CSS Drop Down Menu

Sunday, February 21, 2016

"హనుమంతుడి"కి కోర్టు నోటీసులు !

బీహార్‌లో షాకింగ్! ఓ కోర్టు హనుమంతుడికి బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని భగవంతుడికి నోటీసులు జారీ చేసింది. 'గోపాల గోపాల' సినిమాలో దేవుడికి, భక్తులకు అనుసంధానంగా ఉన్న మతపెద్దలకు నోటీసులు జారీ చేస్తారు. అయితే, ఇక్కడ నిజంగా హనుమంతుడికి నోటీసులు జారీ చేశారు. విషయంలోకి వెళ్తే.. రోడ్డు పక్కన హనుమంతుడి గుడి ఉందని ఆ కట్టడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయంటూ ఓస్థానిక కోర్టు ఆంజనేయ స్వామికి నోటీసులు పంపింది.
బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో ఓ చోట పంచముఖ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడి కారణంగా ట్రాఫిక్‌ చిక్కులు ఎక్కువవుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్థానిక కోర్టులో కేసు పెట్టారు. ఈ విషయమై కోర్టులో హాజరుకావాలంటూ హనుమంతుడి విగ్రహానికి కోర్టు సిబ్బంది నోటీసులు అంటించారు. ఇది ఆంజనేయస్వామిని అవమానించడమేనని, వెంటనే నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ స్థానిక బజరంగ్‌ దళ్, బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.


0 comments:

Post a Comment