CSS Drop Down Menu

Thursday, February 18, 2016

"ఉసిరిజ్యూస్" డయాబెటిస్‌కి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్!

ఉసిరికాయలు చూస్తేనే నోరూరిపోతుంది. పచ్చగా నిగనిగలాడే ఈ ఉసిరికాయ పుల్లపుల్లగా.. వగరుగా.. ఉంటుంది. ఈ ఉసిరికాయను ఎక్కువ జుట్టుకి ఉపయోగిస్తారు. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉసిరికాయతో.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చట. అలాగే కొలెస్ర్టాల్ లెవెల్స్ ను కూడా తగ్గించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి.


పుల్లగా, వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉసిరి జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని తాజాగా వెల్లడైంది. అంతేకాదు ఈ ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ర్టాల్ ని తగ్గించడంలో బేషుగ్గా పనిచేస్తుంది. మెడిసిన్స్ కంటే.. ఈ ఉసిరికాయలు చాలా పవర్ ఫుల్ గా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేశాయని స్టడీస్ చెబుతున్నాయి.
ఉసిరి జ్యూస్ తయారు చేయడం పెద్ద ప్రాసెస్ ఏమో అని ఫీలవకండి. ఇందులో బెన్ఫిట్స్ ఎన్ని ఉన్నాయో.. తయారు చేయడం కూడా అంతే సులభం. దీన్ని స్వీట్ గా తీసుకోవాలంటే తేనె, స్వీట్ ఇష్టపడని వాళ్లు బ్లాక్ సాల్ట్ చేర్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ముందుగా రెండు పెద్ద ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి కప్ నీటిని చేర్చి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత బ్లాక్ సాల్ట్ లేదా తేనె.. ఏది కావాలంటే అది కలుపుకుని తాగాలి. ఈ జ్యూస్ ని తరచుగా తీసుకుంటే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే కొలెస్ర్టాల్ ని కరిగించవచ్చు.
ఉసిరికాయలు అందుబాటులో లేని వాళ్లు ఉసిరికాయ పొడి అయినా తీసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఆమ్లా పౌడర్ తీసుకుంటే చాలు డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. అయితే ఈ డైట్ ని ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. కనీసం 20 రోజులు నిత్యం ఈ పౌడర్ తీసుకుంటే.. రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.

0 comments:

Post a Comment