CSS Drop Down Menu

Thursday, February 25, 2016

6 నెలల్లో 6 కోట్లు వెనకేసుకోవడం ఎలా?

ఏమీ చేయకుండానే...  జస్ట్ 6 నెలల్లో 6 కోట్లా? హౌ ఇటీజ్ పాజిబుల్? ఎలా సాధ్యం? కానీ, మనిషి తలచుకుంటే 6 నెలల్లో 6 కోట్లు సాధించడం కష్టమేమీకాదు... వీజీయేనట! ‘తని ఓరువన్’ మూవీలో విలన్ చెప్పినట్టుగా ఆలోచనే మీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టుగానే.. అది ఎలాగంటే.

ఇప్పుడు మేకిన్ ఇండియా స్లోగన్ క్యాంపెయిన్ పాపులర్ అయ్యింది. దీనికింద మరో మొబైల్‌ని లాంచ్ చేస్తున్నట్లు  ప్రకటించండి. అతి తక్కువ ధరకే మొబైల్ అందజేస్తున్నట్లు ప్రచారం చేయండి. ‘ఫ్రీడమ్ 251’ వంటి వినసొంపైన పేరుతో వచ్చేయండి. త్రీ జీ, హెచ్‌డీ స్ర్కీన్, డ్యూయల్ కెమెరాస్.. ఇంకా ఇలాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో వున్నాయని డబ్బా కొట్టండి. ఈ ప్రచారానికి డబ్బేమీ ఖర్చుపెట్టక్కర్లేదు. 

మార్కెటింగ్ కాస్ట్...(0)
వాల్డ్ మీడియో దృష్టికి వెళ్లండి.. పాపులర్ న్యూస్ పేపర్లు, వెబ్‌సైట్లు, బీబీసీ వంటి న్యూస్ ఛానెల్స్ వుండనే వున్నాయి. ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా కూడా సిద్ధంగా వుంది. వీటిపై దృష్టి పెట్టి మీ అతిచవకైన సాధనం గురించి ప్రచారం చేయండి. బోలెడు డబ్బు పెట్టి హ్యాండ్ సెట్ కొనే బదులు కేవలం 251 రూపాయలకే వచ్చేస్తుందంటే ఇండియన్స్ అంతా ఎగబడతారు మరి! 


ప్రాడక్ట్ లాంచ్‌కి డేట్ ఫిక్స్ చేయండి( రూ. 5 లక్షలు ఖర్చు చేస్తేచాలు)
మీ వస్తువు మార్కెట్‌లోకి తీసుకొచ్చే తేదీని నిర్ణయించుకోండి. మేకిన్ ఇండియా వంటి ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే ఈ డేట్ వుండాలి. దీనికి సంబంధించిన ఈవెంట్‌కు మీడియాను ఇన్వైట్ చేయనక్కర్లేదు. ఇన్విటేషన్ లేకుండానే మీడియా స్వయంగా మీ దగ్గరకొస్తుంది. చైనాలో తయారైన ఐదు చవక ఫోన్లు తీసుకుని వాటి మీద మీ కంపెనీ బ్రాండ్ స్టికర్ అంటించాలి. వీలైతే అందమైన మోడల్స్ చిత్రాలు కూడా వాటిపై వుండాలి. 

వెబ్‌సైట్ క్రియేట్ చేస్తే బెటర్ (ఖర్చు.. రూ. 7,500)
మీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇతర వివరాలతో సింపుల్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. (అయితే ఫ్రీడమ్ 251 సైట్‌లో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవీలేవు) మీరు ఓ ముఖ్యమైన అంశాన్ని స్పష్టంచేయాలి. ఏవైనా అనివార్య కారణాల వల్ల వచ్చే 6 నెలల్లో మేం మీకు ఫోన్ డెలివరీ చేయలేకపోతే.. మీ డబ్బు వాపసు చేస్తాం... అన్నదే!  

బుకింగ్‌ల కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి (కాస్ట్... 0)
ప్రతి డెలివరీకి రూ. 251 ప్లస్ 40 చొప్పున చెల్లించేలా 50 లక్షల మంది కస్టమర్లను ఆకర్షించాలి. అంటే మొత్తం రూ.145 కోట్ల సొమ్ము అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరునెలలపాటు బ్యాంకులో డిపాజిట్ చేయండి.. దీనికి ఈ కాలంలో 9శాతం వడ్డీ వస్తుంది. అంటే 6.5 కోట్ల.. వడ్డీ మీ ఖాతాలో పడుతుంది. ఆరునెలల తర్వాత కస్టమర్ల నుంచి వసూలు చేసిన రూ. 145 కోట్లు తిరిగి చెల్లించినా మీ జేబులో రూ.6.5 కోట్ల వడ్డీ చక్కగా మిగులుతుంది... దటీజ్ ఫ్రీడమ్!
 ఇది కేవలం సెటైరికల్ ఆర్టికల్ మాత్రమే!

0 comments:

Post a Comment