CSS Drop Down Menu

Monday, February 8, 2016

కాపురాన్ని కూల్చిన ఫేస్‌బుక్ !

నేడు ప్రపంచంలో ఫేస్‌బుక్ ఓ వైరస్‌లా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా వుండనివారు కోట్లలో వున్నారు. దూరంగా వున్నవారిని ఒకటి చేస్తే.. దీని కారణంగా విడిపోయినవాళ్లూ లేకపోలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్ కారణంగా ఓ జంట విడిపోయేందుకు సిద్ధమైంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా ఇష్టం. ఐతే, ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు.


 షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కపుల్ ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వేర్వేరు పేర్లతో కొనసాగుతున్నారు. అనుకోకుండా ఈ ఫేక్ ఐడీలతోవున్న ఈ జంట వాళ్లిద్దరికీ మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇద్దరు మ్యారేజ్ కాలేదని చెప్పుకున్నారు. మరింత దగ్గరయ్యారు. ఆర్నెళ్లు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చేశారు. మంచిరోజు చూసుకుని ఇద్దరూ మీట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. తీరా కలిసేసరికి అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆ భార్యాభర్తలిద్దరు ఇంత జరిగాక కలిసి జీవించలేమని ఓ నిర్ణయానికి వచ్చేశారు. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.  చూశారుగా ఇలాంటి ఫేక్ ఐడీలు కాపురాలను ఎలా కూల్చుతాయో.. తస్మాత్ జాగ్రత్త! 

0 comments:

Post a Comment