రరీలో దీన్ని నిర్మించారు. అదీ మూడంతస్థుల అద్దాల గదిలో..

1935లో దీన్ని నిర్మించడంతో అప్పటి దేశాల సరిహద్దులు, దేశాల పేర్ల ఆధారంగానే దీన్ని తయారు చేశారు. అయితే గాజు పలకలన్నింటినీ వేటికవి తీసుకుని మళ్లీ మార్చుకునేలా దీన్ని రూపొందించారు.వృత్తాకారంలో ఉన్న ఈ గదికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ గది మధ్యలోకి వెళ్లి ఎవరైనా మాట్లాడితే అది మామూలుగా కంటే చాలా గట్టిగా వినిపిస్తుంది. దీంతో పిల్లలకు ఇది సరదాను పంచే చోటుగా తయారైందని సిబ్బంది చెబుతున్నారు. 





0 comments:

Post a Comment