CSS Drop Down Menu

Friday, February 12, 2016

వంటల్లో " కొబ్బరి నూనె"ను వాడితే ?

మామూలుగా అయితే నూనె మోతాదుకు మించి వాడితే శరీరానికి అంత మంచిది కాదని అంటుంటారు. ఏదైనా..ఎందులోనైనా ‘అతి’ కీడు చేస్తుంది. అలాగే వంటకాల్లో కూడా అధికంగా నూనెను వాడడంవల్ల కూడా బాడీలో కొవ్వు శాతం పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే కొబ్బరినూనెను వంటకాల్లో వాడడంవల్ల చాలా లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ నూనెతో శరీరానికి వయస్సు, ఎత్తుకు తగ్గ బరువును సమపాళ్ళలో వుంచుతుందట.

 సాధారణంగా మనం కొబ్బరి నూనెను తలకు పట్టించడానికి మాత్రమే వాడతాం. కానీ మన దేశంలో కేరళ రాష్ర్టంలో మాత్రమే కొబ్బరినూనెను వంటకాల్లో కూడా వాడే ట్రెడిషన్ వుంది. అందుకే వారంతా చాలా తెలివితో పాటు నాజూకుగా, పొడుగ్గా, ధృడంగా వుంటారు. ఈ నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల జీవక్రియలు వేగవంతంగా జరుగుతాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. మన శరీర బరువును తగ్గించడంలో కొబ్బరినూనె కీలక పాత్ర పోషిస్తుందట. ఈ నూనెతో తయారుచేసిన వంటకాలు త్వరగా జీర్ణమవుతాయి. శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడినుండి బయటపడేయడంలో కూడా కొబ్బరినూనె ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

 హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. యాంటీబ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్‌ లిపిడ్స్‌, క్యాప్పిక్‌, క్యాప్రిలిక్‌, లౌరిక్‌ ఆమ్లాలను కొబ్బరినూనె కలిగివుంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది. కాబట్టి షుగరు వ్యాధిగ్రస్థులకు ఇది చక్కగా పనిచేస్తుంది. గుండెకు హాని కలిగించే కొలెస్టరాల్‌ పెరగకుండా గుండెకు మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఈ నూనెలో ఉండేవి శాచ్యురేటెడ్‌ కొవ్వులు కావడం వల్ల ఎలాంటి హాని ఉండదు.

0 comments:

Post a Comment