CSS Drop Down Menu

Sunday, February 7, 2016

"ఒక రూపాయి"తో దేశమంతా చుట్టేయవచ్చా?

భారీ ఖర్చుకు దిగకుండా ముంబైలో ఓ యువకుడు కేవలం ఒక రూపాయితో దేశమంతా చుట్టేందుకు పూనుకున్నాడు. ముంబైలోని జిగర్ నగడా అనే ఈ 27 ఏళ్ల యువకుడు తన కజిన్ రోనక్ జోషితోపాటు ఈ సాహసానికి దిగాడు. కేవలం రూపాయితో దేశమంతా చుట్టి రావాలన్నదే ఈయన ఆలోచన. ప్రయాణం ఖర్చులు తగ్గించుకోవాలన్నదే ఈయన ధ్యేయమట. ఫేస్ బుక్‌పై రూపాయి నాణెం ఫోటోను ముద్రించి.. నా ప్రయాణం ముంబై నుంచి ప్రారంభమైంది అంటూ పోస్ట్ చేశాడు.

వృత్తి రీత్యా ఫ్రీలాన్స్ సినీ అసిస్టెంట్ డైరెక్ట్ అయిన జిగర్, బుధవారం తెల్లవారు జామున ముంబైలోని వాసై ప్రాంతం నుంచి అహ్మదాబాద్‌కు శ్రీకారం చుట్టాడు. డబ్బుల్లేకుండా ఈ దేశంలో ప్రయాణించవచ్చా? అన్నది తెలుసుకోవడానికే తాను దీనికి పూనుకున్నానని అంటున్నాడు. మొదట వాసై నుంచి సూరత్ చేరుకున్నానని, అక్కడ రోడ్డుపక్కనున్న డాబాలో ఆహారం తీసుకుని తన ధ్యేయం గురించి చెప్పగా సిబ్బంది ప్రశంసించి డబ్బులేవీ తీసుకోలేదని తెలిపాడు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే తాను ప్రయాణిస్తానని వెల్లడించాడు. రాజస్థాన్‌లో ఆగకుండానే ఢిల్లీ చేరుకోవాలన్నది ఇతని ఆలోచనట. ఫోటోలు, చిన్నపాటి వీడియో క్లిప్పుల ద్వారా తాను ఎక్కడెక్కడ ప్రయాణం చేసిందీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయనున్నాడు.

1 comment:


  1. వారెవ్వా :) క్యా బాత్ హై !

    దేశం లో భిక్ష గాళ్ళు ఈ ట్రిక్ ఉపయోగిస్తే బాగుంటందంటా రా :) జేకే !


    మంచి టెక్నీక్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete