CSS Drop Down Menu

Wednesday, January 27, 2016

"మనిషి కన్నా జంతువే మిన్న" అని నిరూపించిన సంఘటన!

ఒక పిచ్చి కుక్క రోడ్డు ప్రక్కన ఉన్న ఒక కుక్క పిల్లను కరవడానికి వచ్చింది.
అక్కడే చెట్టుపైన ఉన్న కోతి వెంటనే క్రిందికి దిగి ,ఆ పిచ్చి కుక్కను అడ్డుకొని,
ఆ కుక్క పిల్లను కాపాడింది.

అక్కడి నుంచి ఆ పిచ్చి కుక్క వెళ్లేంత వరకు , తన ఒడిలో కూర్చోబెట్టుకొని ,
ఆ కుక్క పిల్లను తన సొంత బిడ్డలా చూసుకుంది.

తర్వాత మళ్ళీ ఆ పిచ్చి కుక్క వచ్చి కరుస్తుందేమో అని ఆ కుక్క పిల్లను పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ తల్లడిల్లిపోయింది.ఆ కోతి పడే తపనను చూసి ,అక్కడే ఉన్న కొందరు ఒక పాత్రలో పాలు పోశారు. కుక్క పిల్ల ఆ పాలు త్రాగేటప్పుడు కూడా కోతి తన చేతులను అడ్డుపెట్టి ఎలా రక్షణగా నిలబడిందో ఒక్కసారి చూడండి.



ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నప్పుడు " మనకెందుకులే " అని చూసీ చూడనట్లు వెళ్ళే వాళ్లకు ఇలాంటి సంఘటనలు కనువిప్పు కలిగించాలి.

0 comments:

Post a Comment