CSS Drop Down Menu

Saturday, January 30, 2016

జీన్స్" ఫ్రంట్ జేబు లో చిన్నజేబు" ఎందుకుంటుందో తెలుసా ?


జీన్స్.. యంగ్, యూత్, ఓల్డ్ అనే తేడా లేకుండా ధరించేది. జీన్స్ అంటే అదో క్రేజ్..  రకరకాల మోడల్స్ లో క్రేజీ కలర్స్ లో దొరికే జీన్స్ లో ఒక సీక్రెట్ ఉంది. చాలా  మందికి ఈ సీక్రెట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు.. జీన్స్ వేసుకునే వాళ్ల ప్యాంట్లకు ముందు రెండు పాకెట్స్, వెనుకు రెండు పాకెట్స్ కామన్. కానీ ఫ్రంట్ రైట్ సైడ్ పాకెట్ లో ఇంకో చిన్న పాకెట్ ఉండటం నోటీస్ చేసే ఉంటారు. అయితే చాలా మందికి అసలు ఈ పాకెట్  ఎందుకనేది ఒక డౌట్. అఫ్ కోర్స్.. కొంత మంది దీన్ని సీక్రెట్ పాకెట్ గా వాడుతుంటారు. కొంత మంది ఫ్యాషన్ అనుకుంటారు. కానీ ఈ పాకెట్ లో ఒక హిస్టరీ దాగి  ఉంది. 




మోడ్రన్  డేస్ నుంచి అందుబాటులోకి వచ్చిన జీన్స్ ప్యాంట్ వాడే వాళ్లలో కళాకారులు కూడా ఉండేవాళ్ళు. గిటార్ ప్లేయర్లు  గిటార్ పిక్ ఈ మిని పాకెట్ లో పెట్టుకునేందుకు  అని ఊహించారు. తరువాత పెన్ డ్రైవ్ లు పెట్టుకునే పాకెట్  గా వాడారు. అయితే చాలామంది యూత్ ఆ పాకెట్ ను కండోమ్స్ దాచిపెట్టుకునే పాకెట్ గా వాడుతుంటే  కొంతమంది మిగిలిన చిల్లర వేసుకునే పాకెట్ గా వాడుతున్నారు. కానీ అసలు కథ ఏంటంటే...ఈ పాకెట్ వాచ్ ఉంచుకోవడానికి పెట్టారట. 1880లో కౌ బాయ్స్  వాచ్ లు వాడేవాళ్లట. ఈ వాచ్ లకు ఒకచెయిన్  తగిలించి ఎటువంటి డ్యామేజి తగలకుండా వెయిస్ట్ కోట్ జేబులో ఉంచుకునే వాళ్లట. అయితే దీన్ని కొద్దిగా మాడ్రనైజ్ చేసి లెవి స్ట్రాస్ కంపెనీ ఈ మిని పాకెట్  అరేంజ్ చేసిందట. 







    

0 comments:

Post a Comment