CSS Drop Down Menu

Monday, February 29, 2016

"అత్యంత పొడవైన" రైల్వే స్టేషన్ పేరు ?

ఇండియన్ రైల్వేలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు గల స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఉంది. దీని పేరు " వెంకట నరసింహరాజు వారి పేట " రైల్వే స్టేషన్. ఇది రేణిగుంట-అరక్కోణం మద్య కలదు.


Saturday, February 27, 2016

Friday, February 26, 2016

మేం వస్తే "చంద్రబాబును జైల్లో పెడతా"మన్న తమిళనేత ?

తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను జైలుకు పంపుతామని తమిళ పార్టీ ఎండిఎంకె పార్టీ అధినేత వైగో సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సోమవారం ఆ రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్‌ను ప్రస్తావించారు.
ఎర్రచందనం కూలీల పేరిట 20మంది అమాయక తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేసిందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును తాము అధికారంలోకి వస్తే తప్పకుండా జైలుకు పంపుతామన్నారు. కాగా, గత ఏడాది శేషాచలంలో ఎర్రచందనం దొంగతనం నేపథ్యంలో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన కూలీలు అందరూ కూడా దాదాపు తమిళనాడుకు చెందినవారే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.


Thursday, February 25, 2016

6 నెలల్లో 6 కోట్లు వెనకేసుకోవడం ఎలా?

ఏమీ చేయకుండానే...  జస్ట్ 6 నెలల్లో 6 కోట్లా? హౌ ఇటీజ్ పాజిబుల్? ఎలా సాధ్యం? కానీ, మనిషి తలచుకుంటే 6 నెలల్లో 6 కోట్లు సాధించడం కష్టమేమీకాదు... వీజీయేనట! ‘తని ఓరువన్’ మూవీలో విలన్ చెప్పినట్టుగా ఆలోచనే మీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టుగానే.. అది ఎలాగంటే.

ఇప్పుడు మేకిన్ ఇండియా స్లోగన్ క్యాంపెయిన్ పాపులర్ అయ్యింది. దీనికింద మరో మొబైల్‌ని లాంచ్ చేస్తున్నట్లు  ప్రకటించండి. అతి తక్కువ ధరకే మొబైల్ అందజేస్తున్నట్లు ప్రచారం చేయండి. ‘ఫ్రీడమ్ 251’ వంటి వినసొంపైన పేరుతో వచ్చేయండి. త్రీ జీ, హెచ్‌డీ స్ర్కీన్, డ్యూయల్ కెమెరాస్.. ఇంకా ఇలాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో వున్నాయని డబ్బా కొట్టండి. ఈ ప్రచారానికి డబ్బేమీ ఖర్చుపెట్టక్కర్లేదు. 

మార్కెటింగ్ కాస్ట్...(0)
వాల్డ్ మీడియో దృష్టికి వెళ్లండి.. పాపులర్ న్యూస్ పేపర్లు, వెబ్‌సైట్లు, బీబీసీ వంటి న్యూస్ ఛానెల్స్ వుండనే వున్నాయి. ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా కూడా సిద్ధంగా వుంది. వీటిపై దృష్టి పెట్టి మీ అతిచవకైన సాధనం గురించి ప్రచారం చేయండి. బోలెడు డబ్బు పెట్టి హ్యాండ్ సెట్ కొనే బదులు కేవలం 251 రూపాయలకే వచ్చేస్తుందంటే ఇండియన్స్ అంతా ఎగబడతారు మరి! 


ప్రాడక్ట్ లాంచ్‌కి డేట్ ఫిక్స్ చేయండి( రూ. 5 లక్షలు ఖర్చు చేస్తేచాలు)
మీ వస్తువు మార్కెట్‌లోకి తీసుకొచ్చే తేదీని నిర్ణయించుకోండి. మేకిన్ ఇండియా వంటి ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే ఈ డేట్ వుండాలి. దీనికి సంబంధించిన ఈవెంట్‌కు మీడియాను ఇన్వైట్ చేయనక్కర్లేదు. ఇన్విటేషన్ లేకుండానే మీడియా స్వయంగా మీ దగ్గరకొస్తుంది. చైనాలో తయారైన ఐదు చవక ఫోన్లు తీసుకుని వాటి మీద మీ కంపెనీ బ్రాండ్ స్టికర్ అంటించాలి. వీలైతే అందమైన మోడల్స్ చిత్రాలు కూడా వాటిపై వుండాలి. 

వెబ్‌సైట్ క్రియేట్ చేస్తే బెటర్ (ఖర్చు.. రూ. 7,500)
మీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇతర వివరాలతో సింపుల్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. (అయితే ఫ్రీడమ్ 251 సైట్‌లో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవీలేవు) మీరు ఓ ముఖ్యమైన అంశాన్ని స్పష్టంచేయాలి. ఏవైనా అనివార్య కారణాల వల్ల వచ్చే 6 నెలల్లో మేం మీకు ఫోన్ డెలివరీ చేయలేకపోతే.. మీ డబ్బు వాపసు చేస్తాం... అన్నదే!  

బుకింగ్‌ల కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి (కాస్ట్... 0)
ప్రతి డెలివరీకి రూ. 251 ప్లస్ 40 చొప్పున చెల్లించేలా 50 లక్షల మంది కస్టమర్లను ఆకర్షించాలి. అంటే మొత్తం రూ.145 కోట్ల సొమ్ము అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరునెలలపాటు బ్యాంకులో డిపాజిట్ చేయండి.. దీనికి ఈ కాలంలో 9శాతం వడ్డీ వస్తుంది. అంటే 6.5 కోట్ల.. వడ్డీ మీ ఖాతాలో పడుతుంది. ఆరునెలల తర్వాత కస్టమర్ల నుంచి వసూలు చేసిన రూ. 145 కోట్లు తిరిగి చెల్లించినా మీ జేబులో రూ.6.5 కోట్ల వడ్డీ చక్కగా మిగులుతుంది... దటీజ్ ఫ్రీడమ్!
 ఇది కేవలం సెటైరికల్ ఆర్టికల్ మాత్రమే!

Wednesday, February 24, 2016

"దోశను, చాక్లెట్లను, నూడుల్స్"ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?

దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కెరస్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను  భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

1. అలగర్ కోవిల్ దేవాలయం:- తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో  మహావిష్ణువుని పూజిస్తారు. దైవదర్శనం అనంతరం భక్తులకు ప్రసాదంగా దోశలను వడ్డిస్తారు.

2.కర్ణిమాత దేవాలయం:- రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు.
3. కమఖాయ టెంపుల్:- 51 శక్తిపీటాలలో గౌహతిలోని కమఖాయ దేవాలయం ఒకటి. ఇక్కడి భక్తులకు ప్రసాదంగా అమ్మవారి తడి గుడ్డను అందిస్తారు.

4. త్రిశూర్ మహదేవ ఆలయం:- కేరళలో గల త్రిశూర్ మహదేవ ఆలయం గోడలపై మహాభారతంలోని అక్షరాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ ప్రసాదంగా హిందూ మతానికి, ఆ ఆలయానికి  సంబంధించిన సీడీ డీవీడీలు, పుస్తకాలను ఇస్తారు.

5.బాలసుబ్రమణ్య టెంపుల్:- కేరళలో ఉన్నటువంటి సుబ్రమణ్య దేవాలయంలో దేవుడ్ని చాక్లెట్లతో పూజిస్తారు. పూజ తర్వాత చాక్లెట్లను ప్రసాదంగా అందిస్తారు.

6. చైనీస్ కాళి  ఆలయం:- కలకత్తాలో ఉన్న చైనీస్ కాళి ఆలయాన్ని చైనీస్ నిర్మించారు. ఈ ఆలయంలో అమ్మవారి పూజా అనంతరం నూడుల్స్,ఫ్రైడ్ రైస్, మరియు ఇతర చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ను ప్రసాదంగా పెడతారు.

7. కాలభైరవ ఆలయం:- మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భైరవ ఆలయంలో ఒక్క భైరవుడికి మాత్రమే మద్యంతో పూజలు చేస్తారు. ఇక్కడ భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా అందిస్తారు.

Tuesday, February 23, 2016

గాయకులు పాటపాడేటప్పుడు "చెవి"ని ఎందుకు మూసుకుంటారో తెలుసా?

 సాధారణంగా చాలా మంది గాయకులు పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే.. ఓ చేత్తో మైక్ ను, మరో చేతితో చెవిని మూసుకోవడం మనం చాలా సంధర్భాల్లో చూస్తుంటాం.!ముఖ్యంగా మెలొడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు పాట పాడడానికి, చెవిని మూయడానికి సంబంధమేంటి..? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద లాజికే ఉందట… దాని గురించి తెలియాలంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి.

తెలుగు భాషలోని అక్షరాలను నాదాత్మకాలు,
శ్వాసాత్మకాలు అని అంటారు. నాదాత్మకాలు అంటే నాభిలో పుట్టిన శబ్దం చాలా తక్కువ పరిమాణంలో గాలిని బయటికీ తీసుకురావడం, లేదా పూర్తిగా గాలిని బయటకు తీసుకురాకపోతే వాటిని నాదాత్మకాలు అంటారు. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ మొదలయిన అక్షరాలను పలికేప్పుడు గాలి ఎక్కువగా బయటకు రాదు. కాబట్టి ఇవి నాదాత్మకాలు.ఎక్కువ గాలితో బయటకు వచ్చే అక్షరాలను శ్వాసాత్మకాలంటారు. శ,ష,స,హా వీటిని పలికేప్పుడు చాలా ఫోర్స్ తో గాలి బయటకు విసర్జింపబడుతుంది.

అయితే తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే తెలుగులో ఉన్న అక్షరాల్లో ఎక్కువగా ఉన్నవి నాదాత్మకాలే..నాదాత్మకాలు ఎక్కువగా ఉన్న భాష ఎప్పుడూ మధురంగా ఉంటుంది. కాబట్టి పాట మరింత మధురంగా ఉండేందుకు గాయకులు శ్వాసాత్మక అక్షరాలను కూడా నాదాత్మాకాలుగా పలకడానికి ప్రయత్నిస్తాడు. దాని కోసం శరీరంలోని భాహ్య రంద్రాలను( చెవి) మూసే ప్రయత్నం చేస్తాడు. దాని కారణంగా గాలి నాదతంత్రువుల దగ్గర ప్రకంపిచబడి పాట అతి మధురంగా బయటకు వస్తుంది. అందుకే గాయకుడు చెవిని మూసేప్రయత్నం చేస్తాడు.

Monday, February 22, 2016

కడుపులో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ?? తెలుసుకోవడం ఎలా ?

తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. వర్ణించలేని ఆనందం.
అయితే పొట్టలో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అన్న క్యూరియాసిటి ప్రతి తల్లిలోనూ ఉంటుంది. చట్టప్రకారం కడుపులో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అని తెలపడం నేరం. అందుకే ఏ హాస్పిటల్స్ లోనూ ఈ విషయం చెప్పరు. అయితే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లేకుండా.. బేబీ గర్ల్స్ పుడుతుందో.. బేబీ బాయ్ పుడుతున్నాడో తెలుసుకోవడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి.

ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ :-
 ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో పెరుగుతున్నది బేబీ గర్ల్ లేదా బేబీ బాయ్ అన్నది తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అదే జెనెటిక్ టెస్ట్ ద్వారా అయితే బేబీ జెండర్ కరెక్ట్ గా తెలిసిపోతుంది.
 
బేబీ హార్ట్ రేట్ :-
 గర్భాశయంలో ఉన్న శిశువు అమ్మాయి అయితే హార్ట్ రేట్ ఒకలా.. అబ్బాయి అయితే ఒకలా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డా ? ఆడబిడ్డా ? అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. గర్భంలో బిడ్డకి నిమిషానికి 140 కంటే తక్కువ బీట్స్ ఉంటే బేబీ బాయ్ అని, అంతకంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ గా తేలింది.
 
చైనీస్ జెండర్ చార్ట్ :-
 దీన్ని సరిగ్గా క్యాల్కులేట్ చేసుకుంటే.. 90 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. 700 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చైనీస్ చార్ట్ గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని తెలుపుతుంది. కన్సీవ్ అయిన నెలను, తల్లి పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఈ చైనీస్ చార్ట్ ద్వారా మగబిడ్డా ? ఆడబిడ్డా ? అనేది తెలుసుకోవచ్చు.

వెడ్డింగ్ రింగ్ టెస్ట్ :-
 ఇది చాలా వింతగా అనిపిస్తుంది కదూ. వెడ్డింగ్ రింగ్ తీసి.. ఒక తాడుకు వేలాడదీయాలి. దీన్ని పొట్టపై వేలాడదీయాలి. ఈ రింగ్ పొట్టపై గుండ్రంగా తేలుతూ ఉంటే.. మగబిడ్డ అని, వెనక్కి, ముందుకూ కదులుతూ ఉంటే అమ్మాయి పుడుతుందని అర్థం.
 
ముక్కు :-
 ఇది ఆశ్చర్యంగా ఉందా ? నిజమే ముక్కుని బట్టి కూడా పుట్టబోయే బిడ్డ ఆడా ? మగా ? అని చెప్పవచ్చు. గర్భంతో ఉన్న మహిళ ముక్కు రూపం, సైజ్ లో మార్పులు కనిపించాయంటే మగబిడ్డ అని సూచిస్తుంది. నాసికా ద్వారాలు పెద్దవిగా, వెడల్పుగా తయారై ఉంటే అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక మార్పులే. బిడ్డ పుట్టిన తర్వాత అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి.
 
చర్మం :-
 మీరు గర్భిణీగా ఉన్నప్పుడు చర్మంపై యాక్నే, స్కిన్ పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుపుతుంది. అయితే ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే.. అబ్బాయి పుడతాడని అర్థం.
 
కాళ్లు :-
 పాదాల వాపులు ప్రెగ్నెన్సీ సమయంలో కామన్. అయితే గర్భం దాల్చిన మొదట్లో పాదాలపై వాపులు కనిపిస్తూ ఉంటే.. మీ పొట్టలో ఉన్నది అమ్మాయి. అదే ముందు నుంచి పాదాల వాపు సమస్య లేకుండా.. చివరి రోజుల్లో అంటే డెలివరీకి ముందు నుంచి పాదాల వాపులు కనిపిస్తూ ఉంటే.. మీ కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలుస్తుంది.
 
చేతులు :-
 గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని చేతుల చర్మం తెలుపుతుంది. తల్లి చేతుల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంది అంటే.. తన కడుపులో ఆడపిల్ల ఉందని, అదే చర్మం పొడిబారిపోయి, పగుళ్లు కనిపిస్తూ ఉంటే అబ్బాయి పెరుగుతున్నట్లు అర్థం.
 
శరీరం :-
 శరీరమంతా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిపేలా రూపంలో మార్పులు కనిపిస్తే.. ఆమె గర్భంలో ఉన్నది అమ్మాయి అని, అదే కొన్ని భాగాల్లో మాత్రమే గర్భవతిగా కనిపిస్తూ ఉంటే.. అబ్బాయి అని తెలుపుతుంది.
 
స్ర్టెచ్ మార్క్స్ :-
 ప్రెగ్నెన్సీ సమయంలో పొట్టపై స్ర్టెచ్ మార్క్స్ కామన్ గా కనిపిస్తాయి. అయితే వీటి ద్వారా కూడా గర్భంలో పెరుగుతున్నది మేల్ బేబీనా, ఫీమేల్ బేబీనా అని తెలుసుకోవచ్చు. ఎడమ చేతి వైపు పొట్టమీద ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని, అదే కుడివైపు ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ ఉంటే.. అమ్మాయి అని తెలుపుతుంది.
 
పొట్ట ఆకారం :-
 బేబీ ఆడా ? మగా ? అని పొట్ట ఆకారాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. పొట్ట పొడుచుకున్నట్లు ముందుకు సాగినట్టు ఉంటే.. గర్భంలో ఉన్నది అబ్బాయి అని, పొట్ట వెడల్పుగా ఉంటే గర్భంలో పెరుగుతున్నది అమ్మాయి అని తెలుపుతుంది.
 
పొట్ట:-
 గర్భధారణ సమయంలో పొట్ట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పైభాగంలో పొట్ట కనిపిస్తుంది. మరికొందరికి కింది భాగంలో పొట్ట కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి కూడా గర్భంలోని బిడ్డ జెండర్ తెలుసుకోవచ్చు. పై పొట్ట ఉంటే అబ్బాయి అని, కిందివైపుగా పొట్ట ఉంటే.. అమ్మాయిని సూచిస్తుంది.
 
వాజినల్ డిస్చార్జ్ :-
 ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది మగబిడ్డ. అదే చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో అప్పుడప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని అర్థం.Sunday, February 21, 2016

"హనుమంతుడి"కి కోర్టు నోటీసులు !

బీహార్‌లో షాకింగ్! ఓ కోర్టు హనుమంతుడికి బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని భగవంతుడికి నోటీసులు జారీ చేసింది. 'గోపాల గోపాల' సినిమాలో దేవుడికి, భక్తులకు అనుసంధానంగా ఉన్న మతపెద్దలకు నోటీసులు జారీ చేస్తారు. అయితే, ఇక్కడ నిజంగా హనుమంతుడికి నోటీసులు జారీ చేశారు. విషయంలోకి వెళ్తే.. రోడ్డు పక్కన హనుమంతుడి గుడి ఉందని ఆ కట్టడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయంటూ ఓస్థానిక కోర్టు ఆంజనేయ స్వామికి నోటీసులు పంపింది.
బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో ఓ చోట పంచముఖ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడి కారణంగా ట్రాఫిక్‌ చిక్కులు ఎక్కువవుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్థానిక కోర్టులో కేసు పెట్టారు. ఈ విషయమై కోర్టులో హాజరుకావాలంటూ హనుమంతుడి విగ్రహానికి కోర్టు సిబ్బంది నోటీసులు అంటించారు. ఇది ఆంజనేయస్వామిని అవమానించడమేనని, వెంటనే నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ స్థానిక బజరంగ్‌ దళ్, బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.


Saturday, February 20, 2016

"కదిలే" శివలింగాన్ని చూసారా?

శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి ఇక్కడి కోవెలలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు. మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.

మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుంది.  అలా  ఒక గంటసేపు కదలచ్చు,లేదా ఐదు గంటలు కదలచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని  చెపుతుంటారు ఇక్కడి అర్చకులు.  అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా  ఒక్క అంగుళం కూడా కదలదట. ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నాదో  తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.

చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో.

  

Friday, February 19, 2016

"పర్స్ ను వెనుక జేబు"లో పెడతారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి !

మనలో చాలామంది తక్కువ వయసులోనే నడుమునొప్పి/వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి?అని పరిశీలించగా మనం ధరించే ప్యాంట్ల వెనుక జేబులలో ఉంచుకునే మనీ పర్స్ మరియు ఇతర వస్తువులే కారణమని తేలింది. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలానే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.


చాలా మందిని  మనీ పర్స్ మరియు చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన, స్థాన భ్రంశం నుండి కదలని కారణంగా పొత్తికడుపు, వెన్నెముక మరియు నడుము నొప్పి సమస్యతో బాధపడవలసి వస్తోంది.  అలా ఒకేచోట మన పర్స్ లేదా వేరే వస్తువులను పెట్టుకొని కూర్చోవడం వలన సరిగ్గా కూర్చేలేం.  మన పిరుదులు రెండు సమానంగా ఉండకుండా ఈ వాలెట్ పెద్దదిగా ఉండటంతో ఒకవైపు ఎత్తుగా, మరోవైపు సన్నగా ఉంటుంది. దీని కారణంగా వెంటనే వెన్నెముకపై ఆ బరువు పడుతుంది. అందువలన నడుమునొప్పి, తొడ కండరాలు, నరాలు పట్టి లాగినట్లుగా వాటిపై ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది.
ఇప్పటివరకూ కేవలం తమ మనీపర్స్ లను వెనుక జేబుల్లో ఉంచుకునేవారు. మొబైల్స్,స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటినుండీ వాటిని  స్టైల్ గా వెనుక జేబులో పెట్టుకొని, ఒకవైపుగా కూర్చోవడం వలన ఇంకా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.


అందుకే చివరిగా చెప్పేదేమిటంటే.. ఇక నుండి మీ వెనుక జేబులో ఇలా మనీ పర్స్, సెల్ ఫోన్స్ మరియు చిన్న చిన్న వస్తువులు ఉంచుకోకుండా ఖాళీగా ఉంచండి. ఈ చిన్న టిప్ గనుక మీరు పాటించినట్లయితే ఇక ఎలాంటి నొప్పి లేకుండా సంతోషంగా ఉండవచ్చన్నమాట.

Thursday, February 18, 2016

"ఉసిరిజ్యూస్" డయాబెటిస్‌కి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్!

ఉసిరికాయలు చూస్తేనే నోరూరిపోతుంది. పచ్చగా నిగనిగలాడే ఈ ఉసిరికాయ పుల్లపుల్లగా.. వగరుగా.. ఉంటుంది. ఈ ఉసిరికాయను ఎక్కువ జుట్టుకి ఉపయోగిస్తారు. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉసిరికాయతో.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చట. అలాగే కొలెస్ర్టాల్ లెవెల్స్ ను కూడా తగ్గించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి.


పుల్లగా, వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉసిరి జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని తాజాగా వెల్లడైంది. అంతేకాదు ఈ ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ర్టాల్ ని తగ్గించడంలో బేషుగ్గా పనిచేస్తుంది. మెడిసిన్స్ కంటే.. ఈ ఉసిరికాయలు చాలా పవర్ ఫుల్ గా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేశాయని స్టడీస్ చెబుతున్నాయి.
ఉసిరి జ్యూస్ తయారు చేయడం పెద్ద ప్రాసెస్ ఏమో అని ఫీలవకండి. ఇందులో బెన్ఫిట్స్ ఎన్ని ఉన్నాయో.. తయారు చేయడం కూడా అంతే సులభం. దీన్ని స్వీట్ గా తీసుకోవాలంటే తేనె, స్వీట్ ఇష్టపడని వాళ్లు బ్లాక్ సాల్ట్ చేర్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ముందుగా రెండు పెద్ద ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి కప్ నీటిని చేర్చి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత బ్లాక్ సాల్ట్ లేదా తేనె.. ఏది కావాలంటే అది కలుపుకుని తాగాలి. ఈ జ్యూస్ ని తరచుగా తీసుకుంటే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే కొలెస్ర్టాల్ ని కరిగించవచ్చు.
ఉసిరికాయలు అందుబాటులో లేని వాళ్లు ఉసిరికాయ పొడి అయినా తీసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఆమ్లా పౌడర్ తీసుకుంటే చాలు డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. అయితే ఈ డైట్ ని ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. కనీసం 20 రోజులు నిత్యం ఈ పౌడర్ తీసుకుంటే.. రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.

Wednesday, February 17, 2016

ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న "అంతుచిక్కని రహస్యాలు" !

 పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం.

గురుద్వార :- పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది గురుద్వార. 1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.

యాగంటి, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వస్తోందని భక్తులు నమ్ముతారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు ఆలయం ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి స్వభావం పెరిగే తత్వం కలిగి ఉందని.. ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే తెలియజేస్తోంది.

లేపాక్షి, ఆంధ్రప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.

దార్వేశ్ దర్గా, పూనె :-ఇక్కడ మరో విచిత్రం. 90 కేజీల రాయి పూనెలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 11 మంది మనుషులు అంతకంటే ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. కరెక్ట్ గా 11 మంది ఒక రాయికి కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూ ఉంటుంది. భక్తుల తల పైనే ఆ రాయి తేలుతూ ఉంటుంది. అప్పుడు కమర్ అలీ దర్వేష్ అని భక్తులు గట్టిగా అరుస్తారు.

 తంజావూర్ :- తంజావూర్ లోని శివాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయమంతా గ్రానైట్ స్టోన్స్ తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతి పెద్ద నిర్మాణం ఈ తంజావూర్ ఆలయం. ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా.. ఎలాంటి మెటీరియల్ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ లోని శివాలయం :-తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.

శని శింగాపూర్ :- మహారాష్ర్టలో ఉన్న శని షింగాపూర్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈ ఊళ్లో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవు. తలుపులు లేకపోయినా.. ఇంతవరకు ఎప్పుడూ దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శని దేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. 2011లో ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది.

 అజంతా ఎల్లోరా సమీపంలోని కైలాశ ఆలయం :- ఈ కైలాశ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా.. పునాది నుంచి మొదలవుతుంది. కానీ.. కొండలనే శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.

పాములు :- మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

ఖబీస్ బాబా టెంపుల్ :-ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని ఖబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

 ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా విగ్రహం:- శ్రావణబెళగలలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. గోమతేశ్వర జైనుల గురువు.

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ :- అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్ర్ఫుద్దీన్ షా విలాయత్ గా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు. కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడి స్పెషాలిటీ.
Tuesday, February 16, 2016

వైసీపీలోకి నాగేంద్రబాబు?

మెగాఫ్యామిలీలో ఒక న్యూస్ కలకలం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు  వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాన్ బీజేపీ-టీడీపీలకు మధ్యలో ఉన్నాడు. చిరంజీవి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగేంద్రబాబు వైసీపీలో చేరుతారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్న నాగబాబును తన తో పాటు కోజడ్జిగా ఉన్న  రోజా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారట. మంచి భవిష్యత్ ఉంటుంది. వచ్చేసారి జగనే సీఎం అవుతారు.

మీకు అసెంబ్లీకి రావడం ఇష్టం లేకుంటే మీరు కోరుకున్నదగ్గర్నుండి లోక్ సభకు పంపే బాధ్యత నాదిఅని ఆమె మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం.జగన్ కూడా నాగబాబు వస్తే సంతోషం. రెడీ గా ఉంటే నేనే మాట్లాడుతా అని కూడా అన్నారట. అయితే ఇద్దరి సోదరులతో చర్చించి వైసీపీలో చేరుతారని సమాచారం. వేరే ఏ పార్టీలో చేరినా తను సామాన్య నేతగానే కొనసాగాల్సి ఉంటుంది. అదే వైసీపీలో మంచి పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చారట జగన్. తన సోదరులతో ఒక మాట అని ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్. ఇటు కాపు ఓట్లు కూడా నాగేంద్రబాబు చేరికతో కొంతైనా వస్తాయనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్.


Monday, February 15, 2016

స్త్రీపురుషులలో "శృంగార కోరికలు" విజృంభించాలంటే ?

శృంగారం విషయంలోనూ ప్రవర్తనారీతులు స్త్రీపురుషుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. భావప్రాప్తి పొందే విషయంలోనూ ఇరువురికి మధ్య తేడా ఉంటుంది. అలాగే శృంగారానికి సిద్ధమయ్యే విషయంలోనూ ఎవరి దారి వారిదే. మహిళల్లో కామ వాంఛలు పెరగాలంటే వారు తగినంతగా నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు అలాగే పురుషులో శృంగార భావనలు మొలకెత్తాలంటే వారు పోర్న్ దృశ్యాలను చూడాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని "యూనివర్సిటీ ఆప్‌ మిచిగాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌" పరిశోధకులు వెల్లడించారు. తగినంతగా నిద్రపోయిన మహిళల్లో శృంగార కోరికలు మొలకెత్తుతాయని, బాగా అలసిపోయిన మహిళలతో పోల్చుకుంటే ఎక్కువగా నిద్రపోయిన మహిళల్లో కామ నాడులు బాగా ఉత్తేజం పొందుతాయని ఆ పరిశోధనలో వెల్లడైంది.
మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో కామ వాంఛలు త్వరగా విజృంభిస్తాయని వెల్లడైది. వారు సినిమాల్లో వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను చూసినా ఉద్దీపన చెందుతారని పరిశోధకుడు డాక్టర్‌ నికోల్‌ ప్రాస్‌ చెప్పారు. మహిళలు శృంగారం పట్ల అనాసక్తత ప్రదర్శిస్తుంటే ముందుగా వారు నిద్ర గురించి పట్టించుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు.
 పరిశోధకులు స్త్రీపురుషులు నిద్రపోయే రీతులను, ఆ తర్వాత వారి లైంగిక అనుభవాలను అధ్యయనం చేశారు. ఈ రోజు బాగా నిద్రపోయిన మహిళలకు మర్నాడు శృంగార కోరికలు విజృంభిస్తాయట.

Sunday, February 14, 2016

"మా అమ్మ నన్ను పురిట్లోనే చంపాలనుకుంది" అన్న గవర్నర్ ?

తన తల్లి తనను పురిట్లోనే చంపాలనుకుందని గోవా గవర్నర్‌ మృదుల సిన్హా అన్నారు. 40ఏళ్లకు గర్భం దాల్చడాన్ని అసాధారణంగా భావించిన తల్లి గర్భస్రావం కావడానికి మందులు తాగిందని, తండ్రి కలగజేసుకుని శ్రద్ధ వహించడంతో తాను పుట్టానని ఆమె చెప్పారు. గోవాలోని అనాన్సీ పాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఈ విషయం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘బేటీ బచావో బేటీ పఢావో' పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తన జననం వెనక జరిగిన ఘటనలు గుర్తొచ్చాయన్నారు. సమాజం ఏమంటుందోనని చూడక తన తండ్రి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించి తానీ లోకంలోకి రావడానికి కారకులయ్యారని మృదుల తెలిపారు.
అప్పట్లో ఆడపిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులుఎదుర్కోవాల్సి వచ్చేదని, తండ్రి అవన్నీ ఎదుర్కొని తనకు చక్కని జీవితాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మోడీ ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పఢావో పథకానికి ‘పరివార్‌ బచావో' అన్న మరో పదాన్ని చేర్చాలని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లల పెంపకం మధ్య ఎటువంటి భేదాలు చూపకూడదని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆడపిల్లల విషయంలో తండ్రుల్లో ఎంతో మార్పొచ్చిందని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆడపిల్లల్ని చదివిస్తున్నారని, ఇది మంచి విషయమని హర్షం వ్యక్తం చేశారు.


Saturday, February 13, 2016

హరీష్ కి గేలం వేస్తున్నరేవంత్ రెడ్డి ?

తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి ఆపార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. బాబు నుండి కూడా పెద్దగా ప్రచారం చేసి పైకి తేవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే ఏపీలో ఆయనకు ఊపిరి తీసుకోలేనంత పని ఉంది.  ఇక టీఆర్ఎస్ లో కీలకంగా ఉండి ఒకప్పుడు రేవంత్, ఎర్రబెల్లి లాంటి వాళ్లకు ఎర్త్ పెట్టిన హరీష్ దూరంగా ఉంటున్నారు. బయటి ప్రపంచానికి తెలియకపోయినా కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే విషయం పొలిటికల్ సర్కిల్ లో బాగానే తెలుసు. వచ్చే ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి హరీష్ వెళ్తాడని టాక్. ఆయన్ను కనీసం డిప్యూటీ సీఎంగా ప్రకటించినా వెళ్తారని అంతా అనుకుంటున్నారు. కానీ అదే హరీష్ ని టీడీపీలోకి లాగితే బాగుంటుందని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. బద్ద శతృవులుగా బయటి ప్రపంచానికి తెలిసినా…రేవంత్-హరీష్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. రేవంత్ కూతురు పెళ్లికి…కేసీఆర్ కు ఇన్విటేషన్ ను పంపకపోయినా ఆయన స్వయంగా హరీష్ కి ఫోన్ చేసి రమ్మన్నారట. కార్డు పంపుతానంటే వద్దని అనడం వల్లే…వెనక్కి తగ్గారట. నేను వస్తే బాగోదని చెప్పారట.

ఇప్పుడు హరీష్ వస్తే కాంగ్రెస్ కంటే కూడా టీడీపీకే వచ్చే ఎన్నికల్లో స్కోప్ ఉంటుందని…భావిస్తున్నారట. సీఎం ఎవరు అవుతారనే విషయం పక్కన పెడితే…కేసీఆర్ ఆధిపత్యానికి గండికొట్టడానికి ఇది షార్ట్ కట్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈమేరకు ఆయనతో కూడా చర్చించినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. హరీష్ మాత్రం ఇలాంటి ప్రపోజల్స్ నా దగ్గర తేవద్దని కరాఖండిగా చెప్పారట. నేను టీఆర్ఎస్ ను వీడను. నాకు ఈ పదవి చాలని చెప్పినట్లు టాక్. అయినా ఇప్పుడు కాదు…బయటకు వచ్చే ఉద్దేశం ఉంటే…టీడీపీలోకి రావాలని కోరారట. చూద్దాంలే అది తర్వాత సంగతన్నారట. మొత్తానికి హరీష్ వస్తే తమ పార్టీ కి ప్లస్ అవుతుందనుకుంటున్నారట. కేసీఆర్ మీద కక్ష్య తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి మంత్రి హరీష్ కి గేలం వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ప్రతి మీటింగ్ లో కూడా మేనల్లుడిని పక్కకు పెట్టి కొడుకుకు పెత్తనం ఇచ్చాడని రేవంత్ విమర్శిస్తున్నారు.

 

Friday, February 12, 2016

వంటల్లో " కొబ్బరి నూనె"ను వాడితే ?

మామూలుగా అయితే నూనె మోతాదుకు మించి వాడితే శరీరానికి అంత మంచిది కాదని అంటుంటారు. ఏదైనా..ఎందులోనైనా ‘అతి’ కీడు చేస్తుంది. అలాగే వంటకాల్లో కూడా అధికంగా నూనెను వాడడంవల్ల కూడా బాడీలో కొవ్వు శాతం పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే కొబ్బరినూనెను వంటకాల్లో వాడడంవల్ల చాలా లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ నూనెతో శరీరానికి వయస్సు, ఎత్తుకు తగ్గ బరువును సమపాళ్ళలో వుంచుతుందట.

 సాధారణంగా మనం కొబ్బరి నూనెను తలకు పట్టించడానికి మాత్రమే వాడతాం. కానీ మన దేశంలో కేరళ రాష్ర్టంలో మాత్రమే కొబ్బరినూనెను వంటకాల్లో కూడా వాడే ట్రెడిషన్ వుంది. అందుకే వారంతా చాలా తెలివితో పాటు నాజూకుగా, పొడుగ్గా, ధృడంగా వుంటారు. ఈ నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల జీవక్రియలు వేగవంతంగా జరుగుతాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. మన శరీర బరువును తగ్గించడంలో కొబ్బరినూనె కీలక పాత్ర పోషిస్తుందట. ఈ నూనెతో తయారుచేసిన వంటకాలు త్వరగా జీర్ణమవుతాయి. శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడినుండి బయటపడేయడంలో కూడా కొబ్బరినూనె ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

 హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. యాంటీబ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్‌ లిపిడ్స్‌, క్యాప్పిక్‌, క్యాప్రిలిక్‌, లౌరిక్‌ ఆమ్లాలను కొబ్బరినూనె కలిగివుంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది. కాబట్టి షుగరు వ్యాధిగ్రస్థులకు ఇది చక్కగా పనిచేస్తుంది. గుండెకు హాని కలిగించే కొలెస్టరాల్‌ పెరగకుండా గుండెకు మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఈ నూనెలో ఉండేవి శాచ్యురేటెడ్‌ కొవ్వులు కావడం వల్ల ఎలాంటి హాని ఉండదు.

Thursday, February 11, 2016

"బాహుబలి 2" సినిమా చూసాక నన్ను ఎవరు పెళ్లిచేసుకోరేమో ? అంటున్న హీరో!

సౌత్ ఇండియన్ హీరోస్ లో మోస్ట్ బాచిలర్ హీరోస్ లో ఒకరు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి. తాజాగా ‘బెంగళూర్ నాటకాల్’ ప్రమోసనల్  ఇంటర్వ్యూ లో రానా ని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని ఇంటర్వ్యూ చేసే వారు ప్రశ్నిస్తే ? రానా మాట్లాడుతూ ‘ నేను ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేశాను.కమిట్మెంట్ ఇచ్చిన ఆ సినిమాలన్నిటినీ పూర్తి చేసుకున్నాక నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను.ఇక పెళ్లి గురించి చెప్పాలంటే..ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యాక చేసుకుంటాను. అంతేకాకుండా ’ఘజి’ చిత్రాన్ని పక్కనపెడితే, ‘బాహుబలి 2 ‘ చిత్రం లో నన్ను చూసాక నన్ను ఎవరు పెళ్లిచేసుకోరేమో ఎందుకంటే నేను ఆ చిత్రం లో చాలా క్రూరంగా కనిపించబోతున్నాను’ అని తెలిపాడు.


Wednesday, February 10, 2016

మధుమేహ రోగులకో తీపి వార్త !


 మధుమేహ రోగులకో తీపి వార్త. వీళ్ళ కోసం మార్కెట్లో కొత్త మందు వచ్చేసింది. డయాబెటిక్స్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నవారికోసం అయ్యే ఖర్చు దీనివల్ల 80 శాతం తగ్గుతుందని అంటున్నారు. ముంబైలోని గ్లెన్‌‌మార్క్  కంపెనీ టెనెలిగ్లిప్టిన్ అనే కొత్త మందును ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల గత ఆరునెలల్లో ఈ రోగుల రోజువారీ చికిత్స ఖర్చు చాలావరకు తగ్గిందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఈ ట్రీట్‌‌మెంటుకు రోజుకు సగటున 45 రూపాయలు ఖర్చవుతుండగా అది 9రూపాయలకు తగ్గిపోయిందట.. గ్లెన్‌‌మార్క్‌‌తో బాటు మరో 5 కంపెనీలు కూడా టెనెలిగ్లిప్టిన్ మందును తయారు చేస్తున్నాయి. మొదట గ్లిప్టిన్ ట్రీట్‌‌మెంటుకు సంవత్సరానికి రూ.16,200 (నెలకు రూ.1350) ఖర్చవుతుందని, అయితే ఈ మెడిసిన్ ట్రీట్‌మెంటుతో అది ఏడాదికి రూ. 3,285 (నెలకు 270 రూపాయలు) తగ్గుతుందని అంచనా వేశారు. అంటే మధుమేహ రోగులకు సంబంధించి దేశవ్యాప్తంగా రూ. 1300 కోట్లు ఆదా చేయవచ్చునని భావిస్తున్నారు. జిటాప్లస్, జిటెన్ మందులను గ్లెన్‌‌మార్క్ ఇదివరకే విడుదల చేసింది.
Tuesday, February 9, 2016

"అంటుకున్నచూయింగ్ గమ్" ను తీసివేయడం ఎలా ?

ఇప్పుడు చాలా మందికి చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి చూయింగ్ గమ్ మనం ధరించిన వస్త్రాలకు అతుక్కుంటుంది. లేదంటే ఒక్కోసారి మనకు తెలియకుండా దాని మీద కుర్చుంటాం. గట్టిగా అతు క్కుంటే వెంటనే దాన్ని తీసివేయలేం. అప్పటికప్పుడు దాన్ని తీసివేయటానికి చిన్న చిట్కా ఉంది. ఇంట్లో ఫ్రిజ్ ఉంటే దానిలోని ఉన్న ఐస్ గడ్డలను చూయింగ్ గమ్ మీద కొద్దిసేపు ఉంచితే అది వదులుగా అవుతుంది. అప్పుడు  తీసివేయటం సులభమవుతుంది. ఇది కేవలం బట్టలకే కాదు, ఫర్నిచర్, జుట్టుకు అతక్కున్నా ఈ చిట్కా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి.

Monday, February 8, 2016

కాపురాన్ని కూల్చిన ఫేస్‌బుక్ !

నేడు ప్రపంచంలో ఫేస్‌బుక్ ఓ వైరస్‌లా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా వుండనివారు కోట్లలో వున్నారు. దూరంగా వున్నవారిని ఒకటి చేస్తే.. దీని కారణంగా విడిపోయినవాళ్లూ లేకపోలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్ కారణంగా ఓ జంట విడిపోయేందుకు సిద్ధమైంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా ఇష్టం. ఐతే, ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు.


 షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కపుల్ ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వేర్వేరు పేర్లతో కొనసాగుతున్నారు. అనుకోకుండా ఈ ఫేక్ ఐడీలతోవున్న ఈ జంట వాళ్లిద్దరికీ మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇద్దరు మ్యారేజ్ కాలేదని చెప్పుకున్నారు. మరింత దగ్గరయ్యారు. ఆర్నెళ్లు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చేశారు. మంచిరోజు చూసుకుని ఇద్దరూ మీట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. తీరా కలిసేసరికి అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆ భార్యాభర్తలిద్దరు ఇంత జరిగాక కలిసి జీవించలేమని ఓ నిర్ణయానికి వచ్చేశారు. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.  చూశారుగా ఇలాంటి ఫేక్ ఐడీలు కాపురాలను ఎలా కూల్చుతాయో.. తస్మాత్ జాగ్రత్త! 

Sunday, February 7, 2016

"ఒక రూపాయి"తో దేశమంతా చుట్టేయవచ్చా?

భారీ ఖర్చుకు దిగకుండా ముంబైలో ఓ యువకుడు కేవలం ఒక రూపాయితో దేశమంతా చుట్టేందుకు పూనుకున్నాడు. ముంబైలోని జిగర్ నగడా అనే ఈ 27 ఏళ్ల యువకుడు తన కజిన్ రోనక్ జోషితోపాటు ఈ సాహసానికి దిగాడు. కేవలం రూపాయితో దేశమంతా చుట్టి రావాలన్నదే ఈయన ఆలోచన. ప్రయాణం ఖర్చులు తగ్గించుకోవాలన్నదే ఈయన ధ్యేయమట. ఫేస్ బుక్‌పై రూపాయి నాణెం ఫోటోను ముద్రించి.. నా ప్రయాణం ముంబై నుంచి ప్రారంభమైంది అంటూ పోస్ట్ చేశాడు.

వృత్తి రీత్యా ఫ్రీలాన్స్ సినీ అసిస్టెంట్ డైరెక్ట్ అయిన జిగర్, బుధవారం తెల్లవారు జామున ముంబైలోని వాసై ప్రాంతం నుంచి అహ్మదాబాద్‌కు శ్రీకారం చుట్టాడు. డబ్బుల్లేకుండా ఈ దేశంలో ప్రయాణించవచ్చా? అన్నది తెలుసుకోవడానికే తాను దీనికి పూనుకున్నానని అంటున్నాడు. మొదట వాసై నుంచి సూరత్ చేరుకున్నానని, అక్కడ రోడ్డుపక్కనున్న డాబాలో ఆహారం తీసుకుని తన ధ్యేయం గురించి చెప్పగా సిబ్బంది ప్రశంసించి డబ్బులేవీ తీసుకోలేదని తెలిపాడు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే తాను ప్రయాణిస్తానని వెల్లడించాడు. రాజస్థాన్‌లో ఆగకుండానే ఢిల్లీ చేరుకోవాలన్నది ఇతని ఆలోచనట. ఫోటోలు, చిన్నపాటి వీడియో క్లిప్పుల ద్వారా తాను ఎక్కడెక్కడ ప్రయాణం చేసిందీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయనున్నాడు.

Saturday, February 6, 2016

బాహుబలి దర్శకనిర్మాతల్ని అరెస్ట్ చేస్తారా?

మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో 'బాహుబలి2' సినిమాని డైరెక్టర్ రాజమౌళి మరింత జోష్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కేరళలోని త్రిసూర్ లో జరిగింది.  అయితే, ఇక్కడ ఏనుగులపై షూట్ చేసిన సీన్స్ చట్టవిరుద్ధమని జంతు హక్కుల పరిరక్షకుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని.. షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాహుబలి మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, బాహుబలి టీం వాదన మరోవిధంగా ఉంది. కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడినట్లు చెబుతున్నారు. 

Friday, February 5, 2016

"పొట్ట తగ్గాలంటే" నిద్రపోయేముందు ఈ డ్రింక్ త్రాగండి !

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుందని.. దాన్ని ఎలా సక్రమంగా సాగేలా జాగ్రత్తపడతారో.. వాళ్లకు బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
మెటబాలిక్ రేటు వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి. అయితే మెటబాలిజం రేటుని పెంచితే.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అయితే మెటబాలిజం స్థాయిని పెంచడానికి ఈ సింపుల్ డ్రింక్ ప్రయత్నించండి. ఇది మీ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తీసుకోవాలి.
2 గ్రేప్ ఫ్రూట్స్ , 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, అరగ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్ తాగాలి. ఇలా 12 రోజులు తాగిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 12 రోజులు కంటిన్యూగా తాగాలి. ఇలా ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అందడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.


Thursday, February 4, 2016

"పాత టూత్ బ్రష్" పడేస్తున్నారా ? ఐతే ఒక్కసారి ఇది చదవండి!

టూత్ బ్రష్ మార్చినప్పుడల్లా.. పాత టూత్ బ్రష్ పడేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని టూత్ బ్రష్ లు డస్ట్ బిన్ లో చేరుంటాయో కదూ. కానీ.. ఇకపై టూత్ బ్రష్ ని పడేయకుండా.. ఇంటి క్లీనింగ్ లో భాగం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పాత టూత్ బ్రష్ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. టూత్ బ్రష్ ని చాలా క్రియేటివ్ గా ఉపయోగించడం తెలిస్తే.. ఇంట్లోని వస్తువులను తళతళ మెరిపించవచ్చు. పాత టూత్ బ్రష్ ఉపయోగించుకునే క్రియేటివ్ ఐడియాస్ మీకోసం.

*ట్యాప్స్ చుట్టూ పేరుకున్న మురికి వదిలించడానికి పాత టూత్ బ్రష్ చక్కటి పరిష్కారం. టూత్ బ్రష్ ని వెనిగర్ లో ముంచి ట్యాప్ చుట్టూ రుద్దడం వల్ల మురికి పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. 

*షూస్ కి పేరుకున్న బురద, దుమ్ము, ధూళిని పాత టూత్ బ్రష్ తో ఈజీగా వదిలించవచ్చు.

*ఇక కంప్యూటర్ కీ బోర్డ్స్ లో ఎంత దుమ్ము ఉంటుందో చెప్పనక్కరలేదు. దాన్ని క్లీన్ చేసినా.. సందుల్లో ఇరుక్కున్న దుమ్ము మాత్రం బయటకు రాదు. కాబట్టి.. ఈసారి పాత టూత్ బ్రష్ సహాయంతో కీబోర్డ్ దుమ్ము వదిలించండి.

*దువ్వెనల్లో పేరుకున్న మురికి తొలగించడానికి కూడా పాత టూత్ బ్రష్ చక్కగా ఉపయోగపడుతుంది.

 *మీ నగల్లో మురికి చేరుకుందా ? అయితే.. పాత టూత్ బ్రష్ తీసుకుని క్లీన్ చేసి చూడండి. కొత్తవాటిలా మెరిసిపోతాయి.

 *అంతేకాదండోయ్.. మీ పెదాలపై ఉండే డెడ్ సెల్స్ తొలగించడానికి కూడా మీ పాత టూత్ బ్రష్ ఉపయోగించవచ్చు. బ్రష్ ని నీటిలో తడిపి.. పెదాలపై రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

 చూశారుగా ఇకపై పాత బ్రష్ ని పడేయకుండా ఇంట్లో  వస్తువులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి.

Wednesday, February 3, 2016

"రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం"వల్ల శరీరం పొందే ఆరోగ్యప్రయోజనాలు!

ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా (వాత, కఫా మరియు పిత్తాశయ) వంటి ఈ మూడు దోషాలను మీ శరీరంలో సమతుల్యం చేసే సామర్థ్యంను కలిగి ఉంటుంది. అంతే కాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను ఎక్కువగా కలిగిస్తుంది. రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం ఆయుర్వేదం ప్రకారం 'తామ్ర జలం' అంటారు మరియు ఇలా రాగిపాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వచేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. రాగిపాత్రలోని నీరు త్రాగడం వల్ల శరీరం పొందే కొన్ని ఆరోగ్యప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
 
రాగి ప్రకృతి పరంగా ఓలిగో డైనమిక్ అని చెప్పబడుతున్నాయి. (రాగిలో బ్యాక్టీరియా శుద్ది చేసే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు ఇది ఇంకా సాధారణ జబ్బులైన డయోరియా, డీసెంటరీ మరియు జాండీస్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు నీరు కలిషిమతమైనవని మీరు కనుక భావిస్తుంటే, నీటిని రాగిపాత్రలో నిల్వచేసి త్రాగడం వల్ల ఆరోగ్య కరమైన మరియు క్లీన్ వాటర్ ను మీరు త్రాగవచ్చు.
 
నిపుణులు అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ వ్యాధితో భాధపడే వారి శరీరంలో కాపర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. రాగిపాత్రలోని నీరు త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగుపడవచ్చు.
 
రాగిలో చాలా శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంది . ఈ కంటెంట్ ముఖ్యంగా నొప్పులను నివారించడానికి ఏకారణం చేతైనా కీళ్లవాతంతో పోరాడటానికి శక్తివంతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఇటువంటి నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి రాగిపాత్రలోని నీటిని తీసుకోవాలి.
 
 ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ప్రతి రోజూ ఉదయం రెగ్యులర్ గా రాగిపాత్రలోని నీటి త్రాగడం వల్ల మొటిమలు లేని ఒక స్పష్టమైన చర్మంను పొందవచ్చునని సలహా.
 
మీ ముఖంలో మరియు శరీరం మీద చర్మంలో సన్నని చారలు, వయస్సు మీదపడుతున్న లక్షణాలు కనబడుతున్నట్లైతే రాగి పాత్రలోని నీరు  ఒక ఉత్తమ హోం రెమెడీ . ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కణాల ఏర్పాటు లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడే లక్షణాలు రాగిలో అధికంగా ఉన్నాయి . కొత్తకణాలు ఏర్పాటుకు ,ఆరోగ్యకరమైన చర్మం కణాలు , ఉత్పత్తి లో సహాయపడుతుంది .
 
ఎసిడిటీ , గ్యాస్ లేదా కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం వంటి సమస్యలను రాగిపాత్రలోని నీళ్ళు ఒక ఉత్తమ హోం రెమెడీగా సహాయపడుతుంది . ఆయుర్వేదం ప్రకారం మీ పొట్టను డిటాక్స్ ఫై చేసుకోవాలంటే, ఒక పెద్ద గ్లాసు నీళ్ళను ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.
 
మీరు బరువు తగ్గడానికి మీ డైట్ సక్రమంగా పనిచేయకపోతే, రాగిపాత్రలో నీటిని నిల్వచేసి, రెగ్యులర్ గా త్రాగడం మొదలు పెట్టండి. మీ జీర్ణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది . ఫ్యాట్ ను కరిగించి  శరీరం నుండి బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది .
 
రాగి మన శరీరంలో జీవక్రియలకు అత్యంత అవసరం . సెల్ ఫార్మేషన్ నుండి ఐరన్ షోషణ వరకూ సహాయపడుతుంది.  సెల్ ఏర్పాటు నుండి ఇనుము యొక్క శోషణ లో సహాయం చేస్తుంది. రాగి మన శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరం అయ్యే ముఖ్య ఖనిజం. ఆ కారణం చేత మనల్ని రక్తహీనత నుండి రక్షిస్తుంది.
 
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం , రాగి రక్తపోటు , గుండె రేటు నియంత్రించేందుకు సహాయపడుతుందని కనుగొనబడింది మరియు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది . ఇది కూడా ఫలకం వృద్ధి నిరోధించడానికి సహాయపడుతుంది మరియు గుండెకు మంచి రక్తం  ప్రవాహం అనుమతించడానికి రక్తనాళాలుఫై  ప్రభావం చూపుతుంది. గొప్ప ఫలితాలు కోసం రాగి పాత్రలో నిల్వచేసిన నీటినిత్రాగడానికి   ప్రయత్నించండి .
 
చాలా త్వరగా సర్వసాధారణంగా వచ్చే మరొక వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ రోగి ని  బలహీన పరిచేలా చేస్తుంది. అందుకు రాగి ఎలా సహాయం చేస్తుంది? రాగిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్ మరియు  క్యాన్సర్ కణాలతో పోరాడే  లక్షణాలు అధికంగా ఉన్నాయి .


Tuesday, February 2, 2016

ఆ లింక్ పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ నాశనమే ?

స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఓ మోసపూరిత వైరస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్ల ముసుగులో CrashSafari.com అనే అడ్రస్‌తో వస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామింగ్ మొత్తం దెబ్బతింటుంది.


వెంటనే ఫోన్ రీస్టార్డ్ ఆప్షన్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా ఇంకా యాప్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. CrashSafari లింక్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే స్మార్ట్‌ఫోన్‌ల పై వేగంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్.. అర్థంకాని భాషలో వచ్చే మెసేజ్ లింక్స్ పై క్లిక్ చేయకండి.
Monday, February 1, 2016

"దోమ" దెబ్బకు "2018 వరకూ స్త్రీలు గర్భధారణకు దూరం"గా వుండాలంటున్నదేశాలు ?

ఒకప్పుడు ఎబోలా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఇప్పుడు ఇంకో వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అదే జైకా వైరస్. రోజు.. రోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువతుందే కానీ తగ్గడంలేదు. అసలు ఈ జైకా వైరస్ కు కారణం ఎజెపి దోమ. ఈ దోమ కుట్టడం ద్వారా వైరస్ వ్యాపించి.. జ్వరంతోపాటు డెంగీ, చికున్‌ గున్యా, యెల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు కూడా విస్తరిస్తాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ రావడం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు రావడం.. పిల్లలకు శారీరక పెరుగుదల ఉండకపోవడం.. చిన్నచిన్న తలలుగా పుట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి విఫలమవుతున్నాయి. దీంతో చేసేది లేక ఈ సమస్య పూర్తిగా సమసిపోయేంత వరకూ గర్భధారణకు దూరంగా వుండాలని.. 2018 వరకూ స్త్రీలు గర్భం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఎల్‌సాల్వడార్‌, కొలంబియా, బ్రెజిల్‌ ప్రభుత్వాలు మహిళలకు సూచిస్తున్నాయి. అంతేకాదు ఈ వైరస్ చిన్నచిన్నగా బ్రెజిల్‌తో పాటు పలు లాటిన్‌ అమెరికా దేశాలలో ఈ వైరస్‌ విస్తరించటంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అధికారులు తొందరగా మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకొని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్త్తుంది.