CSS Drop Down Menu

Thursday, March 31, 2016

ఫోన్ ఎత్తగానే "హాలో" అనడం ఎలా మొదలయ్యిందో తెలుసా?

 చదువుకున్నవారి నుంచి చదువు లేని వారి వరకు ప్రతి ఒక్కరు ఫోన్ అలా రింగ్ కాగానే… ఇలా హాలో అంటారు. ఇంగ్లీషు ముక్కరాకపోయిన హాలో మాత్రం బ్రహ్మాండంగా అంటారు. అసలు ఫోన్ రాగానే హాలో ఎందుకు అనాలి?. ఈ హాలో కున్న రహాస్యం ఏమిటో మీకు తెలుసా?

మరి ఫోన్ రాగానే…హాలోనే ఎందుకు అనాలి. వేరే అనవచ్చుగా…అంటే చాల మందికి సమాధానం తెలియదు. గట్టిగా అడిగితే అందరు అంటున్నారు మేము అంటున్నాము అంటారు తప్ప…ఎందుకు అనాలో  మాత్రం ఎవరు చెప్పరు.

ఫోన్ ఎత్తగానే అక్కడ ఉన్నది..ఎవరైనా ఇక్కడున్నవాళ్లు మాత్రం హాలో అంటారు కదా..దీని వెనకాల గమ్మత్తయిన విషయం దాగివుంది. అదేంటంటే హాలో అనేది ఒక అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? ఆమే మార్గారేట్ హాలో…ఈమె  ఎవరంటే …మన ఫోన్ పితామహుడు గ్రహంబెల్ ప్రేయసి పేరు. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టిన కొత్తలో మొదటిసారి ఫోన్ మాట్లాడినప్పుడు హాలో అని సంబోధించాడు. అదే ఇప్పడి వరకు నడుస్తూనే ఉంది. గ్రహాంబెల్ ఫోన్ ను కనిపెట్టినప్పటికి ఆ సమయంలో కూడా సొంత స్వార్ధానికి పోకుండా ప్రేయసి పేరు తలుచుకున్నాడు . అదీ గ్రహాంబెల్ ప్రేమంటే. 

Wednesday, March 30, 2016

"ఆవుల" కోసం "ఆలి"నే వద్దనుకున్నాడు !

 ఆవులంటే అతనికి ప్రాణం. వాటి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతలా అంటే కట్టున్న భార్యనే వదిలేసేంతలా. వివరాల్లోకి వెళితే... కాన్పూర్‌కి చెందిన ఆఫక్ అలీ అనే వ్యక్తికి ఆవులంటే ప్రాణం. ఆవుల కోసం కట్టుకున్న భార్యనే వదిలేశాడు. అఫల్ అలీ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో నివసిస్తున్నాడు. ఇతని దగ్గర 14 ఆవులు ఉన్నాయి. ఎల్లప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ, వాటితోనే గడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన భర్త ఎప్పుడూ ఆవులతో ఎక్కువ సమయం గడుపుతుండటాన్ని చూసిన అతని భార్యకు కోపం వచ్చింది. తాడోపేడో తేల్చుకుందామని నీకు నేను కావాలా, ఆవులు కావాలా? అని ఒక రోజు అఫక్ అలీని భార్య నిలదీసింది. అందుకు అఫక్‌ ఆవులే కావాలంటూ అందుకోసం తన కుటుంబాన్ని కూడా వదులుకున్నాడు. ఈ స్టోరీ 13 సంవత్సరాల క్రితం జరిగింది.

 అయితే ఇప్పుడు ఈ స్టోరీ బయటకు రావడానికి కారణం.. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఆవు మాంసంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆవు మాంసం తింటున్నారంటూ కొందరు ముస్లింలపై దాడులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో అఫల్ అలీ స్టోరీ తోటి ముస్లింలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. అఫక్‌ అలీ 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఆవుని కొనుక్కున్నాడు. అలా ఒకొక్కటిగా అవి పెరిగి 14కు చేరాయి. ఈ ఆవుల కోసం 2001లో తాను కట్టుకున్న భార్య ఆఫ్రాజ్ జహాన్‌ను వదిలేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అఫక్ అలీ వయసు 55. అయితే పరాయి స్త్రీపై వ్యామోహంతో కాకుండా ఆవులపై ప్రేమతో తన కుటుంబాన్ని వదిలేశానని అఫక్ చెబుతున్నాడు. అంతలా వాటిపై ప్రేమను పెంచుకున్నాడు. రోజూ ఉదయాన్నే వాటికోసం పచ్చిగడ్డిని పోగు చేసి అవి కడుపునిండా తినేదాకా వాటితోనే ఉంటాడు. వారం వారం వాటికి వైద్య పరీక్షలు చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గత 30 ఏళ్లుగా ఈ ఆవులను కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు తాను ఎంతో అదృష్టవంతుడినని చెప్పాడు. ఇందుకు గ్రామస్థులు కొందరు తనని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఆవుల కోసమే కుటుంబాన్ని వదిలేశానని తన బంధువులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారని చెప్పాడు. కొందరు ఆవులను మంచి ధరకు విక్రయించాలని అడిగినా అందుకు తన మనస్సు అంగీకరించదని తెలిపాడు. జంతు కార్యకర్త రాజీవ్ చౌహాన్ మాట్లాడుతూ అఫక్ మాకు ఓ ప్రేరణ అని చెప్పాడు.Thursday, March 24, 2016

త్వరలో మూత పడనున్న ఏటీఎంలు ?

క్రెడిట్ కార్డు లూ, డెబిట్ కార్డ్ లూ ఒచ్చిన తరవాత ఆన్లైన్ పేమెంట్ విధానం తో పాటు రకరకాల పేమెంట్ విధానాలు మన ముంగిట్లో వాలాయి. క్యాష్ కార్డ్ ల రూపం ఒచ్చిన తరవాత నగదు రూపం లో చెల్లింపులు చాలా తక్కువగా చేస్తున్నాం అందరం. నగదు రహిత సమాజం నెమ్మది నెమ్మదిగా రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే చాలా దేశాలలో ఈ విధంగా నగదు చెల్లింపు పూర్తిగా దూరం అయ్యింది.

  కొందరు విశ్లేషకులు కొన్ని దేశాల పరిశీలన చేసిన తరవాత కొన్నాళ్ళలో నోట్లూ, నాణాలూ కనపడవు అంటున్నారు. 100 శాతం నగదు రహిత దేశాలుగా మారడానికి కొన్ని దేశాలు చాలా ముందంజ లో ఉన్నాయి . వీధికొక ఏటీఎం ఉండగా అవన్నీ త్వరలో మూత పడతాయి అంటున్నారు. బెల్జియం లాంటి దేశం లో ప్రస్తుతం చెల్లింపులు నాన్ క్యాష్ లో 93% వరకూ సాగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎనభై ఆరు శాతం మందికి డెబిట్ కార్డు ఉంది. ఫ్రాన్స్ లో 92%  నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ లే జరుగుతున్నాయి. మూడు వేల యూరోలు దాటితే నగదు లో చెల్లించ కూడదు అని గట్టి చట్టాలు ఉన్నాయి. స్వీడన్ , ఆస్ట్రేలియా , నెదర్ లాండ్స్ , అమెరికా , జర్మనే, దక్షణ కొరియా ఇలా చాలా చోట్ల నగదు లేని సమాజానికి వారు వెళుతున్నారు. 

Wednesday, March 23, 2016

గాంధీజీ తన భార్యను కొట్టారట ! ఎందుకో తెలుసా ?

సత్యం, అహింసా మార్గాల్లో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహాత్మా గాంధీ.. ఒకనొక సందర్భంలో తన భార్యపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రచయిత ప్రమోద్ కపూర్ తాను రాసిన తాజా పుస్తకం 'గాంధీ ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ'లో వెల్లడించారు. అంతేకాకుండా గాంధీ తన కుటుంబసభ్యుల పట్ల ఓ 'సర్కస్ రింగ్ మాస్టర్'లా వ్యవహరించారని, ఇదే విషయాన్ని ఆయన కుమారుడు హరిలాల్ గాంధీ తన తండ్రికి రాసిన 14 పేజీల లేఖలో తెలిపారని ప్రమోద్ కపూర్ పేర్కొన్నారు. తన సన్నిహితులు, దగ్గరి శిష్యులతో డిక్టేటర్‌గా వ్యవహరించేవారని కూడా తెలిపారు. దేశంలో ఖాదీ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లో విదేశీ వస్త్రాలను విసర్జించి ఖాదీ చీరలనే కట్టుకోవాలని దేశ ప్రజలతోపాటు కస్తూర్భా గాంధీని కూడా మహాత్మా గాంధీ ఆదేశించారట.
 
బరువైన ఖాదీ చీరను కట్టుకొని తాను ఇంట్లో పనులు చేసుకోనని, ముఖ్యంగా వంట చేయలేనని కస్తూర్భా మొరపెట్టుకున్నారట. ఆ మాటలకు కోపం వచ్చిన గాంధీ భార్యపై చేయి చేసుకున్నారట. అయితే వంట చేయకని, విదేశీ వస్త్రం ధరించి వంట చేస్తే తాను తినని కూడా గాంధీ భీష్మించుకు కూర్చున్నారట. అప్పుడు భార్య కళ్ల నుంచి మౌనంగా కారిన కన్నీళ్లను చూసిన గాంధీకి అహింస గొప్పదనం గురించి తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసిందట. ఖాదీ ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోని వారిపట్ల మహాత్మాగాంధీ కోపంగా ప్రవర్తించే వారట. కాగా , గాంధీ మాత్రం తన 98 సంకలనాల్లో గానీ, 'మై ఎక్స్‌పరమెంట్స్ విత్ ట్రుత్' పుస్తకంలోగానీ భార్యను చెంపదెబ్బ కొట్టిన అంశం లేకపోవడం గమనార్హం.


Tuesday, March 22, 2016

ప్రైవేట్ ప్లేస్‌లో ఎలా గడిపినా నేరం కాదని బాంబే హై కోర్టు చిత్రమైన తీర్పు !

ప్రైవేట్ ప్లేస్‌లో అసభ్యంగా వ్యవహరిస్తే అది నేరం కాదని బాంబే హై కోర్టు చిత్రమైన తీర్పునిచ్చింది. భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 294 ప్రకారం ఓ అపార్ట్ మెంట్‌లోనో లేదా ఓ వ్యక్తికి చెందిన స్థలంలోనో అసభ్యంగా ప్రవర్తిస్తే అది నేరం కిందకు రాదని న్యాయమూర్తులు ఎన్.హెచ్.పాటిల్, ఎ.ఎం.బాదర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ముంబై అంధేరీలోని ఓ ఫ్లాట్‌లో 13 మంది వ్యక్తులు కొందరు అమ్మాయిలతో కలిసి మద్యం తాగుతూ చిందులు వేస్తున్నారని ఓ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ మీద దాడి చేసి వారిపై కేసు పెట్టి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు తమ లాయర్ ద్వారా దీనిపై కోర్టుకెక్కారు. ఈ అపార్ట్‌మెంట్ పబ్లిక్ ప్లేస్ కాదని, ప్రైవేట్ ప్లేస్ అని, ఇలాంటి చోట ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చని ఆ లాయర్ వాదించాడు. ఈ వాదనను కోర్టు సమర్థిస్తూ కేసును కొట్టివేసింది.

Monday, March 21, 2016

సెక్స్ రాకెట్ కేసులో పోలీసులకు పట్టుబడిన సీనియర్ నటి !

సీనియర్ నటి సుకన్య సెక్స్ రాకెట్ కేసులో పోలీసులకు పట్టుబడింది. ఇటీవల చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఈమె వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 44 ఏళ్ళ సుకన్య గతంలోనూ ఇలాంటి కేసులోనే పట్టుబడింది. విలాస జీవితానికి అలవాటు పడిన ఈమె సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నా.. వచ్చే పారితోషికం చాలక.. ఇలా పక్కదార్లు పడుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన ఈమె మంచి గాయని, భరతనాట్య కళాకారిణి కూడా అని తెలుస్తోంది. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’లో అతని తల్లిగా సుకన్య యాక్ట్ చేసింది. బ్రోతల్ కేసులో మళ్ళీ ఈమె అరెస్టు కావడం ముఖ్యంగా దక్షినాది సినీ ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. ‘పెద్దరికం’, ‘భారతీయుడు’ లాంటి మూవీలు సుకన్యకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అయినా ఈ సీనియర్ నటి ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. గతంలో యమున, కిన్నెర, భువనేశ్వరి వంటివాళ్ళు కూడా సెక్స్ రాకెట్‌లో పట్టుబడినవారే.

Saturday, March 19, 2016

మంచు లక్ష్మిని మందలించిన మోహన్ బాబు ?

మోహన్ బాబుకు కోపం వస్తే ఎవరినైనా సరే కడిగేస్తారు. ఇటీవల తన కూతురు మంచు లక్ష్మికి కూడా మోహన్ బాబు ఓ విషయంలో చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ లక్ష్మీ చేసిన తప్పేంటంటే 'గుంటూరు టాకీస్‌'లో గెస్ట్ రోల్‌లో నటించడమే. గెస్ట్ రోల్ చేయడంలో తప్పు లేదు కానీ, ఆమె ఎంచుకున్న పాత్ర మోహన్ బాబుకు అస్సలు నచ్చలేదు. గతంలో 'చందమామ కథలు' మూవీ తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'గుంటూరు టాకీస్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఓ చిన్న పాత్ర కోసం లక్ష్మిని అడగటంతో కేవలం అతని కోసం గెస్ట్ రోల్ చేసింది. అది కూడా హీరో దగ్గర డబ్బులు కొట్టేసే సీన్‌లో నటించింది.

అసలు గుంటూరు టాకీస్ సినిమా మోహన్ బాబుకి  అస్సలు నచ్చలేదని సమాచారం. రష్మి అందాలు ఎరవేసి సినిమా ప్రమోషన్ నిర్వహించడంతో ఆయన దీన్ని బి గ్రేడ్ సినిమాగా తేల్చేసారట. అలాంటి సినిమాలో తన కూతురు మంచు లక్ష్మి డబ్బులు కొట్టేసే పాత్ర చేసిందని తెలిసి మోహన్ బాబుకు కోపం కట్టలు తెంచుకుందని అంటున్నారు. దీంతో మంచు లక్ష్మిని పిలిచి సుతి మెత్తగా చివాట్లు పెట్టినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుపై నమ్మకంతోనే గుంటూరు టాకీస్ లో గెస్ట్ రోల్ చేసానని, ఇకపై ఇలాంటి బిగ్రేడ్ సినిమాల్లో నటించనని తండ్రికి వివరణ ఇచ్చుకుందట మంచు లక్ష్మి.

Friday, March 18, 2016

చైనాలో కొత్త ట్రెండ్‌ ? A4 నడుము !

ఇప్పటివరకూ జీరో సైజు నడుముతో తిండీ తిప్పలు మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చూశాము. ఇప్పడు చైనాలో సరికొత్త పోకడ మొదలైంది. A4 నడుము పేరుతో కొందరు అమ్మాయిలు, అక్కడి సోషల్‌ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. సాధారణంగా మనం ప్రింట్ఔట్ల కోసం వాడే కాగితాన్ని A4 కాగితం అంటాము. దీని వెడల్పు 10 అంగుళాలకంటే తక్కువే ఉంటుంది. ఈ కాగితంతో సమానమైన నడుముని సాధించామంటూ, ఓ A4 కాగితాన్ని ముందుంచుకుని అక్కడి యువతులు తెగ ఫొటోలు దిగుతున్నారట. దిగడమే కాదు, మన ట్విట్టర్‌లాగానే చైనాలో ప్రజాదరణ పొందిన ‘సైనా వీబో’ అనే సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తమ ఘనతను చాటుకుంటున్నారట. చైనాలో రోజురోజుకీ వేలంవెర్రిగా పెరిగిపోతున్నా ఈ పోకడ చూసి అక్కడి పెద్దలు, వైద్యులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంత సన్నటి నడుము మున్ముందు తీవ్రమైన అనారోగ్య సమస్యలకి దారితీస్తుందనీ, ఒకోసారి ప్రాణాల మీదకే తెస్తుందనీ హెచ్చరిస్తున్నారు. అయినా పెద్దోళ్ల మాటని వినేదెవరు!


Thursday, March 17, 2016

" బ్రహ్మానందం ఫై కోట శ్రీనివాసరావు" సంచలన వాఖ్యలు !

విషయం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం కోట శ్రీనివాసరావు ఆనవాయితీ. ఆయన ఎవ్వరికీ భయపడడు. మనసులో ఏదుంటే అది నిర్భయంగా చెబుతాడు. అవతలివాళ్లు ఎలా స్పందించినా ఫర్వాలేదంటాడు. కోటలోని ఆ లక్షణాన్ని చాలా మంది మెచ్చుకుంటుంటారు కూడా. నాపైనే కామెంట్ చేశాడేంటి అని అప్పటికప్పుడు ఎవరైనా ఫీల్ అయినా ఆ తర్వాత ఆయన కామెంట్లలో వాస్తవాన్ని గ్రహించి మళ్లీ కోటకి దగ్గరవుతుంటారు. అలాంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోట శ్రీనివాసరావు  బ్రహ్మీ యాక్టింగ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఆరేళ్లుగా ఒకే పాత్రమీద బతుకుతున్నాడన్నారు. స్టార్ కమెడియన్ అనిపించుకొన్న బ్రహ్మీపై కోట ఈ తరహా వ్యాఖ్యలు  చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే మెజారిటీ జనం కోట మాట్లాడిన మాటల్లో వందశాతం నిజముందని చెబుతున్నారు. బ్రహ్మానందంలాంటి నటుడు కేవలం ఒకట్రెండు పాత్రలకి పరిమితం కాకూడదంటున్నారు. మరి బ్రహ్మీ స్పందనేంటన్నది ఇప్పుడు  చూడాలి.

కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పొందిన గొప్ప నటుడు. బ్రహ్మానందం కూడా పద్మశ్రీనే. అయితే బ్రహ్మానందం చేస్తున్న పాత్రలే కోటకి నచ్చడం లేదు. అందుకే ఓ ఇంటర్వ్యూలో సంచలనాత్మకమైన ఈ కామెంట్లు చేశాడు. ``బ్రహ్మానందం ఏమనుకున్నా ఫర్వాలేదు ఎన్నాళ్లా పాత్రలు చేస్తాడు?  ఆయన గొప్ప నటుడు. కానీ సరిగ్గా వాడుకోలేదు. బ్రహ్మీని హీరో కొట్టాలి జనాలు నవ్వాలి. అసలు అదేనా కామెడీ అంటే?`` అని ప్రశ్నించాడు ఓ ఇంటర్వ్యూలో కోట. మరి ఇందులోని నిజాన్ని బ్రహ్మీ గమనించాడా? ఇకనైనా ఆయన ఈ తరహా పాత్రలకి పుల్ స్టాప్ పెట్టేస్తాడా?  చూడాలి. 

Wednesday, March 16, 2016

"నాడు వైఎస్ చెప్పిందే నేడు నిజమైందన్న" మాజీ ప్రధాని మీడియా సలహాదారు!

కొందరి నేతల దూరదృష్టి ఎంత బాగుంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయం కలగక మానదు. తాజాగా అలాంటి ఒక సంచలన విషయాన్ని బయటకు వెల్లడించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు. తాజాగా  హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన.. ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు.

2009 ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమైన సందర్భంగా వైఎస్ తో పాటు తాను కూడా అక్కడే ఉన్నానని బారు చెప్పారు.  ఈ సందర్భంగా మన్మోహన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన అంశాన్ని తీసుకొచ్చారని.. ఎన్నికల్లో హామీ గురించి ప్రస్తావించినప్పుడు వైఎస్ స్పందిస్తూ.. అలా కానీ చేస్తే.. పార్టీకి నష్టం వాటిల్లటం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణరాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని.. దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని.. తెలంగాణలో కేసీఆర్ కు ఓట్లు వేస్తారే తప్పించి.. కాంగ్రెస్ కు ఓట్లు వేయరన్న విషయాన్ని వైఎస్ చెప్పినట్లుగా చెప్పారు. నేటి పరిస్థితుల్ని చూస్తే.. నాడు వైఎస్ చేసిన విశ్లేషణ నిజమన్న విషయం స్పష్టమైందని సంజయ్ బారు వెల్లడించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రం కానీ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమన్న విషయాన్ని అప్పుడెప్పుడో వైఎస్ గుర్తిస్తే.. సోనియా మాత్రం ఏ మాత్రం అంచనా లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చేసి పార్టీని బలి చేసిందన్న భావన కలగటం ఖాయం. చూస్తుంటే.. దేశాన్ని ఏలిక అమ్మకు.. వైఎస్ కంటే తక్కువ దూరదృష్టి అన్న విషయం సంజయ్ బారు మాటలు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది కదూ.

Tuesday, March 15, 2016

అనాధగా చనిపోవాలనుకొన్నవాడే నేడు "ముఖ్యమంత్రి" అయ్యారు !

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కలిఖో పుల్ జీవితం ఒక స్పూర్తి పాఠంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తన జీవితంలో పడని కష్టం లేదు. ఎదుర్కోని సమస్యా లేదు. ఆయన జీవితం అనాథగా మొదలైంది. ఆత్మహత్యతో అంతం కావాల్సిన ఆ జీవితం మలుపు తిరిగి ఆత్మవిశ్వాసంతో ఒక రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి పీఠం కూర్చుంది. విశేషమేంటంటే ఆయన పేరులోనే ఉంది ఆయన జీవిత సారాంశం. కలిఖో పుల్ అంటే మంచి భవిష్యత్ అని అర్థం కావడం గమనార్హం. అతని తల్లి ఎంత ప్రేమతో ఆయనకీ పేరు పెట్టారు. అయితే మంచి భవిష్యత్ కోసం.. దాదాపు సగం జీవితం ఆయన కష్టాలతోనే గడిపేశారు. పుల్ జీవిత గమనాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే.. పుల్‌ 13నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్‌. చుట్టుపక్కల వాళ్లెవరూ పట్టించుకోలేదు. చుట్టాలెవరూ దగ్గరకు తీయలేదు.
కాగా, ఎక్కడికెళ్లాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని పక్క ఊళ్లొ ఉండే అతడి అత్తయ్య తీసుకెళ్లింది. అదీ అతడి మీద ప్రేమతోనో, చదివించి పెద్ద చేయాలనో కాదు. ఇంట్లో పనులకు పనికొస్తాడని కావడం గమనార్హం. దీంతో ఆరేళ్ల వరకూ పుల్‌ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్‌ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తుంచేది పుల్ అత్తయ్య. దీంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరమైన పుల్.. అడవి చెట్ల మధ్యే పెరిగాడు.
 పదేళ్ల వయసొచ్చేసరికి పక్క ఊళ్లొని 'హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్‌ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా సొంతంగా జీవించడం మొదలుపెట్టాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్‌ కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్‌ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. పుల్‌ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్‌ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్‌ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్‌. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్‌ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు.


కాగా, ఓరోజు పుల్‌ చదువుకుంటున్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ కమిషనర్‌ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్‌ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్‌, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్‌ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశారు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాడు. అదే పుల్‌ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యా యత్నం తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దీంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టమ్మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం 5గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ, దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ, చివరికి ఆపరేషన్‌ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలూ, మరొకరు ఐదు రూపాయలూ చేతిలో పెట్టారు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ, చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు 40 నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు.


 జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్‌ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్‌ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రూ. 2,500 పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్‌.. తర్వాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్‌ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్‌ ఆరోగ్యం మెరుగు పడింది.
 పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. అదే విషయాన్ని తనకు పరిచయమున్న వాళ్లందరికీ చెబుతూ, ఏదైనా అవసరముంటే కబురుపెట్టమనేవాడు. అలా ఓ జూనియర్‌ ఇంజినీర్‌ ఇంటిచుట్టూ వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించే పని దొరికింది. మూడ్రోజుల పాటూ ఒక్కడే అడవికి వెళ్లి వెదురుని నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దానికి అతడికి రూ. 400 దక్కింది. ఆ తర్వాత 600రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది. ఇలా ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ చదువును కొనసాగించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్‌ నిద్రనీ.. వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్‌ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్‌ హ్యాండ్‌ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి ఎదిగాడు పుల్‌. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్‌ సెక్రటరీ బాధ్యతలతో పుల్‌ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్‌ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్‌ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తుండేవాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. 
 చిన్న వయసులోనే స్థానికంగా పుల్‌ సంపాదించిన పేరు కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడుకాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్‌. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు. ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 22ఏళ్లకే వరించిన మంత్రి పదవి తొలి ఎన్నికల్లో పుల్‌ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్‌ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్‌ రెండువేల ఐదొందలు గ్రాంట్‌ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్‌ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు పుల్‌ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్‌ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఇటీవలే తెరదించారు. ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చెప్పే పుల్.. కష్టమే దేవుడని అంటారు. తన జీవితమే ఇందుకు నిదర్శనమని చెప్తుంటారు పుల్. ఇక నుంచి 24గంటలపాటు ప్రజా సేవలోనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఒక మంచి ముఖ్యమంత్రి నాయకత్వంలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశిద్దాం.

Monday, March 14, 2016

"అండర్ వేర్" మాత్రమే వేసుకుని టీవీ చూస్తానంటున్నహీరోయిన్ ?

ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఎంజాయ్ చేయడం కోసం కొంత మంది చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. హీరోయిన్ ఇలియానాకు కూడా ఇలా ఎంజాయ్ చేసే అలవాటు ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒంటరిగా ఇంట్లో ఉండటం. మిడ్ నైట్ బట్టలిప్పేసి కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుని టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ నచ్చిన ఫ్రోగ్రామ్స్ చూడటం అంటే చాలా ఇష్టం.' అంటూ ట్వీట్ చేసింది.

Saturday, March 12, 2016

టైర్లతో కూడా ఇలాంటి బొమ్మలు చేయొచ్చా ?

పాత టైర్లతో "యాంగ్ హోజి" అనే కొరియన్ దేశస్తుని చేతిలో తయారైన ఈ బొమ్మలు అందరిని ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి . 


    

Friday, March 11, 2016

"ఐఫోన్‌" కోసం పాపని అమ్మిన వాళ్ళకు చివరికి ఏమయింది ?

వాళ్లదో దిగువ మధ్యతరగతి కుటుంబం. అరకొర ఆర్థికపరిస్థితులతో బతుకుబండిని లాక్కొస్తున్న భార్యాభర్తలకు ఐఫోన్‌ కొనుక్కోవాలన్న ఆశతో 18 రోజుల పసికందును ఆన్‌లైన్‌లో అమ్మేసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్స్‌కి చెందిన డ్వాన్‌- షోమెయ్‌ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. షోమెయ్‌ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంటే.. డ్వాన్‌ ఇంటర్నెట్‌  కేఫ్‌లలో చేస్తుంటాడు.

అయితే ఇల్లు గడవక పాప పోషణకు అవసరమైన వస్తువులు  కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు  లేదంటూ పసికందును ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. దీంతో ఆ పసిగుడ్డును ఒక యువతి 2,500 పౌండ్లకు కొనుగోలు చేసింది. ఆ డబ్బుతో ఒక ఐఫోన్‌, ఓ బైక్‌ కొనుక్కోవాలన్నది ఆ జంట ప్లాన్. పాపను కొన్న యవతి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జంటను వెతికి పట్టుకున్నారు. ఎందుకు అమ్మారన్న ప్రశ్నకు ఆర్ధిక స్థోమత లేని కారణంగా ఈ పని చేశామని ఆ జంట తమగోడు వెళ్లబోసుకుంది. చివరకు వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచగా షోమెయ్‌కి రెండున్నర ఏళ్ల పాటు సస్పె్న్షన్, డ్వాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది.

Thursday, March 10, 2016

ఈ చిత్రాలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !

Johannes Stoetter అనే ఆర్టిస్ట్ చేతులు మీదుగా  జాలువారిన ఈ అద్భుత కళాఖండాలు చూస్తే మైమరచి పోవాల్సిందే. ఈ చిత్రాలను జాగ్రతగా గమనించారా ? ఈ చిత్రాలు  మనుష్యుల పై వేసిన బాడీ పెయింటింగ్స్. ఇటువంటి అద్భుతాలను సృష్టించిన Johannes Stoetter కి హేట్సాఫ్  చెప్పాల్సిందే . 


Wednesday, March 9, 2016

తలకిందులుగా దర్శనమిచ్చే శివుడిని చూసారా?

శివుని రూపాలు ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఎక్కువగా లింగాకారంలో దర్శనమిచ్చే శివుడు ఒక ఆలయంలో మాత్రం తలకిందులుగా అంటే శీర్శాసనంలో దర్సనమిస్తాడు. అది ఎక్కడో కాదండి మన తెలుగు జిల్లాలోనే ఉంది. ఇలాంటి శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం భీమవరానికి దగ్గరలో ఉన్న ఎనమదురుకు వెళ్ళాల్సిందే. ఇక్కడి శివలింగం ఆకృతి తలకిందులుగా శీర్షాసనం వేసిన శివుని రూపంలా దర్శనమిస్తుంది. అంతే  కాదు పక్కనే పార్వతీదేవి ఒడిలో మూడు ఏళ్ళ పసివాడైన సుబ్రహ్మన్యుడిని పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఈ శక్తీస్వర ఆలయం ద్వారక ఆలయం కన్నా పురాతనమైనదని చెప్తారు. 


మహాకవి కాళిదాసు ఇక్కడ శక్తిని కొలిచాడని కుమారసంభవంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఇంకో  ప్రత్యేకత ఇక్కడి శక్తి గుండం. ఎంతో పవిత్రమైన ఈ గుండంలో నీటితోనే స్వామి వారికి నైవేద్యాలు తయారుచేస్తారట. స్వామి వారికీ ఈ గుండంలో నీరంటే ఎంతో ప్రీతి అని చెప్పటానికి నిదర్శనంగా ఒక కథ ప్రాచుర్యం పొందింది. ఒకసారి గుండం చుట్టూ ప్రాకారం నిర్మించటానికి గుండంలో నీరంతా తోడేసారట,ఆ సమయంలో పక్కనున్న వేరే చెరువు నుంచి నీళ్ళు తెచ్చి నైవేద్యం తయారు చేద్దామంటే ఎంత సేపటికి అన్నం ఉడకలేదట. అప్పుడు మళ్ళి శక్తి గుండంలోనే చిన్న గొయ్యి తీసి నీరు ఊరాకా ఆ నీటితో అన్నం వండితే వెంటనే ఉడికిందట. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారికి ప్రసాదాలు తయారుచేయటానికి ఈ గుండంలో నీటినే వాడుతున్నారని చెపుతున్నారు ఇక్కడి అర్చకులు.  

Tuesday, March 8, 2016

పవన్ అభిమానులకు "బ్యాడ్ న్యూస్"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చాలు తెర చిరిగిపోవడానికి. కలెక్షన్ల సునామీ బాక్సాఫీస్ పై దాడి చేయడానికి. యూత్ లో పవన్ కు ఉన్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదంటే ఆశ్చర్యం లేదేమో. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్న పవన్, ఆ తర్వాత మరి కొన్ని సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఇంకో రెండు మూడేళ్లలో పూర్తి చేసేసి, పూర్తి స్థాయిగా రాజకీయ నాయకుడిగా మారిపోతానంటున్నారు పవన్. అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే అయినా, సాక్షత్తూ పవన్ చెప్పిన మాట ఇది. ఫిల్మ్ కంపానియన్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున జర్నలిస్ట్ అనుపమ్ చోప్రా పవన్ ను ఇంటర్వ్యూ చేశారు.  తనకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయమంటే ఇష్టమని, అనుకోకుండా నటుడినయ్యానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్.

కేవలం తన ఉపాధి కోసం సినిమాలని, కానీ రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ప్రజల కోసమని, కొన్నేళ్లలో పూర్తిగా రాజకీయాలవైపు వెళ్తానని అన్నారు. బహుశా 2019 సార్వత్రిక ఎన్నికలలోపు, తన కమిట్ మెంట్స్ పూర్తి చేసుకుని, పూర్తి స్థాయి పార్టీగా జనసేనను తీర్చిదిద్దే అవకాశం ఉంది. పొలిటికల్ గా కంటే, పవర్ స్టార్ కు సినిమాలకే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి పవన్ నిర్ణయాన్ని అభిమానులు ఎంతవరకూ జీర్ణించుకుంటారో చూడాలి.

 

Monday, March 7, 2016

నందినీ రెడ్డి ని "తిట్టిన" అల్లు అర్జున్ ?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కి.. ఆ కుటుంబంలో ఉన్న ఇతర హీరోల మాదిరిగానే.. ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడనే గుర్తింపు ఉంది. ఎప్పుడూ అల్లరిగా కనిపించినా.. ప్రవర్తనలో మాత్రం బన్నీకి సాటి వచ్చేవారు ఎవరూ ఉండరంటారు. అలాంటిది బన్నీ తనని తిట్టాడని చెప్పింది దర్శకురాలు నందినీ రెడ్డి. ఈ డైరెక్టర్ తన తొలి మూవీ అలా మొదలైంది సూపర్ హిట్ సాధించడంతో.. అదే ఊపుతో రెండో సినిమా జబర్దస్త్ చేసింది. కానీ ఆ చిత్రం దారుణంగా ఫెయిల్ అయింది.

నందినీ రెడ్డిని తీవ్ర నిరాశకు కూడా గురిచేసింది. ఈ సమయంలో నందినీ రెడ్డికి అల్లు అర్జున్ నుంచి మొదటగా ఫోన్ వచ్చిందట. తనను కలవాల్సిందిగా చెప్పాడట అల్లు అర్జున్. 'తనని కలవమంటూ నాకు ఫోన్ చేసిన బన్నీ కేవలం ఒక్క ఫ్లాప్ తో నిరాశలో కూరుకుపోవడాన్ని వ్యతిరేకించాడు. కొత్తగా ఏమీ రాయకుండా సైలెంట్ గా ఉండడంతో తిట్టాడు కూడా. కొత్త స్టోరీలు రాయాలంటూ నాలో స్ఫూర్తి నింపిన బన్నీ.. నేను చెప్పిన ప్రతీ కథనీ వినివేడు. తన అభిప్రాయం చెబుతూ నన్ను ప్రోత్సహించాడు. నేను మానసికంగా రికవర్ కావడానికి బన్నీయే కారణం' అంటూ చెప్పిందీ డైరెక్టర్. 
 

Saturday, March 5, 2016

2000 రూపాయలు అప్పుచేసిన సల్మాన్? ఎందుకోతెలుసా ??

వందల కోట్లు ఆస్తులున్న సల్మాన్ ఖాన్ రెండువేల రూపాయలు లేవా? అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకొంచ్చింది? అని ఆలోచిస్తున్నారా….? వివరాల్లోకి వెళ్దాం. సల్మాన్ దగ్గర రెండు వేల రూపాయలు లేవు.  అందుకే తన బాడీ గార్డ్ దగ్గర అప్పు చేయాల్సి వచ్చిందట.సల్మాన్ స తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆలివ్ రెస్టారెంట్ కి ఎక్కువగా వెళ్తుంటాడు.

ఈమధ్యనే అలా ఓసారి వెళ్ళారు. సాయంత్రం 4.30 ప్రాంతంలో బయటకి వచ్చినప్పుడు రోడ్డుపై నలుగురు పేద పిల్లలు కనిపించారు. వారికి సాయం చేయాలనీ అనిపించిందట సల్మాన్ కు. తీరా జేబులో డబ్బులు లేవు, సల్మాన్ ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మాత్రమే వాడుతాడట. ఎవైన వాటితోనే కొంటూ ఉంటాడు. అందుకే జేబులో ఎక్కువగా డబ్బులు పెట్టుకొడట.

దాంతో ఆ పిల్లలకు ఎలాగైనా సాయం చేయాలనే ఆలోచనతో తన బాడీ గార్డ్ దగ్గర రెండు వేల రూపాయలు తీసుకున్నాడట. నలుగురు పిల్లలకి చెరో 500 ఇచ్చాడు. అలనాటి హీరో రిషి కపూర్ కూడా ఎక్కువగా ఆలివ్ రెస్టారెంట్ కి వస్తుంటాడు. అతను రెస్టారెంట్ బయట ఉన్న పేద పిల్లలకు డబ్బులు ఇస్తుంటాడు. ఒక్కోసారి వారి మంచి ఆహారాన్ని తినిపిస్తాడు.


Friday, March 4, 2016

"అరటిపండు"తో అద్భుతాలు !


Thursday, March 3, 2016

"10 రూపాయల"కే అద్దె బైకులు !

ఈ కాలం యువత అనుకున్నదే తడవుగా జరిగిపోవాలని చూస్తారు. లాభామో, నష్టమో ముందుకు నడవాలనేది వారి ఆలోచన. ఆలోచన నుండి పుట్టినదే రాయల్ బ్రదర్స్ సంస్థ. బైకు రైడింగ్ చేయాలనే అభిలాష అందరికీ ఉంటుంది. కాని ఊరి కాని ఊరిలో ఎవరిస్తారు చెప్పండి. అందుకే రాయల్ బ్రదర్స్ అనే ప్రముఖ ద్విచక్ర వాహనాల అద్దెకు ఇచ్చే సంస్థ ముందుకు వచ్చింది. కొత్త నగరాలకు వచ్చినపుడు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వీరి వెబ్ సైట్‌ను సందర్శించి నచ్చిన బైకును బుక్ చేసుకుని ఎంచక్కా రైడ్‌కు వెళ్లండి. రాయల్ బ్రదర్స్ సంస్థను ఎవరు స్థాపించారు, ఇక్కడే ఏయే బైకులు అద్దెకు ఇస్తారు అనే వివరాలను ఈ  క్రింద  చూడండి. 

బైకులను అద్దెకు ఇవ్వాలనే అలోచనతో వచ్చిన ఆవిష్కరణే ఈ రాయల్ బ్రదర్స్. దీనిని మంజునాథ్ టిఎమ్, అభిషేక్ సి శేఖర్, శ్రీ కృష్ట ఎన్ మరియు గిరీష్ కుమారు ఆర్ అనే నలుగురు యువకులు స్థాపించారు. 

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వీరు బెంగళూరు, గోవా, మంగళూరు, మణిపాల్, మైసూర్ మరియు ఉడుపి ప్రాంతాలలో తమ సేవలు అందిస్తున్నారు.

 రాయల్ బ్రదర్స్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్‌లోని అన్ని శ్రేణి బైకుల నుండి హోండా ఆక్టివా వంటి స్కూటర్ల వరకు అద్దె ఇస్తున్నారు.
 
రాయల్ ఎన్ఫీల్డ్‌లోని అన్ని మోడల్స్‌ను ప్రారంభ ధర రూ. 40 నుండి 50 వరకు ప్రతి గంటకు వసూలు చేస్తారు మరియు హోండా ఆక్టివా స్కూటర్ గంటకు అద్దె రూ. 10 లతో ప్రారంభం అవుతుంది.
 
రాయల్ బ్రదర్స్ నుండి మీకు నచ్చిన బైకు లేదా స్కూటర్‌ను గంటకు, రోజుకి, వారానికి మరియు నెల వరకు కూడా అద్దెకు తీసుకోవచ్చు. అయితే బాడుగకు తీసుకునే విధానాన్ని బట్టి అద్దె ధరను నిర్ణయిస్తారు.
 
అయితే పెట్రోల్ బిల్ వినియోగదారులకు చెందినది మరియు వీటితో పాటు హెల్మెట్‌కు రూ. 50, రూ. 500 వరకు రీఫండబుల్ డిపాసిట్ చేయాల్సి ఉంటుంది.
 
దక్షిణ భారత దేశంలో వ్యక్తిగత ద్విచక్రవాహనాల అద్దె కోసం ఆర్‌టిఓ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏకైక సంస్థ ఈ రాయల్ బ్రదర్స్
 
అయితే ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా ఇందులో ఉండవని తెలిపారు
 
వినియోగదారు రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ముందుగా బైకును అద్దెకు తీసుకోవాలి అనుకుంటే ముందు వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
 
రాయల్ బ్రదర్స్ వెబ్‌సైట్‌లో ముందుగా మీరు సైన్‌ఇన్ కావాల్సి ఉంటుంది. తరువాత పికప్ తేది, సమయాన్ని మరియు ద్రాపింగ్ తేది, సమయాన్ని నమోదు చేసిన తరువాత పికప్ ప్రాంతాన్ని ఎంట‌ర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
 
మీరు వీరికి చెందిన బైకును అద్దెకు తీసుకున్నట్లయితే 24/7 భద్రత కోసం ఎప్పుడూ మీతో అనుసంధానమై ఉంటారు.
 
ఇది పూర్తిగా అధికారికంగా నడపబడుతున్న సంస్థ మరియు ప్రభుత్వ నుండి పూర్తిగా అనుమతి తీసుకున్నట్లు వివరించారు.


Wednesday, March 2, 2016

Tuesday, March 1, 2016

అక్వేరియంలా.. మ్యాపేరియం!

అక్వేరియం విన్నాం కాని.. ఇదేంటి మ్యాపేరియం అనుకుంటున్నారా? పెద్ద అక్వేరియంలోపలికి మనం నడుచుకుంటూ వెళ్లి గాజు అద్దాల్లోంచి లోపలున్న చేపల్ని చూసి ఆనందిస్తాం కదా.. అదే ఫార్ములాని తీసుకుని ఈ మ్యాపేరియంని తయారు చేశారు. గ్లోబులా ఉన్న గదిలోకి మనం వెళితే అక్కడ అద్దాల్లోంచి ఖండాలు దేశాలూ కనిపిస్తాయి. పిల్లలు సరదాగా విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు వీలుగా ఈ మ్యాపేరియంని తయారు చేశారు. దాని విశేషాలివిగో..

మామూలుగా పుస్తంకంలో మ్యాప్‌ని చూసి పిల్లలు ఖండాల గురించి దేశాల గురించి తెలుసుకోవాలంటే కాస్త బోర్‌ ఫీలవుతారు. అలాంటి వాటి నుంచి బయటికి వచ్చి సరదాగా మ్యాప్‌పై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ మ్యాపేరియంని తయారు చేశారు. దీన్ని చూడాలంటే అమెరికాలోని బోస్టన్‌ వెళ్లాల్సిందే. అక్కడి మేరీ బేకర్‌ ఎడ్డీ లైబ్రరీలో దీన్ని నిర్మించారు. అదీ మూడంతస్థుల అద్దాల గదిలో..

1935లో దీన్ని నిర్మించడంతో అప్పటి దేశాల సరిహద్దులు, దేశాల పేర్ల ఆధారంగానే దీన్ని తయారు చేశారు. అయితే గాజు పలకలన్నింటినీ వేటికవి తీసుకుని మళ్లీ మార్చుకునేలా దీన్ని రూపొందించారు.వృత్తాకారంలో ఉన్న ఈ గదికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ గది మధ్యలోకి వెళ్లి ఎవరైనా మాట్లాడితే అది మామూలుగా కంటే చాలా గట్టిగా వినిపిస్తుంది. దీంతో పిల్లలకు ఇది సరదాను పంచే చోటుగా తయారైందని సిబ్బంది చెబుతున్నారు.