CSS Drop Down Menu

Friday, February 19, 2016

"పర్స్ ను వెనుక జేబు"లో పెడతారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి !

మనలో చాలామంది తక్కువ వయసులోనే నడుమునొప్పి/వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి?అని పరిశీలించగా మనం ధరించే ప్యాంట్ల వెనుక జేబులలో ఉంచుకునే మనీ పర్స్ మరియు ఇతర వస్తువులే కారణమని తేలింది. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలానే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.


చాలా మందిని  మనీ పర్స్ మరియు చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన, స్థాన భ్రంశం నుండి కదలని కారణంగా పొత్తికడుపు, వెన్నెముక మరియు నడుము నొప్పి సమస్యతో బాధపడవలసి వస్తోంది.  అలా ఒకేచోట మన పర్స్ లేదా వేరే వస్తువులను పెట్టుకొని కూర్చోవడం వలన సరిగ్గా కూర్చేలేం.  మన పిరుదులు రెండు సమానంగా ఉండకుండా ఈ వాలెట్ పెద్దదిగా ఉండటంతో ఒకవైపు ఎత్తుగా, మరోవైపు సన్నగా ఉంటుంది. దీని కారణంగా వెంటనే వెన్నెముకపై ఆ బరువు పడుతుంది. అందువలన నడుమునొప్పి, తొడ కండరాలు, నరాలు పట్టి లాగినట్లుగా వాటిపై ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది.




ఇప్పటివరకూ కేవలం తమ మనీపర్స్ లను వెనుక జేబుల్లో ఉంచుకునేవారు. మొబైల్స్,స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటినుండీ వాటిని  స్టైల్ గా వెనుక జేబులో పెట్టుకొని, ఒకవైపుగా కూర్చోవడం వలన ఇంకా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.


అందుకే చివరిగా చెప్పేదేమిటంటే.. ఇక నుండి మీ వెనుక జేబులో ఇలా మనీ పర్స్, సెల్ ఫోన్స్ మరియు చిన్న చిన్న వస్తువులు ఉంచుకోకుండా ఖాళీగా ఉంచండి. ఈ చిన్న టిప్ గనుక మీరు పాటించినట్లయితే ఇక ఎలాంటి నొప్పి లేకుండా సంతోషంగా ఉండవచ్చన్నమాట.

0 comments:

Post a Comment