CSS Drop Down Menu

Tuesday, January 26, 2016

"నాన్నకు ప్రేమతో" సుకుమార్ కు నచ్చ లేదట ?

హీరో ట్రెండీ గా ఉన్నాడు, బ్యాక్ డ్రాప్ బాగుంది.. కలెక్షన్లూ బాగున్నాయి. కానీ నాన్నకు ప్రేమతో సినిమాను  డైరెక్ట్ చేసిన సుకుమార్ కు మాత్రం ఈ సినిమా  నచ్చ లేదట. బాగా టైం తీసుకుని నాన్నకు ప్రేమతో సినిమాను ఇంకా బాగా తీద్దామనుకున్నాను. కానీ నా మెడ మీద సంక్రాంతి రేస్ కత్తి పెట్టి ఎన్టీఆర్  తొందర చేశారని కామెంట్ చేశాడట సుకుమార్. కావలసినంత టైం లేకపోవడం వల్ల  క్వాలిటీ ఎడిటింగ్ ఇవ్వలేకపోయానని తెగ ఫీలైనట్టు టాలీవుడ్ టాక్.

అంతే కాదట,.. డైరెక్టర్  కంటే రైటర్ గానే  బాగుంటానని కూడా ఫీలయ్యాడట సుకుమార్. సినిమా టాక్ బాగానే ఉంది కదా..ఇప్పుడెందుకీ వేదాంతం? అని కొందరంటుంటే,, అదేం కాదు. సుకుమార్  డైరెక్షన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు.. దానికి ఇలా ప్రిపేర్ అవుతున్నట్టు్న్నాడని ఫిల్మ్ నగర్ లో కామెంట్లు వినబడుతున్నాయట.
 

0 comments:

Post a Comment